ప్రియా వారియర్ పరిస్థితి మరీ దారుణం.. ఆఫర్లు లేక విలవిల.. ఇక కెరీర్ ముగిసినట్టే..

Recommended Video

Priya Prakash Varrier Career In Trouble || Filmibeat Telugu

సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ మాత్రమే మాట్లాడుతుంది.. కేవలం విజయమే అవకాశాలను చేజిక్కించుకునేలా చేస్తుంది అనే మాటలు చాలానే వినిపిస్తాయి. ఇది ప్రియా వారియర్ విషయం కరెక్టే అనిపిస్తున్నాయి. ఒకేసారి కన్నుగీటి ఓవర్‌నైట్‌లోనే నేషన్ సెన్సేషన్‌గా మారిన ప్రియా ప్రకాశ్ వారియర్ తొలి సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్కాబోర్లా పడటంతో ఆకాశానికి ఎత్తేసినోళ్లే ఇక ఆమె పనైపొందని కామెంట్లు విసురుతున్నారు. హాట్ గర్ల్‌గా పేరు తెచ్చుకొన్న ప్రియా పరిస్థితి అసలు బాగాలేదట. వివరాల్లోకి వెళితే..

హౌజ్ అరెస్ట్ చేశారని

హౌజ్ అరెస్ట్ చేశారని

లవర్స్ డే (మలయాళంలో ఓరు ఆడార్ లవ్) టీజర్ విడుదలైన తర్వాత ప్రియా ప్రకాశ్ వారియర్‌కు సోషల్ మీడియాలో అనూహ్యమైన స్పందన వచ్చింది. మీడియా, నిర్మాతలు ఆమె ఇంటి ముందు క్యూ కట్టడంతో పరిస్థితి ఒక్కసారిగా తారుమారైంది. ప్రియా వారియర్‌కు వచ్చిన క్రేజ్ చూసి నన్ను హౌజ్ అరెస్ట్ చేశారు అని తాజాగా ఇంటర్వ్యూలో ఆమె చెప్పారు. ఇంటి వద్ద కర్ఫ్యూ పెట్టే పరిస్థితి కూడా కనిపించింది అని అన్నారు.

ప్రియా వారియర్‌ వైపు కన్నెత్తి..

ప్రియా వారియర్‌ వైపు కన్నెత్తి..

ఇక లవర్స్ డే రిలీజ్ కావడం ఆ సినిమాపై దక్షిణాది ప్రేక్షకులు పెదవి విరిచారు. దాంతో నిర్మాతలు ఇప్పుడు ప్రియా వారియర్‌ వైపు కన్నెత్తి చూడటం లేదట. లవర్స్ డే తర్వాత కొత్తగా సినిమాలు చేతిలో లేకపోవడంతో ఇక ఆమె కథ ముగిసినట్టే అనే మాట వినిపిస్తున్నది. గతంలో టాలీవుడ్ నిర్మాతలు కూడా ఆమెను తెలుగు సినిమాల్లో నటింపజేయాలని ప్రయత్నాలు కూడా చేశారు. కానీ ప్రస్తుతం ఆమె గురించి ఊసుకూడా ఎత్తడం లేదట.

నిర్మాత, నూరీన్ షరీష్‌తో విభేదాలు

నిర్మాత, నూరీన్ షరీష్‌తో విభేదాలు

లవర్స్ డే తర్వాత నిర్మాత, తోటి హీరోయిన్ నూరీన్ షరీష్‌తో విభేదాలు తలెత్తడంతో మలయాళ సినిమా పరిశ్రమలో ప్రియా వారియర్ వైపు చూడటం లేదనే మాట వినిపిస్తున్నది. ప్రస్తుతం చేతిలో బాలీవుడ్ చిత్రం శ్రీదేవీ బంగ్లా మాత్రమే ఉంది. ఆ సినిమాపైనే ప్రస్తుతం ప్రియా గంపెడు ఆశలు పెట్టుకొన్నది.

 శ్రీదేవి బంగ్లాపైనే భారీ ఆశలు

శ్రీదేవి బంగ్లాపైనే భారీ ఆశలు

శ్రీదేవి బంగ్లా సినిమా టైటిల్ కూడా వివాదంగా మారింది. ఈ టైటిల్‌పై నిర్మాత, శ్రీదేవి భర్త బోనికపూర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సినిమా యూనిట్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధమయ్యారు. దీంతో ఆ సినిమా వివాదంలో కూరుకుపోయింది. ఈ సినిమా సక్సెస్ సాధిస్తే తప్ప ప్రియా వారియర్ కెరీర్ గట్టెక్కే పరిస్థితి కనిపించడం లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X