twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Jana Gana Mana trailer review నోట్లు, ఓట్లు రద్దు చేసినా నోరు విప్పరు.. పృథ్వీరాజ్ సుకుమారన్ అదుర్స్

    |

    అయ్యప్పనుమ్ కోషియం, బ్రో డాడీ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు అభిమానపాత్రుడైన పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన మరో విభిన్నకథా చిత్రం రిలీజ్‌కు సిద్దమైంది. జనగణమన అనే పవర్‌ఫుల్ టైటిల్‌తో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఏప్రిల్ 28వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తూ.. జనగణమన సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేయగా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. ఈ ట్రైలర్‌లోని ముఖ్య విషయాల్లోకి వెళితే..

    జనగణమన ట్రైలర్‌లో..

    జనగణమన ట్రైలర్‌లో..

    పెన్షన్ కోసం ఓ వృద్ధుడు ఎన్నో ఏళ్లుగా మంత్రిని కలువడానికి పడే అవస్థలతో జనగణమన ట్రైలర్‌ భావోద్వేగమైన సన్నివేశాలతో మొదలైంది. పోలీసుల లాఠీఛార్జిలో కాలు విరగడంతో పెన్షన్ ఇప్పించాలని వేడుకొంటూ మంత్రిని కలువడానికి వచ్చిన పృథ్వీరాజ్ సుకుమారన్‌కు వృద్దుడు తన గోడును చెప్పుకొంటాడు. నేను బతికి ఉండగా మంత్రిని కలుస్తానో లేదో అనే సందేహాన్ని వ్యక్తం చేస్తాడు. అంతలోనే మంత్రిగారి బంట్రోతు వచ్చి.. సార్ లంచ్ చేస్తున్నాడు. మీరందరూ కూడా లంచ్ చేసి రావాలని చెబుతాడు. కానీ పృథ్వీరాజ్ సుకుమార్‌ను మంత్రిగారు పిలుస్తున్నారని చెప్పి అతడిని లోపలికి తీసుకెళ్తాడు. తను మంత్రిని కలువడానికి వెళ్తూ ఇక్కడే పక్కన క్యాంటిన్ ఉంది. నీవు వెళ్లి లంచ్ చేసిరా అంటూ చెబితే.. ఈ ప్రాంతానికి నేను కొత్త కాదు. అంటూ వృద్ధుడు బయటకు వెళ్తాడు. దాంతో మంత్రి గారి రూమ్‌లోకి పృథ్వీరాజ్ సుకుమారన్ వెళ్తాడు.

     కెరీర్, ఫ్యామిలీని పొగొట్టుకొని..

    కెరీర్, ఫ్యామిలీని పొగొట్టుకొని..


    పృథ్వీరాజ్ సుకుమారన్ లోపలికి వెళ్లగానే మంత్రి పలకరిస్తూ.. నీకు భోజనం ఆర్డర్ చేయాలా అని ప్రశ్నిస్తాడు. అందుకే లేదు అని సమాధానం చెప్పడంతో.. ఏం పని మీద వచ్చావని మంత్రి అడిగితే.. పోలీసుల లాఠీ ఛార్జిలో కాలు విరిగింది. నాకు పెన్షన్ కావాలి అని సుకుమార్ చెబుతాడు. దాంతో అప్పుడు చెబితే వినడు. న్యాయం కావాలి అంటూ గొడవ చేస్తుంటాడు. ఇప్పుడు నీ పరిస్థితి చూసి ఎవడైనా వచ్చాడా? నీ వెంటే ఎవడైనా ఉన్నాడా? కోర్టులు తప్ప నీకు మరోకరు అండగా ఉన్నారా? అని ప్రశ్నిస్తాడు. పోరాటం అంటూ నీ జీవితం, కెరీర్, ఫ్యామిలీని అంతా పోగొట్టుకొన్నావు. ఇప్పుడు బాధపడుతున్నావు అని మంత్రి అంటే నవ్వుకొంటాడు.

     నోట్లు, ఓట్లు రద్దు చేసినా నోరు విప్పరు

    నోట్లు, ఓట్లు రద్దు చేసినా నోరు విప్పరు


    నోట్లు రద్దు చేసినా ఎవరు మాట్లాడరు. ఓట్లు రద్దు చేసినా ఎవ్వరూ నోరు విప్పరు. ఎందుకంటే ఇది భారతదేశం అని పృథ్వీరాజ్ సుకుమారన్ అంటే.. ఇప్పుడు కరెక్ట్‌గా చెప్పావు. నీవు ఇక వెళ్లు. నిన్ను ఎవరు బాధపెట్టరు అంటూ మంత్రి వెకిలి నవ్వు నవ్వుతాడు. పృథ్వీరాజ్ సుకుమారన్ బయటకు రాగానే మంత్రి రూమ్‌లో బాంబు పేలుతుంది. ఇలాంటి ఎమోషనల్ అంశాలతో జనగణమన ట్రైలర్ ముగుస్తుంది.

    Recommended Video

    Puri Jagannath పంతం నెగ్గిచుకున్నాడు.. Vijay Devarakonda తో JGM | Filmibeat Telugu
     ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌తో

    ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌తో


    జనగణమన చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌లోని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సినిమాకు ప్రాణంగా మారినట్టు కనిపిస్తుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ సినిమాకు వెన్నెముకగా ఉందనే విషయం స్పష్టమైంది. పక్కాగా యూత్‌ఫుల్ సినిమానే కాకుండా.. సమాజాన్ని ఆలోచింపజేసే చిత్రంగా.. సమకాలీన రాజకీయాలపై విమర్శనాస్త్రంగా కనిపించబొతుందనే విషయం ట్రైలర్ స్పష్టం చేసింది.

    జనగణమన చిత్రంలో నటీనటులు


    నటీనటులు: పృథ్వీరాజ్ సుకుమారన్, సూరజ్ వెంజరమూడు, మమతా మోహన్ దాస్, శ్రీ దివ్య, ధ్రువన్, షారీ, రాజా కృష్ణమూర్తి, పశుపతి రాజ్ తదితరులు
    దర్శకత్వం: డిజో జోస్ ఆంటోని
    నిర్మాతలు: సుప్రియా మీనన్, లిస్టిన్ స్టీఫెన్
    రచన: షారీస్ మహ్మద్
    మ్యూజిక్: జేక్స్ బిజోయ్
    డీవోపీ: సుదీప్ ఎలామన్
    ఎడిటింగ్: శ్రీజిత్ సారంగ్
    ఫైట్స్: బిల్లా జగన్
    రిలీజ్ డేట్: 2022-04-28

    English summary
    Malayalam Super Star Prithviraj Sukumaran's latest movie is Jana Gana Mana. Here is the movie review from Telugu filmibeat.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X