twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పండంటి బిడ్డకు జన్మనిచ్చిన అందాల నటి.. సూపర్‌స్టార్ ట్వీట్

    |

    మలయాళ అందాల నటి కావ్య మాధవన్ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఆడపిల్లకు జన్మనిచ్చినట్టు నటుడు దిలీప్ సోషల్ మీడియాలో వెల్లడించారు. వివాదాస్పద నటుడు దిలీప్‌ను అనేక ప్రతికూల పరిస్థితుల మధ్య 2016లో కావ్య మాధవన్ వివాహం చేసుకొన్న సంగతి తెలిసిందే. వారి వివాహం తర్వాత మలయాళ నటిని కిడ్నాప్, లైంగిక దాడి ఆరోపణలపై దిలీప్ జైలుకు వెళ్లిన విషయం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. చేదు ఘటనల నేపథ్యంలో కూతురు పుట్టడం దిలీప్‌కు ఊరట కలిగించే అంశమని పేర్కొంటున్నారు.

    తల్లి, బిడ్డ క్షేమం

    తల్లి, బిడ్డ క్షేమం

    దిలీప్ ట్వీట్ ప్రకారం.. కావ్య మాధవన్ అక్టోబర్ 19న పండంటి ఆడపిల్లకు జన్మినిచ్చింది. తల్లి, కూతురు ఆరోగ్యంగా, క్షేమంగా ఉన్నారు. పురుటి నొప్పులు రావడంతో కావ్యను అక్టోబర్ 18న కొచీలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించాం అని ట్వీట్టర్, ఫేస్‌బుక్‌లో దిలీప్ వెల్లడించారు.

    దిలీప్ ఇంట్లో ఆనందం

    దిలీప్ ఇంట్లో ఆనందం

    దిలీప్, కావ్య మాధవన్‌‌కు బిడ్డ పుట్టారనే వార్త వారి ఇంటిలో ఆనందం వెల్లివిరిసింది. ఆయా కుటుంబ సభ్యులందరూ సంతోషంలో మునిగిపోయారు. దిలీప్ కూతురు మీనాక్షికి ఓ చెల్లెలు తోడుగా వచ్చింది. కావ్య, దిలీప్ చాలా సంతోషంగా ఉన్నారు అని వారి కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ అన్నారు.

    దిలీప్‌తో కావ్యకు రెండో వివాహం

    దిలీప్‌తో కావ్యకు రెండో వివాహం

    మలయాళ సూపర్‌స్టార్ దిలీప్ తొలుత మంజు వారియర్‌ను వివాహం చేసుకొన్నారు. వారికి మీనాక్షి అనే కూతురు పుట్టింది. ఆ తర్వాత వ్యక్తిగత విభేదాల కారణంగా విడిపోయారు. దిలీప్‌తో కావ్యకు రెండో వివాహం. అంతకంటే ముందు నిశాల్ చంద్ర అనే అతడిని కావ్య వివాహం జరిగింది. 2011లో కావ్య, నిషాల్ విడిపోయారు.

    2016లో కావ్య, దిలీప్ వివాహం

    2016లో కావ్య, దిలీప్ వివాహం

    నిషాల్‌ నుంచి విడాకులు తీసుకొన్న తర్వాత దిలీప్‌తో కావ్య మాధవన్ ప్రేమలో పడింది. 2016 నవంబర్ 26న వివాహం చేసుకోబోతున్నామని వారిద్దరూ సంచలన ప్రకటన చేశారు. కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో వారిద్దరూ పెళ్లి చేసుకొన్నారు. ఆ కొద్ది రోజులకు కావ్య గర్భిణి అనే విషయం బయటకు పొక్కింది.

    English summary
    Malayalam actors Dileep and Kavya Madhavan entered wedlock on November 25, 2016 in Kochi amidst their near family and friends. Early this year, it was announced that the couple are expecting their first child. Dileep took to Facebook to share that Kavya has delivered a baby girl. He also added that both mother and daughter are doing healthy.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X