ప్రముఖ టెలివిజన్ సెలబ్రిటీ అనుమానాస్పద మృతి.. వంటగదిలో విగతజీవిగా..
ప్రముఖ టెలివిజన్ సెలబ్రిటీ, మలయాళ మోడల్, ఛెఫ్ జాగీ జాన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా సంచలనం రేపింది. డిసెంబర్ 23వ తేదీన కేరళలోని కురవంకొణంలో తన నివాసంలోని వంటగదిలో విగత జీవిగా కనిపించింది. ఆమె వయసు 48 సంవత్సరాలు. కేరళలో జగీ కుక్‌బుక్ అనే షో ద్వారా దక్షిణాదిలో సుపరిచితురాలు. జగీ మృతి గురించి పోలీసులు తెలిపిన ప్రకారం..

తెల్లవారుజామున విగతజీవిగా
జగీ జాన్ తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో వంటగదిలో మరణించి ఉండటాన్ని వైద్యులు గమనించారు. వారు సమాచారం అందించిన వెంటనే మేము కురవకోణంలోని ఘటనాస్థలానికి చేరుకొన్నాం. ఆమె మరణానికి కారణాలు తెలియరాలేదు. ఆమె ఒంటిపై ఎలాంటి గాయాలు కూడా లేకపోవడంతో అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేశాం అని పోలీసులు పేర్కొన్నారు.

పోస్ట్ మార్టమ్ రిపోర్టు ఆధారంగా
జగీ జాన్ అనారోగ్యంతో బాధపడుతున్నట్టు కూడా వివరాలు లేవు. జగీ మృతిపై కేసు నమోదు చేసి పోస్టు మార్టంకు పంపించాం. పోస్ట్ మార్టమ్ నివేదిక ఆధారంగా ఆమె మృతికి కారణాలను తెలుసుకొంటాం. ఆమె మరణాన్ని ప్రాథమికంగా అనుమానాస్పద కేసుగా దర్యాప్తు చేస్తాం. బుధవారం కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలను అందజేస్తాం అని తిరువనంతపురం పోలీసులు తెలిపారు.

జీవిత భాగస్వామి వెల్లడించిన ప్రకారం
జగీ జాన్ జీవిత భాగస్వామి ఎర్నాకులంలో పనిచేస్తారు. తెల్లవారుజామున ఆమెకు ఫోన్ చేయగా ఎలాంటి స్పందన రాలేదు. తమ నివాసానికి సమీపంలో ఉండే డాక్టర్‌కు ఫోన్ చేసి వివరాలు చెప్పాం. డాక్టర్ వెళ్లి చూడగా ఆమె నేలపై విగత జీవిగా కనిపించింది. వెంటనే పోలీసులకు ఫోన్ చేశానని జగీ పార్ట్‌నర్ వెల్లడించినట్టు పోలీసులు మీడియాకు తెలిపారు.

జగీ జాన్ గురించి
మలయాళ టెలివిజన్ పరిశ్రమలో జగీ జాన్ బహుముఖ ప్రజాశాలిగా పేరున్నది. బుల్లితెర సెలబ్రిటీగానే కాకుండా యాంకర్‌గా, సింగర్‌గా, యోగా ట్రైనర్‌గా పనిచేస్తారు. రోజ్‌బౌల్ ఛానెల్‌లో వంటల కార్యక్రమం జగీ కుక్‌బుక్‌తో భారీ సంఖ్యలో అభిమానులను సంపాదించుకొన్నారు. మోడల్‌గా, గాయనిగా, హోస్ట్‌గా తన సత్తాను చాటుకొన్నారు.


Click it and Unblock the Notifications











