అదొక వెర్రి, వాళ్లకు ఫ్యాషన్.... #మీటూ మూమెంట్‌పై సూపర్ స్టార్ షాకింగ్ కామెంట్స్!
మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ #మీటూ ఉద్యమంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. #మీటూ పేరుతో ఆరోపణలు చేయడం కొందరికి ఫ్యాషన్ అయిపోయిందంటూ మండి పడ్డారు. లైంగిక వేధింపుల సమస్యలకు వ్యతిరేకంగా సాగుతున్న ఇలాంటి కాంపెయిన్ మీద మోహన్ లాల్ స్పందించిన తీరు అందరినీ ఆశ్చర్య పరిచింది.
దుబాయ్‌లో మీడియాతో సమావేశం అయిన సందర్భంగా మోహన్ లాల్ ఈ షాకింగ్ కామెంట్స్ వ్యాఖ్యలు చేశారు. భారీ వరదల వల్ల నష్టపోయిన కేరళ రాష్ట్రాన్ని ఆదుకోవడంలో భాగంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి నిధులు సమకూర్చే కార్యక్రమంలో భాగంగా మోహన్ లాల్ దుబాయ్ వెళ్లారు.

#మీటూను ఉద్యమంగా పరిగణించను అంటున్న మోహన్ లాల్
‘అసలు #మీటూ అనేదాన్ని నేను ఉద్యమంగానే భావించను. ఈ మధ్య కాలంలో ఇదొక వెర్రిగా మారింది. నెమ్మది నెమ్మదిగా #మీటూ ఆరోపణలు చేయడం కొందరికి ఫ్యాషన్‌గా మారిపోతుంది. ఇలాంటి వాటి వల్ల మలయాళం ఇండస్ట్రీకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒక వేళ వచ్చినా ఎక్కువ కాలం నిలబడవు' అని మోహన్ లాల్ అన్నారు.

కేవలం సినీ ఇండస్ట్రీకి ఆపాదించొద్దు
సెక్సువల్ హరాస్మెంట్ లాంటి సంఘటనలు జీవితంలో ఎప్పుడైనా జరుగవచ్చు. అన్ని రంగాల్లో ఇలాంటివి ఉన్నాయి. కేవలం సినిమా ఇండస్ట్రీకి మాత్రమే దీన్ని ఆపాదించడం సరికాదు అని మోహన్ లాల్ అభిప్రాయ పడ్డారు.

గతంలోనూ మోహన్ లాల్ తీరుపై విమర్శలు
ఓ నటికి సంబంధించిన సెక్సువల్ హరాస్మెంట్ ఇష్యూలో నటుడు దిలీప్ మీద నమోదైన కేసులో కూడా మోహన్ లాల్ వ్యవహార శైలి విమర్శలకు దారి తీసిన సంగతి తెలిసిందే. మలయాళం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(అమ్మా) అధ్యక్షుడిగా మోహన్ లాల్... దిలీప్‌కు అనుకూలంగా తీసుకున్న కొన్ని నిర్ణయాలను పలువురు నటీమణులు వ్యతిరేకించారు. వారంతా ‘ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్'గా ఏర్పడ్డారు.

మోహన్ లాల్ సినిమాలు
మోహన్ లాల్ నటించిన ‘ఒడియన్' చిత్రం డిసెంబర్ 14న విడుదలకు సిద్ధమవుతోంది. దీంతో పాటు ప్రస్తుతం ఆయన ‘లూసిఫెర్' అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయనకు జోడీగా మంజు వారియర్ నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











