ప్రముఖ నిర్మాతల మీద ఐటీ దాడులు.. దృశ్యం 2 నిర్మాత సహా ఎవరెవరి పై రైడ్స్ అంటే?

సినీ పరిశ్రమకు చెందిన బడా ప్రొడ్యూసర్స్ మీద ఐటీ శాఖ కన్నేసింది.. అయితే అది తెలుగు సినీ నిర్మాతలు కాదు మలయాళ సినీ నిర్మాతలు ముగ్గురి ఇళ్ళ మీద ఆఫీసుల మీద ఏకకాలంలో ఐటీ శాఖ దాడులు నిర్వహిస్తోంది.. అయితే ఐటీ శాఖ దాడులు నిర్వహిస్తున్న ప్రొడ్యూసర్స్ లో ఇటీవల దృశ్యం 2 తెలుగు సినిమాకు ఒక నిర్మాతగా వ్యవహరించిన ఆంటోనీ పెరంబవూర్ ఆఫీసుల మీద ఇళ్ల మీద కూడా రైట్స్ జరుగుతూ ఉండటం సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే..

బడా ప్రొడ్యూసర్స్ మీదే

బడా ప్రొడ్యూసర్స్ మీదే

మోహన్ లాల్, మీనా ప్రధాన పాత్రలో నటించిన దృశ్యం సినిమా ఎంత సూపర్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ సినిమా మొదటి భాగాన్ని తెలుగు తమిళ కన్నడ హిందీ భాషల్లో రీమేక్ చేశారు. ఈ సినిమా రెండో భాగం కూడా ఈ ఏడాది మొదట్లో మలయాళంలో విడుదల కాగా సూపర్ హిట్ గా నిలిచింది. ఇక అదే సినిమాని తెలుగులో దృశ్యం పేరుతో మలయాళంలో సినిమా తెరకెక్కింది. జీతూ జోసెఫ్ తెలుగులో కూడా తెరకెక్కించారు.

 ఐటీ రైడ్స్

ఐటీ రైడ్స్

వెంకటేష్ హీరోగా మీనా హీరోయిన్ గా రూపొందిన ఈ సినిమా కొద్ది రోజుల క్రితమే అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదల కాగా మంచి స్పందన కూడా అందుకుంటోంది. ఈ సినిమా తెలుగులో సురేష్ బాబు నిర్వహించగా ఒరిజినల్ మలయాళ సినిమా నిర్మించిన ఆంటోనీ తెలుగు సినిమా కి కూడా సహ నిర్మాతగా వ్యవహరించారు. ఇప్పుడు ఆయన మీద సహా మరికొందరు మీద ఐటీ రైడ్స్ జరుగుతూ ఉండటం సంచలనంగా మారింది.

 ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు

ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు


ముగ్గురు మలయాళ సినీ నిర్మాతల కార్యాలయాలలో ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఆంటోనీ పెరంబవూర్, ఆంటో జోసెఫ్, లిస్టిన్ స్టీఫెన్ కార్యాలయాలపై దాడులు జరిగాయి. ఆదాయపు పన్ను స్లీత్‌లు ప్రధానంగా OTT ప్లాట్‌ఫారమ్‌లతో జరిగిన లావాదేవీలను పరిశీలిస్తున్నారు. కొచ్చి ఇన్‌కమ్ ట్యాక్స్ పరిధిలో ఉన్న ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ (టీడీఎస్)పై దాడులు నిర్వహిస్తున్నారు.

మధ్యాహ్నం ప్రారంభమై

మధ్యాహ్నం ప్రారంభమై

మధ్యాహ్నం ప్రారంభమైన దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ముగ్గురు నిర్మాతల సినిమాలు ఇటీవలే OTT ప్లాట్‌ఫారమ్‌ లలో విడుదల చేయబడ్డాయి. ఇందులో ఇద్ద‌రి సినిమాలు కొన్ని 150 కోట్ల రూపాయ‌లు వ‌సూలు చేశాయ‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఆదాయపు పన్ను శాఖ అధికారులు టీడీఎస్ సరిగ్గా చెల్లించారా? లావాదేవీలు సరైన పద్ధతిలో జరిగాయా? అనేది చెక్ చేస్తున్నారు.

టీడీఎస్‌కు సంబంధించి

టీడీఎస్‌కు సంబంధించి

ఈ నిర్మాతల ఆర్థిక మూలం గురించి కూడా పరిశీలిస్తున్నారు. నిర్మాతల టీడీఎస్‌కు సంబంధించి ఆదాయపు పన్ను శాఖ క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహిస్తుంది. అయితే, ఈ రైడ్ సాధారణ తనిఖీ లాంటిది కాదని ఐటీ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. నిర్మాతలు వివిధ మార్గాల్లో ఆదాయాన్ని సమకూరుస్తారని, వారందరూ టీడీఎస్ వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుందని ఆ అధికారి తెలిపారు.

Recommended Video

Vaishnav Tej,Rakul Preet Singh Interview About Kondapolam Movie
 కార్యాలయాల్లోనే దాడులు

కార్యాలయాల్లోనే దాడులు

పూర్తిగా నిర్మాతల కార్యాలయాల్లోనే దాడులు నిర్వహిస్తున్నారు. అధికారులు ఎవరి ఇళ్లకు చేరుకోలేదని అంటున్నారు. మలయాళంలో దాదాపు 120 సినిమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. థియేటర్లు నెమ్మదిగా సాధారణ స్థితికి వచ్చినప్పటికీ, చాలా సినిమాలు OTT విడుదలకు మొగ్గు చూపుతున్నట్లు సూచనలు ఉన్నాయి. ఒకవేళ అందుకే రైడ్స్ జరుగుతున్నాయా? అనే అనుమానాలు కూస్తో వ్యక్తం అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X