యువ నటికి చేదు అనుభవం.. అశ్లీల ఫోటోలు, వీడియోలు లీక్..
మలయాళ నటి జుహి రస్తోగికి చేదు అనుభవం ఎదురైంది. తనకు తెలియకుండా తనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను మార్ఫింగ్ చేసి కొందరు ఆకతాయిలు ఆన్‌లైన్‌లో లీక్ చేయడంతో షాక్ తిన్నారు. ఊహించని పరిణామం నుంచి తేరుకొన్న జుహి ప్రస్తుం పోలీసులను ఆశ్రయించింది. తన ఇమేజ్‌ను భ్రష్టుపట్టించేందుకు కారణమైన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని తన ఫిర్యాదులో పేర్కొన్నది. వివరాల్లోకి వెళితే..

సోషల్ మీడియాలో నకిలీ అకౌంట్లు
సోషల్ మీడియాలో తనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు అశ్లీలంగా, అసభ్యంగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారనే విషయం నా దృష్టికి వచ్చింది. సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్న ఫోటోలు ఫేక్ అని కేరళలోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఎర్నాకులం సిటీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

నా అకౌంట్లు కాదు
తన ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ఉన్న కంటెంట్‌ను తన అభిమానుల సహాయంతో అకౌంట్ల వివరాలను పోలీసులకు సమర్పించింది. నా పేరుతో కొన్ని నకిలీ అకౌంట్లను నడుపుతున్నారు. అవి నాకు సంబంధించిన అకౌంట్లు కాదు. నాపేరుతో నడిచే అకౌంట్లు అన్నీ ఫేక్ అని జుహి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

కఠినంగా శిక్షించాలి
సోషల్ మీడియాలో తన పేరుతో అకౌంట్లు నడిపే వారికి కనీస జానం లేదు. అలాంటి నీచపు చర్యలకు పాల్పడే వారిపై జాలి కలుగుతున్నది. నా పేరుతో ఫేక్ అకౌంట్ ఓపెన్ చేసి నా అశ్లీల చిత్రాలు అప్‌లోడ్ చేశారు. నా పేరుతో ఉన్న నకిలీ అకౌంట్లను వెంటనే తొలగించి తగుచర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
Recommended Video

స్పందించిన కేరళ పోలీసులు
జుహి రుస్తోగి ఫిర్యాదుపై కేరళ పోలీసులు తక్షణమే స్పందించారు. నటి ఫిర్యాదును పరిగణనలోకి తీసుకొన్నాం. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నాం. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిని సైబర్ చట్టాల ప్రకారం శిక్షిస్తాం. సెలబ్రిటీలకు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకొంటాం అని జుహి రస్తోగికి పోలీసులు హామీ ఇచ్చినట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











