నన్ను చంపాలనుకున్నాడు: స్టార్ హీరోపై జర్నలిస్ట్ సంచలనం
Recommended Video

కేరళకు చెందిన సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ రత్నకుమార్ పల్లిసెరి మలయాళం సూపర్ స్టార్ దిలీప్ మీద సంచలన ఆరోపణలు చేశారు. ప్రముఖ నటి కిడ్నాప్, వేధింపుల కేసులో దిలీప్ ఆ మధ్య అరెస్టయిన తర్వాత రత్నకుమార్ వరుస వీడియోలు విడుదల చేశారు. ఈ క్రమంలో తనను చంపేందుకు దిలీప్ ప్రయత్నించినట్లు రత్నకుమార్ ఆరోపించారు.
తాజాగా రిలీజ్ చేసిన వీడియోలో రత్నకుమార్ మాట్లాడుతూ.. దిలీప్, అతడి అభిమానులు నన్ను ఎట్టిపరిస్థితుల్లోనూ చంపేయాలని ప్రయత్నించారని, అయితే తాను వారి బెదిరింపులకు భయపడలేదని, దిలీప్ లాంటి వ్యక్తుల ముందు తలవంచలేదని స్పష్టం చేశారు.

నన్ను చంపితే మరింత డేంజర్
ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు చనిపోవాల్సిందే. ఎవరికీ భయపడకుండా నా కర్తవ్యాన్ని నిర్వర్తించాలనుకున్నాను. దిలీప్ ఒక విషయం గుర్తుంచుకోవాలి...‘ఈ రత్నకుమార్ పల్లిసెరిని చంపేస్తే నువ్వు మరింత డేంజర్‌లో పడతావు' అని వ్యాఖ్యానించారు.

నేను చనిపోతే అవి లీక్ అవుతాయి
నన్ను చంపేముందు దిలీప్ ఒక విషయం అర్థం చేసుకోవాలి... నాకు ఎదురైన బెదిరింపులు అన్నీ కూడా రికార్డు చేసి పెట్టాను. ఒక వేళ నేను చనిపోతే అవి బయటకు లీక్ అవుతాయి. అపుడు మరింత భయంకరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని రత్నకుమార్ పల్లిసెరి తేల్చి చెప్పారు.

బెదిరింపులకు లొంగను
నేను నిబద్ధత కలిగిన జర్నలిస్టును. నిజాలను ప్రజల ముందు ఉంచడానికి ఎలాంటి పరిస్థితులను అయినా ఎదుర్కొంటాను. నా విధి నిర్వహణలో ఎవరి బెదిరింపులకు లొంగే ప్రసక్తే లేదన్నారు. ఈ కేసు నుంచి బయట పడటానికి దిలీప్ కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నట్లు పల్లిసెరి ఆరోపించారు.

కేవలం ఆమె కోసమే సినిమా
దిలీప్ ‘పాప్పి అప్పచ' అనే సినిమాను నిర్మించాడు, ఈ చిత్రాన్ని కేవలం కావ్యా మాధవన్‌ను తిరిగి ఫిల్మ్ ఇండస్ట్రీకి తీసుకురావడానికి నిర్మించారని పల్లిసెరి తెలిపారు. దిలీప్ లైఫ్ నుంచి మంజు వారియర్‌ను దూరం చేయడానికి కావ్యా మాధవన్ కొన్ని మోసపూరితమైన ట్రిక్స్ ప్లే చేసిందని రత్నకుమార్ పల్లిసెరి తన వీడియోలో ఆరోపించారు. 2015లో మంజు వారియర్‌తో విడిపోయిన దిలీప్.. 2016లో కావ్యా మాధవన్‌ను పెళ్లాడిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











