‘పుష్ప మూవీతో నాకు ఒరిగిందేమీ లేదు.. సుకుమార్‌కు ముఖం మీదే చెప్పాను’

ఇండియన్ సినిమా హిస్టరీలో సంచలన విజయం సాధించిన చిత్రం పుష్ప 2. ఇప్పటి వరకు భారతీయ సినిమా చరిత్రలో ఉన్న రికార్డులన్నింటినీ తిరగరాసిన చిత్రంగా నిలిచిపోయింది. డిసెంబర్ 5వ తేదీన రిలీజైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద సంచలన రీతిలో కలెక్షన్లను రాబట్టింది. అయితే ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన ఫాహద్ ఫాజిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన తాజా ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప మూవీ విషయానికి వస్తే.. పార్టీ లేదా పుష్ప అనే డైలాగ్ ఠక్కున గుర్తుకు వస్తుంది. ఆ డైలాగ్‌ను భారీగా ప్రజల్లోకి తీసుకెళ్లిన ఘనత పోలీస్ ఆఫీసర్ షెకావత్ పాత్రను పోషించిన పాహద్ ఫాజిల్‌కే దక్కుతుంది. అల్లు అర్జున్‌కు ధీటుగా ఆ పాత్రను పోషించి సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్లారు.

Is Actor Fahadh Faasil Upset over on Pushpa 2 and Director Sukumar

ఇక పుష్ప ది రైజ్ సినిమా ముగింపులో ఎంట్రీ ఇచ్చి.. పుష్ప 2 మూవీపై అంచనాలు పెంచడంలో ఫాహద్ ఫాజిల్ తన వంతు కృషి చేశారు. అయితే పుష్ప 2 చిత్రంలో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రను కమెడియన్‌గా మార్చేశారనే విమర్శలు కూడా భారీగా వచ్చాయి. ఎర్ర చందనం స్మగ్లర్‌ ఆటకట్టించే ఆఫీసర్‌ పాత్రను చాలా దిగజార్చి చూపించడంపై సుకుమార్‌ క్రిటిక్ విమర్శలు గుప్పించారు.

అయితే పుష్ప 2 సినిమా సంచలన విజయం తర్వాత ఓ ఇంటర్వ్యూలో ఫాహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ చేశారు. పుష్ప 1 గానీ, పుష్ప 2 వల్ల గానీ నాకు ఒరిగింది ఏమీ లేదు. నాకు ఎలాంటి మైలేజ్ రాలేదు. వాస్తవానికి ఆ సినిమాలో నా నుంచి ఆడియెన్స్ కూడా పెద్దగా ఎక్స్‌పెక్ట్ చేయలేదనుకొంటాను. కేవలం సుకుమార్ కోసమే ఈ సినిమాను చేశాను అని ఫాహద్ ఫాజిల్ అన్నారు.

Is Actor Fahadh Faasil Upset over on Pushpa 2 and Director Sukumar

పుష్ప 2 వల్ల నాకు అదనంగా పేరు రాలేదు. ఆడియెన్స్ కూడా నేనేదో మ్యాజిక్ చేస్తానని ఊహించలేదు. మలయాళం ఇండస్ట్రీలో నేను మంచి వర్క్ చేస్తున్నాను. ఆ సినిమాకు పనిచేయడం వల గొప్ప పేరు రాలేదు. ఆ విషయాన్ని సుకుమార్‌కు ముఖం మీదే చెప్పేశాను. ఇది నిజం. నా కంటూ పేరు తెచ్చుకొనేందుకు మలయాళ పరిశ్రమలో చాలా చేస్తున్నాను అని ఫాహద్ ఫాజిల్ తన ఇంటర్వ్యూలో కుండ బద్దలు కొట్టినట్టు చెప్పడం వైరల్‌గా మారింది.

ఇదిలా ఉండగా, పుష్ప 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా 1800 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను సాధించింది. దాదాపు 50 రోజులపాటు వరల్డ్ బాక్సాఫీస్‌ను పుష్ప రాజ్ కలెక్షన్లతో శాసించాడు.

More from Filmibeat

Read more about: fahadh faasil pushpa 2 sukumar
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X