Antony గా విభిన్నమైన పాత్రలో జోజు జార్జ్.. సెన్సేషనల్ డైరెక్టర్ ఎవరంటే?
మలయాళం చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ సురేష్ గోపితో పప్పన్ లాంటి సూపర్ హిట్‌ను అందించిన డైరెక్టర్ జోషి మరో భారీ ప్రాజెక్టును చేపట్టనున్నారు. విభిన్నమైన కథతో ఆంటోని అనే :భారీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మలయాళంలో ప్రముఖ నటుడు జోజు జార్జ్, ఉష, చెంబన్ వినోద్ జోస్, విజయ రాఘవన్ లాంటి నటీనటులను జోషి మరోసారి తన చిత్రంలో కీలక పాత్రలను పోషిస్తున్నట్టు తెలిసింది. కమర్షియల్ డ్రామాగా తెరకెక్కబోతున్న సినిమా గురించిన వివరాల్లోకి వెళితే..
ఆంటోని చిత్రంలో స్టార్ హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్, ఆశా శరత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. డైరెక్టర్ జోషి దర్శకత్వంలో జోజు జార్జ్ నటించిన పోరింజు మరియం జ్యూస్ ఇటీవల రిలీజై మంచి ప్రశంసలు అందుకొన్నది. ఇదే కాంబినేషన్‌లో మరో సినిమా వస్తున్నదనే వార్తతో అభిమానులు థ్రిల్ అవుతున్నారు. అంతేకాకుండా ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు పెరిగాయి.

ఓటీటీలో భారీ విజయాన్ని అందుకొన్న ఇరట్ట మూవీ తర్వాత జోజు మరోసారి హీరో పాత్రలో ఆంటోనీ సినిమాలో కనిపించబోతున్నారు. ఐన్‌స్టీన్ మీడియా బ్యానర్‌పై ఐన్‌స్టీన్ జాక్ పాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కొచ్చిలోని క్రౌన్ ప్లాజా హోటల్‌లో ఈ సినిమా టైటిల్ లాంచ్, పూజా కార్యక్రమాలు జరిగాయి.

నటీనటులు: జోజు జార్జ్, ఉష, చెంబన్ వినోద్ జోస్, విజయ రాఘవన్ తదితరులు
రచన: రాజేష్ వర్మ
సినిమాటోగ్రఫి: రణదివే
ఎడిటింగ్: శ్యామ్ శశిధరన్
సంగీతం: జేక్స్ బిజోయ్.
ప్రొడక్షన్ కంట్రోలర్: దీపక్ పరమేశ్వరం
ఆర్ట్ డైరెక్షన్: దిలీప్ నాథ్
కాస్ట్యూమ్ డిజైన్: ప్రవీణ్ వర్మ
మేకప్: రోనెక్స్ జేవియర్
డిస్ట్రిబ్యూషన్: అప్పు పాతు పప్పు ప్రొడక్షన్
మార్కెటింగ్ ప్లానింగ్: అబ్స్క్యూరా ఎంటర్‌టైన్‌మెంట్


Click it and Unblock the Notifications











