Ban on Kantara: కాంతార చాప్టర్‌ 1 మూవీపై నిషేధం.. తడాఖా చూపిస్తామని ఆల్టిమేటం

దక్షిణాదిలో అగ్ర సినీ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మాత విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న చిత్రం కాంతార చాప్టర్ 1. రిషబ్ శెట్టి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు దేశ, విదేశాల్లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ సినిమాకు మలయాళంలో భారీ దెబ్బ తగిలింది. ఈ సినిమాపై స్థానిక సంస్థ నిషేధానికి పిలుపునిచ్చింది. ఈ వివాదానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

కాంతర చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజై ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయం సాధించింది. ఈ సినిమాకు రికార్డు స్థాయిలో వసూళ్లు నమోదయ్యాయి. దాంతో ఈ సినిమాకు ప్రీక్వెల్ రూపొందించేందుకు సిద్దమై కాంతార చాప్టర్ 1 సినిమాగా తెరకెక్కించారు. అయితే ఈ సినిమాను రికార్డు స్థాయి స్క్రీన్లలో రిలీజ్ చేసి సంచలనం క్రియేట్ చేసేందుకు హోంబలే ప్లాన్ చేసింది.

Kantara Chapter 1 banned in Kerala

అయితే ఈ సినిమాను విజయదశమి కానుకగా అక్టోబర్ 2వ తేదీన గ్రాండ్‌గా వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. ఈ మూవీని సుమారుగా 30 దేశాల్లో భారీ సంఖ్యలో విడుదల చేసేందుకు కార్యాచరణను రూపొందించారు. యూఎస్, యూకే, యూఏఈ, ఆస్ట్రేలియా, జర్మనీ, జపాన్, సింగపూర్, మలేషియా, కరేబియన్, ఫిజీ, మలేషియా, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక దేశాల్లో రిలీజ్ చేయాలని వర్కవుట్ చేస్తున్నారు.

దేశీయంగా కూడా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డు స్థాయిలో జరిగింది. ఈ చిత్రం మలయాళ థియేట్రికల్ రైట్స్‌ను స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్‌కు చెందిన పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ దక్కించుకొన్నది. ఈ సినిమాను కేరళ వ్యాప్తంగా ఆయన డిస్ట్రిబ్యూట్ చేసేందుకు హక్కులను చేజిక్కించుకొన్నారు. అంతా సవ్యంగా జరుగుతున్న సమయంలోనే కేరళలోని థియేటర్ అసోసియేషన్ ఎఫ్ఈయూఓకే (FEUOK) ఆంక్షలు విధించింది. దాదాపు 55 శాతం కమిషన్ మాకు ఇవ్వాలని డిమాండ్ చేసింది. అలా కుదరని పక్షంలో ఈ సినిమాను మలయాళంలో నిషేధిస్తామని అల్టిమేటం జారీ చేసింది.

FEUOK అల్టిమేటం ఇచ్చినప్పటికీ.. వారు ఈ సినిమాను బహిష్కరిస్తే.. ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు మ్యాజిక్ ఫ్రేమ్స్, ఆశీర్వాద్ సినిమాస్, సెంట్రల్ థియేటర్స్, ఇతర నేషనల్ థియేటర్ చైన్స్, ఇతర ఎగ్జిబ్యూటర్లు సిద్దంగా ఉన్నారు. అయినప్పటికీ.. థియేటర్ అసోసియేషన్‌తో చర్చలు జరిపి సమస్యను సానుకూలంగా పరిష్కరించేందుకు సినీ వర్గాలు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X