టాలీవుడ్ యువ హీరోపై కన్నేసిన ప్రియా వారియర్ !
కన్నుగీటిన మలయాళీ సంచలనం ప్రియా ప్రకాష్ వారియర్ పాపులారిటీ దేశం మొత్తం పాకేసింది. ప్రియా ప్రకాష్ వారియర్ ఓవర్ నైట్ స్టార్ డమ్ వసంతం చేసుకుంది. ఒరు ఆడార్ లవ్ చిత్రంలో పాట ఎంత సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిందే. యువత రిపీట్ చేసి మరి ప్రియా ప్రకాష్ కన్ను గీటిన వీడియోని చూస్తున్నారు. ఆమె హావ భావాలు, అందమైన ముఖ కవళికలు కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. తాజాగా ప్రియా ప్రకాష్ వారియర్ టాలీవుడ్ యువహీరోలని సైతం డిస్టర్బ్ చేస్తోంది. నిఖిల్ చిత్రంలో ఈ పిల్లని హీరోయిన్ గా నటింపజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
Recommended Video


దేశం మొత్తం ఫిదా
ప్రియా ప్రకాష్ వారియర్ కు యావత్ దేశం ఫిదా అయిపోయింది. సోషల్ మీడియాలో హవా మొత్తం ఈ భామదే. ప్రియా వారియర్ గురించి వార్తలు వస్తే ఛానల్స్ లో బ్రేకింగ్ గా మారుతోందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

డబ్బింగ్ హక్కుల కోసం పోటీ
ప్రియా నటిస్తున్న ఒరు ఆడార్ లవ్ చిత్ర డబ్బింగ్ హక్కులకోసం ప్రముఖ నిర్మాతలు వివిధభాషా చిత్ర పరిశ్రమల నుంచి పోటీ పడుతున్నారు. అంతా ప్రియా వారియర్ చలవే.

టాలీవుడ్ కు తీసుకుని వచ్చే ప్రయత్నం
యంగ్ హీరో నిఖిల్ చిత్రంలో ప్రియా ప్రకాష్ వారియర్ ని నటింపజేసేందుకు జోరుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. పెళ్లి చూపులు ఫేమ్ తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో నిఖిల్ నటించబోతున్న సంగతి తెలిసిందే.

బాలీవుడ్ నుంచి సైతం అవకాశాలు
ప్రియా వారియర్ కు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. బాలీవుడ్ చిత్ర పరిశ్రమ నుంచి కూడా దర్శక నిర్మాతలు ఈ పిల్ల కాల్షీట్ల కోసం ఎగబడుతున్నారు.


Click it and Unblock the Notifications











