రజనీకాంత్‌తో సినిమా చేసే బంపర్ ఆఫర్.. చేజార్చుకొన్న యంగ్ స్టార్ డైరెక్టర్!
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా నటుడు, దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో రూపొందిన లూసిఫర్ చిత్రం బాక్సాఫీస్ భారీ విజయాన్ని అందుకొన్న విషయం తెలిసిందే. పలు భాషల్లో ఈ చిత్రం రీమేక్ చేయబడి అనూహ్యమైన విజయాన్ని సాధించింది. అలాంటి బ్లాక్ బస్టర్ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న లూసిఫర్ 2 సినిమా టీజర్ ఆవిష్కరణ కొచీలో గ్రాండ్‌గా జరిగింది. ప్రముఖ నిర్మాణ సంస్థలు లైకా ప్రొడక్షన్స్, ఆశీర్వాద్ సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను తెలుగు, మలయాళ, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో రిలీజ్ చేశారు. భారీగా జరిగిన ఈవెంట్ గురించిన ఆసక్తికరమైన విషయాలు, ప్రముఖులు వెల్లడించిన వివరాల్లోకి వెళితే..
L2ఇ ఎంపురాన్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని జీకేఎం తమిళ్ కుమరన్ నేతృత్వంలో, ఆశీర్వాద్ సినిమాస్ అధినేత ఆంటోని పెరుంబవుర్ సినిమాను నిర్మించారు.ఈ సినిమా ద్వారా ఇప్పటి వరకు తమిళ సినిమా పరిశ్రమకే పరిమితమైన నిర్మాత సుభాస్కరన్ తాజాగా మలయాళ సినీ రంగంలోకి అడుగుపెడుతున్నారు. ఈ సినిమా టీజర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని సూపర్ స్టార్ మమ్ముట్టి చేతుల మీదుగా చేశారు. ఈ వేడుకలో మలయాళ సినిమా ప్రముఖులు మంజు వారియర్, టొవినో థామస్, అజ్మల్ తదితరులు హాజరయ్యారు.

లూసిఫర్ 2 టీజర్ విషయానికి వస్తే.. పవర్‌ఫుల్‌గా కనిపించింది. నార్త్ ఇరాక్‌లో నివసించే ఖురేషీ విజువల్స్ చూపించడం ద్వారా టీజర్ ఆసక్తికరంగా ప్రారంభమవుతుంది. నీ చుట్టూ ఉన్నవాళ్లంతా మోసగాళ్లు అని ఏదో ఒక రోజు అనిపిస్తుంది. అప్పుడు మీ నాన్న లేకుంటే నిన్ను ఆదుకోగలిగిన వాడు ఒక్కడే ఉంటాడు. అతడే స్టీఫెన్ అనే డైలాగ్‌తో మోహన్ లాల్ క్యారెక్టర్‌ను పరిచయం చేశారు. ఈ టీజర్‌లో ఈ యుద్ధం మంచికి, చెడుకి కాదు. చెడుకి, చెడుకి మధ్య అనే పవర్‌ఫుల్ డైలాగ్ హై రేంజ్‌లో వినిపిస్తుంది.
జగదీష్ స్టీఫెన్ అనే వ్యక్తిని హిందువులు మహిరావణుడు, ముస్లింలు ఇబ్లిస్ అని పిలుచుకొంటారు. క్రిస్టియానిటిటీలో ఇతినిక ఒకే ఒక పేరుంది. అదే లూసిఫర్ అని ఓ రేంజ్‌లో ఎలివేషన్ ఇస్తారు. ఖురేషి అబ్రామ్ అని మోహన్‌లాల్ తన మరో పేరుని చెప్పడం.. మిలటరీ వాళ్లు స్టీఫెన్‌ను టార్గెట్ చేయడం.. దిస్ డీల్ విత్ డెవిల్ అని మోహన్ లాల్ చెప్పటం.. ఒక్క మాట భాయ్ జాన్, నేను ఎదురు చూస్తున్నాను అని చివరో పృథ్వీరాజ్ సుకుమారన్ చెప్పే డైలాగ్ తో టీజర్ ముగుస్తుంది. ఈ టీజర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేలా చేసిందని చెప్పవచ్చు.
లూసిఫర్ 2 సినిమా టీజర్ లాంఛ్ సందర్బంగా పృథ్వీరాజ్ సుకుమార్ మాట్లాడుతూ.. ఈ సినిమా ద్వారా లైకా ప్రొడక్షన్, ప్రముఖ నిర్మాత సుభాస్కరన్ మలయాళ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. అయితే దీని వెనుక చాలా పెద్ద కథే ఉంది. ఓ సందర్భంలో రజనీకాంత్‌ను డైరెక్ట్ చేసే అవకాశాన్ని సుభాస్కరన్ ఇచ్చారు. అయితే ఆ బంపర్ ఆఫర్‌ను నేను వినియోగించుకోలేకపోయాను. అయితే నీవు రజనీకాంత్‌ను డైరెక్టర్ చేయలేవా? అని ఆయన అడిగితే.. నేను చేయగలను. కానీ ఇప్పుడు నా వల్ల కాదని చెప్పానని పృథ్వీరాజ్ సుకుమారన్ అన్నారు.
అయితే ఇప్పుడు ఏం సినిమాలు చేస్తున్నావని సుభాస్కరన్ అడిగితే.. లూసిఫర్ 2 సినిమా చేస్తున్నానని చెప్పాను. దాంతో ఎక్సైటింగ్ అయిన ఆయన నేను ఈ సినిమాలో ఎలా భాగస్వామ్యం అవ్వగలను అని అడిగితే.. మీరు నిర్మాతగా మారవచ్చని చెప్పాను. అలా ఈ సినిమాను లైకా, ఆశీర్వాద్ సంస్థలు భాగమయ్యాయి అని పృథ్వీరాజ్ సుకుమారన్ చెప్పారు.


Click it and Unblock the Notifications











