Year Ender 2023: 2023లో అందరి మనసుల్లో నిలిచిపోయిన టాప్ 5 మలయాళ చిత్రాలు ఇవే.. మీకు నచ్చిన సినిమా ఉందా?
మరో మూడు నాలుగు రోజుల్లో 2023 సంవత్సరానికి గుడ్ బై చెప్పేసి.. 2024 ఇయర్ కు వెల్ కమ్ చెప్పబోతున్నాం. అయితే ఈ ఏడాది సినీ రంగంలో ఎన్నెన్నో అద్భుతమైన చిత్రాలు వచ్చాయి. తెలుగుతో పాటు మరెన్నో భాషల్లో సూపర్ డూపర్ హిట్టు చిత్రాలు వచ్చి సినీ ప్రియులను తెగ అలరించాయి. అయితే ఈ ఏడాది వచ్చిన టాప్ 5 మలయాళ చిత్రాలు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయాయి. దేశం మొత్తం మెచ్చిన టాప్ 5 మలయాళ సినిమాల లిస్టును తాజాగా ఆర్మాక్స్ సంస్థ విడుదల చేసింది. అయితే ఆ సినిమాలు ఏవో.. అందులో మీకు నచ్చిన చిత్రం ఏదైనా ఉందా అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
1. 2018
2018లో కేరళ వరదల సమయంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సనిమా తెరకెక్కింది. జూడ్ ఆంథనీ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2023 మే 5వ తేదీన విడుదల అయింది. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం కేవలం 11 రోజుల్లోనే 100 కోట్లు వసూలు చేసింది. దీంతో ఇప్పటి వరకు మలయాళంలో అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా 2018 నిలిచింది.

2. కన్నూర్ స్క్వాడ్
కన్నూర్ స్క్వాడ్.. మలయాళ భాషలో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ స్టోరీ ఇది. మమ్ముట్టి కంపెనీ బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమాకు రాబి వర్గీస్ రాజ్ దర్శకత్వం వహించాడు. మమ్ముట్టి, రోనీ డేవిడ్ రాజ్, అజీస్, శబరీష్ వర్మ, కిశోర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను సెప్టెంబర్ 28న విడుదల చేశారు. అద్భుతమైన టాక్ తో హిట్టు కొట్టిన ఈ చిత్రం ప్రస్తుతం ఓటీటీలోకి కూడా వచ్చేసింది.
3. రోమాంచం
కామెడీ, హరర్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాను ఫిబ్రవరి 3వ తేదీన విడుదల చేశారు. 2 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద భారీ ప్రభంజనమే సృష్టించింది. ఎవరూ ఊహించని స్థాయిలో హిట్టు కొట్టిన ఈ సినిమాకు పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఉన్నారు.
4. ఆర్డీఎక్స్
RDX.. 2023 ఆగస్టు 25వ తేదీన విడుదల అయిన ఈ సినిమాకు నహాస్ హిదాయత్ దర్శకత్వం వహించారు. వీకెండ్ బ్లాక్ బస్టర్స్ కింద సోఫియా పాల్ ఈ చిత్రాన్ని నిర్మించగా.. షేన్ నిగమ్, ఆంటోనీ వర్గీస్, నీరజ్ మాధవ్ టైటిల్ పాత్రల్లో కనిపించి మెప్పించారు. 8 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీసు వద్దద 100 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

5. కాథల్ ది కోర్
జియో బేబీ దర్శకత్వంలో వచ్చిన కాథల్ ది కోర్ సినిమాలో మమ్ముట్టి, జోతికలు హీరోహీరోయిన్లుగా నటించారు. నవంబర్ 23వ తేదీన విడుదల అయిన ఈ సినిమాను రెండు మూడు దేశాలు బ్యాన్ చేయగా.. ఇండియాలో మాత్రం చాలా మంది ఈ సినిమాకు పాజిటివ్ రీవ్యూలు ఇచ్చారు. మరెంతో మంది ఈ చిత్రాన్ని చూసేందుకు ఆసక్తి కనబర్చారు.


Click it and Unblock the Notifications











