అనుపమ పరమేశ్వరన్‌కు సెన్సార్ షాక్.. మలయాళ సినీ ఇండస్ట్రీ ఫైర్

మలయాళ సినిమా పరిశ్రమలో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ కాస్మోస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై జే ఫణింద్ర కుమార్, సేతు రామన్ నాయర్ కనకోల్ నిర్మాతలుగా రూపొందిన చిత్రం జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. ప్రవీణ్ నారాయణ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్, స్టార్ హీరో సురేష్ గోపి, దిలీప్, శృతి రామచంద్రన్, దివ్య పిళ్లై తదితరులు నటించారు. అయితే ఈ సినిమా సెన్సార్ వివాదంలో చిక్కకొని రిలీజ్ వాయిదా పడింది. ఈ సినిమా రిలీజ్ వాయిదా పడటం వెనుక అసలు కారణం ఏమిటంటే?

జానకి V/S స్టేట్ ఆఫ్ కేరళ సినిమా కథ విషయానికి వస్తే.. కేరళ న్యాయ వ్యవస్థ బ్యాక్ డ్రాప్‌గా రూపొందింది. న్యాయ వ్యవస్థలోని లోపాలపై సైటరికల్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రంలో జానకీ అనే మహిళ తనపై జరిగిన లైంగిక దాడికి న్యాయం కోరుతూ కోర్టును ఆశ్రయిస్తుంది. అయితే కోర్టులో తనకు ఎలాంటి తీర్పు, న్యాయం లభించిందనేది కథ. ఈ సినిమాలో సురేష్ గోపి పవర్‌ఫుల్ లాయర్ పాత్రలో నటించారు.

Janaki Vs State Of Kerala Controversy

అయితే ఈ సినిమాను జూన్ 27వ తేదీన రిలీజ్ చేసేందుకు ముహుర్తం నిర్ణయించి సెన్సార్ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సినిమాను వీక్షించిన సెన్సార్ బోర్డు అధికారులు ఎలాంటి కట్ లేకుండా U/A సర్టిఫికెట్ జారీ చేశారు. అయితే ఈ సినిమా టైటిల్‌పై అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతే కాకుండా మూవీ రిలీజ్‌కు మోకాలడ్డుకొని షాకిచ్చారు. దాంతో ఈ సినిమా రిలీజ్‌ను వాయిదా వేసినట్టు నిర్మాత ప్రవీణ్ నారాయణ్ అధికారికంగా ప్రకటించారు.

అయితే సెన్సార్ చెప్పిన అభ్యంతరం విషయంలోకి వెళితే.. లైంగిక వేధింపుకు గురైన మహిళ పేరు జానకి ఉండకూడదు. ఎందుకంటే జానకీ అనే పేరు రామాయణంలో సీతాదేవీకి మరో పేరు. అలాంటి పేరును లైంగిక వివక్షకు గురైన మహిళకు పెట్టడం అభ్యంతర కరం. కాబట్టి ఆ సినిమా టైటిల్‌లోని జానకి పేరును తొలగించి.. ఆ స్థానంలో మరో టైటిల్‌ను పెట్టాలని సెన్సార్ బోర్డు సూచించింది.

జానకి V/s స్టేట్ ఆఫ్ కేరళ సినిమా రిలీజ్‌పై ఆంక్షలు పెట్టడంతో మలయాళ సినిమా ఇండస్ట్రీలోని ది ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ కేరళ (FEFKA) సంఘాన్ని నిర్మాత, దర్శకులు ఆశ్రయించారు. సెన్సార్ పెట్టిన అడ్డంకిపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. దాంతో ఈ సినిమా వివాదంలో ఫెఫ్కా ప్రధాన కార్యదర్శి ఉన్నికృష్ణన్ ఘాటుగా స్పందించారు. ఈ సినిమా విడుదల విషయంలో సెన్సార్ పెట్టిన అడ్డంకి సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించి న్యాయపోరాటం చేయాలి. మేము కూడా మా పరిధిలో నిరసన వ్యక్తం చేస్తాం ఆయన సూచించారు.

శ్రీరాముడు సతీమణి సీతా దేవీకి మారు పేరు జానకిని టైటిల్ నుంచి తొలగించమనడం దారుణం. సినిమాల టైటిల్‌లో దేవుళ్ల పేర్లు పెట్టకూడదంటే.. మలయాళ సినిమా పరిశ్రమలో చాలా సినిమాల్లో దేవుళ్ల పేర్ల విలన్ పాత్రలకు పెట్టారు. అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడెందుకు? అలా అయితే సెన్సార్ పరిధిలో రాని దేవుళ్ల పేర్ల జాబితాను ఇండస్ట్రీకి ఇవ్వండి అంటూ ఘాటుగా ఎన్ని కృష్ణన్ కామెంట్ చేశారు. ఈ విషయంలో ఫిఫ్కాకు పలువురు నటీనటులు మద్దతు తెలపడం ఈ వివాదం మరింత ముదిరే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X