కంగువా టీమ్‌లో తీవ్ర విషాదం.. టాలెంటెడ్ టెక్నిషియన్ అనుమానాస్పద మృతి
తమిళ సూపర్ స్టార్ సూర్య, దర్శకుడు శివ కాంబినేషన్‌లో భారీ అంచనాలతో వస్తున్న కంగువా చిత్ర యూనిట్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకొన్నది. ఈ సినిమాకు ఎడిటర్‌గా పనిచేసిన నిషద్ యూసఫ్ అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడం మలయాళ సినిమా ఇండస్ట్రీలో సంచలనం రేపింది. ఆయన మృతి వార్తతో సినీ వర్గాలు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. ఆయన ఇకలేరనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. నిషాద్ మరణంపై స్థానిక పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆయన మరణానికి సంబంధించిన వివరాలు, వ్యక్తిగత జీవితం గురించిన వివరాల్లోకి వెళితే..
నిషాద్ యూసఫ్ అక్టోబర్ 30వ తేదీన తెల్లవారు జామున కోచికి సమీపంలోని పనమ్‌పిల్లి నగర్‌లోని తన ఫ్లాట్‌లో విగత జీవిగా కనిపించారు. ఆయన వయసు 43 సంవత్సరాలు. ఆయనకు భార్య, ఓ కూతురు, కుమారుడు ఉన్నారు. ప్రతిభావంతుడైన ఎడిటర్‌గా దక్షిణాది ఇండస్ట్రీలో మంచి పేరు ఉంది. అయితే చిన్నవయసులోనే ఆయన మరణించడంపై అన్ని వర్గాల నుంచి ఆవేదన వ్యక్తం అవుతున్నది.

పోలీసులు, సినీ వర్గాలు తెలిపిన ప్రకారం.. నిషాద్ యూసఫ్ సుమారుగా 2 గంటల ప్రాంతంలో మరణించి ఉంటారు. ఆయన మరణానికి కారణాలు తెలియరాలేదు. మరణ వార్త వినగానే కేరళ పోలీసులు ప్రాథమిక విచారణ ప్రారంభించి, సాక్ష్యాలు సేకరించారు. ఆయన మరణం వెనుక ఏదైనా అనుమానాస్పద పరిస్థితులు చోటు చేసుకొన్నాయా? అనే కోణంలో దర్యాప్త ప్రారంభించారు.
నిషాద్ యూసఫ్ మరణాన్ని ది ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ కేరళ (FEFKA) అధికారికంగా ధృవీకరించింది. యూసఫ్ ఆకస్మిక మరణం ఆకస్మిక మరణం తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది. మలయాళ సినిమా రంగం గొప్ప సాంకేతిక నిపుణుడిని కోల్పోయింది. ఆయన మృతికి సంఘం శ్రద్దాంజలి ఘటిస్తుందని తమ ఫేస్‌బుక్ అకౌంట్ ద్వారా వెల్లడించారు.

నిషాద్ తన కెరీర్‌లో ఉండా, సౌదీ వెల్లక్క, థల్లమాల, వూల్ఫ్, ఆపరేషన్ జావా, వన్ చావర్, రామచంద్ర బాస్ అండ్ కో, ఉడాల్, అలంగమ్, థౌజండ్ వన్ లైస్, ఆడియోస్ అమిగో, ఎగ్జిట్ లాంటి చిత్రాలకు పనిచేశారు. తల్లుమాలా సినిమాకు ఆయనకు ఉత్తమ ఎడిటర్‌గా కేరళ స్టేట్ అవార్డు కూడా లభించింది.
నిషాద్ పనిచేసిన మమ్ముట్టి చిత్రం బాసూక్క, సూర్యతో కంగువా, నిస్లాలాన్ అలపుజా జింఖానా, తరుణ్ మారుతి, మోహన్ లాల్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమాలు రిలీజ్ కావాల్సి ఉన్నాయి. అలాగే సూర్యతో ఆర్జే బాలాజీ రూపొందిస్తున్న సినిమాకు కూడా ఆయన పనిచేస్తున్నారు. ఇలాంటి టాలెంటెడ్ ఎడిటర్ మరణం అందర్నీ విషాదంలోకి నెట్టింది.


Click it and Unblock the Notifications











