చరిత్ర సృష్టించనున్న అదితిరావు హైదరీ చిత్రం.. 14 ఏళ్ల తర్వాత మళ్లీ..

మలయాళంలో విలక్షణ నటుడు జయసూర్య నటించిన సూఫియమ్ సుజాతయుమ్ చిత్రం చరిత్ర సృష్టించబోతున్నది. ఓటీటీ వెబ్‌సైట్ అమెజాన్ ప్రైమ్‌ వీడియోలో డైరెక్టుగా రిలీజవుతున్న తొలి మలయాళ చిత్రంగా ఓ ఘనతను సొంతం చేసుకోవడానికి సిద్ధమవుతున్నది. ఈ చిత్రం జూలై మూడో తేదీన రిలీజ్‌కు సిద్ధమవుతున్నది. కరోనావైరస్ కారణంగా థియేటర్లు మూతపడిన నేపథ్యంలో ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేయడానికి దర్శక, నిర్మాతలు నిర్ణయం తీసుకొన్నారు.

ఫ్రైడే ఫిల్మ్ హౌస్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రాన్ని విజయ్ బాబు నిర్మించారు. ఈ చిత్రంలో అదితిరావు హైదరీ హీరోయిన్‌గా నటించారు. సూఫియమ్ సుజాతయుమ్ చిత్రానికి అను మూతేడత్ సినిమాటోగ్రఫిని, దీపు జోసెఫ్ ఎడిటింగ్ బాధ్యతలను నిర్వహించారు.

 Jayasurya and Aditi Rao Hydaris Sufiyum Sujatayum direct release on OTT

దాదాపు 14 ఏళ్ల తర్వాత అదితిరావు మలయాళ సినిమాలో నటించడం విశేషం. గతంలో మమ్ముట్టి హీరోగా ప్రజాపతి అనే చిత్రంలో అదితి రావు నటించడం ద్వారా మలయాళ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే, కేరళలో కరోనావైరస్ కేసులు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. త్వరలోనే రాష్ట్రంలో థియేటర్లను ఓపెన్ చేసేందుకు కేరళ ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. అయినా ప్రేక్షకులు థియేటర్లకు వస్తారో రారో అనే భయాందోళనలు నిర్మాతలను వెంటాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎక్కువ మంది నిర్మాతలు తమ సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేయడానికి సుముఖంగా ఉన్నట్టు తెలుస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X