twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రముఖ నటుడి శరీరంలో పురుగుల మందు.. డెత్ మిస్టరీలో స్నేహితులకు లైడిటెక్టర్ టెస్ట్!

    |

    ఎన్నో చిత్రాల్లో నెగిటివ్ రోల్స్, విలక్షణమైనపాత్రల్లో నటించిన ప్రముఖుల నటుడు కళాభవన్ మని డెత్ కేసులో కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. కళాభవన్ మణి 2016లో మరణించారు. మూడేళ్లు గడుస్తున్నా అతడి మరణం మిస్టరీగానే ఉంది. అనేక అనుమానాలకు సమాధానాలు లభించడం లేదు. కానీ సిబిఐ మాత్రం కళాభవన్ మణి కేసుని సీరియస్ గానే తీసుకుంది. తాజాగా ఈకేసులో పురోగతి సాధించింది. కేరళలోని ఎర్నాకులం కోర్టులో జరిగిన విచారణలో సిబిఐ అధికారులు మణి స్నేహితులని విచారించేందుకు లై డిటెక్ట్ టెస్ట్ కు అనుమతి సాధించారు.

    కాలేయ మార్పిడి చికిత్స

    కాలేయ మార్పిడి చికిత్స

    2016లో కళాభవన్ మణి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. అతడికి వైద్యులు కాలేయ మార్పిడి చికిత్స చేశాడు. అది విజయవంతం కాకపోవడంతో మణి ఆసుపత్రిలోనే మరణించారు. కానీ పోస్ట్ మార్టంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కానీ రక్తంలో పురుగుల మందు ఉన్నట్లు ఫోరెన్సిక్ నిపుణులు గుర్తించడంతో ఈ కేసు సంచలనంగా మారింది. కానీ కేసుని చేధించడంతో కేరళ పోలీసులు విఫలమయ్యారు.

    సిబిఐకు బదిలీ

    సిబిఐకు బదిలీ

    పురుగుల మందు ఎలా వచ్చింది, మణి మరణానికి కారణం ఏంటి అనే విషయాల్లో పోలీసులు సరైన అధరాలు సంపాదించలేకపోవడంతో కేరళ ప్రభుత్వం ఈ కేసుని సిబిఐ విచారణకు బదిలీ చేసింది. ఈ కేసులో నిజాలు నిగ్గు తేలాలంటే మణి స్నేహితులని కూడా విచారించాలని సిబిఐ అధికారులు భావించారు. దీనితో పట్టు బట్టి కోర్టులో అతడి స్నేహితుల లై డిటెక్ట్ టెస్ట్ కు అనుమతులు సాధించారు.

    కోర్టు నిబంధనలు

    కోర్టు నిబంధనలు

    కళాభవన్ మణి స్నేహితులందరిని విచారించడానికి వీల్లేదు. ఆ సమయంలో కళాభవన్ మణితో సన్నిహితంగా ఉన్నవారికి మాత్రమే లై డిటెక్ట్ టెస్టు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. కళాభవన్ మణి స్నేహితులని విచారిస్తే అన్ని నిజాలు బయటకు వస్తాయని సిబిఐ అధికారులు బలంగా విశ్వసిస్తున్నారు. ఎందుకంటే మణి అనారోగ్యానికి గురైన సమయంలో అతడి స్నేహితులే దగ్గరగా ఉన్నారట.

    ఫామ్ హౌస్

    ఫామ్ హౌస్

    మణి అనారోగ్యానికి గురైన రోజు అతడు తనకున్న 30 ఎకరాల ఫామ్ హౌస్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ సమయంలో అతడి భార్య, కుమార్తె ఇంట్లో ఉన్నారు. అతడి స్నేహితులు మాత్రం ఫామ్ హౌస్ లోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఫామ్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత మణి అనారోగ్యానికి గురయ్యాడు. మణిది సహజ మరణం కాదని ఫోరెన్సిక్ నిపుణులు తేల్చారు. కళాభవన్ మణి సౌత్ ఇండియన్ భాషల్లో 200కి పైగా చిత్రాల్లో నటించాడు.

    English summary
    Kalabhavan Mani's death: Court permits CBI to conduct lie-detector tests on actor's friends
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X