Kavya Madhavan పోలీసుల సమన్లు.. స్టార్ హీరో భార్య మెడకు బిగుస్తున్న ఉచ్చు

మలయాళ చిత్ర పరిశ్రమకు సంబంధించిన హీరోయిన్‌పై లైంగిక దాడి ఘటన మరోసారి మీడియా హెడ్‌లైన్లను ఆకర్షించింది. ఈ కేసులో ప్రధాన నిందుతుడు మాలీవుడ్ హీరో దిలీప్ భార్యను మరోసారి విచారించాలని క్రైమ్ బ్రాంచ్ నిర్ణయం తీసుకోవడం సంచలన వార్తగా మారింది. ఈ వార్త పూర్తి వివరాల్లోకి వెళితే...

కారును అడ్డగించి లైంగిక దాడి

కారును అడ్డగించి లైంగిక దాడి

మలయాళ నటిపై లైంగికదాడి ఘటన 2017లో దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. షూటింగ్ ముగించుకొని కారులో ఇంటికి తిరిగి వస్తుండగా దిలీప్‌కు సంబంధించిన వ్యక్తులు ఆమె వాహనాన్ని అడ్డగించి లైంగిక దాడికి ప్రయత్నించడం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలన రేపింది. ఈ కేసులో మరో ప్రధాన నిందితుడు పల్సర్ సునీల్ ఇచ్చిన వాగ్మూలం ప్రకారం.. నటుడు దిలీప్ ఈ ఘటన వెనుక ప్రధాన సూత్రధారి అనే విషయం స్పష్టమైంది. ఈ కేసులో అరెస్ట్ అయిన దిలీప్ ప్రస్తుతం బెయిల్‌పై బయటకు వచ్చారు.

నటి కావ్య మాధవన్ సమన్లు

నటి కావ్య మాధవన్ సమన్లు


అయితే నటి లైంగిక దాడి కేసులో దిలీప్ భార్య, నటి కావ్య మాధవన్‌కు కూడా హస్తం ఉందనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని మీడియాకు కేరళ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వెల్లడించడంతో ఈ కేసు మరో మలుపు తిరిగింది. దాంతో ఈ కేసులో కావ్య మాధవన్‌ను విచారించాలని పోలీసులు నిర్ణయం తీసుకొన్నారు. ఈ మేరకు కావ్యకు సమన్లు జారీ చేసి ఏప్రిల్ 11వ తేదీన ఆమెను విచారణకు హాజరు కావాలని ఆదేశించారు.

నటిపై లైంగిక దాడి వ్యవహారంలో మాస్టర్ ప్లాన్

నటిపై లైంగిక దాడి వ్యవహారంలో మాస్టర్ ప్లాన్

నటిపై లైంగిక దాడి వ్యవహారంలో కావ్య మాధవన్ పాత్ర బలమైనది. ఈ ఘటన వెనుక మాస్టర్ ప్లాన్ ఆమె చేసింది. దిలీప్‌కు సహాయంగా కావ్య కీలకంగా వ్యవహారించారు. ఈ కేసులో మాస్టర్ మైండ్ కావ్యనే అనే విషయం తాజాగా దిలీప్ బావమరిదిని విచారించగా బయటపడింది. నటిని ఇబ్బంది పెట్టడానికి కావ్య ఈ కుట్రను రచించింది అనే విషయంపై పోలీసులు ఆరా తీయనున్నారు.

మూడు నెలలుగా ఊపందుకొన్న విచారణ

మూడు నెలలుగా ఊపందుకొన్న విచారణ

నటిపై లైంగిక దాడి కేసులో కేరళ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు చురుకుగా వ్యవహరిస్తున్నారు. ఈ కేసులో ప్రతీ కోణాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నారు. గత మూడు నెలలుగా ఈ కేసు వ్యవహారాన్ని దుమ్ము దులిపి నిందితులను, అనుమానితులను విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే దిలీప్ బావమరిదికి పంపిన కావ్య మాధవన్ వాయిస్ నోట్‌ను కీలకంగా పరిగణిస్తున్నారు. ఈ వాయిస్ ఫైల్స్‌ పరిశీలించి ఆమె చర్యలు తీసుకొనే అవకాశముందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Recommended Video

RRR లో మల్లి..ఎవరీ చిట్టితల్లి? Twinkle Sharma లైఫ్ మలుపు తిప్పిన యాడ్ | Filmibeat Telugu
కావ్య మాధవన్ విచారణకు హాజరవుతుందా?

కావ్య మాధవన్ విచారణకు హాజరవుతుందా?

నటి లైంగిక దాడి కేసులో కావ్య మాధవన్‌ను ఈ రోజు అంటే ఏప్రిల్ 11వ తేదీ సోమవారం విచారించడం కేరళ మీడియాలో ఆసక్తికరంగా మారింది. ఈ కోణంలో కావ్యను విచారిస్తారు? ఆమె ఈ కేసు విచారణకు హాజరవుతుందా? లేదా కోర్టును ఆశ్రయిస్తుందా అనే విషయం చర్చనీయాంశమైంది. కొద్ది గంటల్లో కావ్య మాధవన్ విచారణ గురించి సమాచారం మీడియాకు తెలియనున్నది. కావును ఈ కేసుకు సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్ కోసం ఫిల్మీబీట్ తెలుగు ఫాలో అవ్వండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X