తల్లి కాబోతున్న సీనియర్ హీరోయిన్!
మలయాళం సీనియర్ నటి కావ్య మాధవన్ తల్లి కాబోతోంది. ప్రస్తుతం ఆమె గర్భవతి అని వార్తలు వస్తున్నాయి. వివాదాస్పద నటుడు దిలీప్, కావ్య 2016 లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ జంట ఇప్పుడు తల్లిదండ్రులు కాబోతున్నారు. త్వరలో తమ కుటుంబంలోకి మరో బుజ్జి పాపాయి వస్తుండడంతో కావ్య, దిలీప్ సంతోషంలో ఉన్నారు.
దిలీప్ తన మొదటి భార్య మంజు వారియర్ నుంచి 2015 లో విడాకులు పొందారు. ఆమెతో విడిపోయిన తరువాత కావ్యని వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం దిలీప్ తీవ్ర వివాదంలో ఉన్నాడు.

మలయాళీ నటిని లైంగిక వేధింపులకు గురిచేసిన కేసులో దిలీప్ ప్రధాన నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఆ కేసులో ప్రస్తుతం దిలీప్ బెయిలుపై ఉన్నాడు. అతడిపై ఉన్నా నిషేధాన్ని మలయాళీ మూవీ అసోసియేషన్ ఇటీవల ఎత్తివేసింది. ఈ వ్యవహారం కూడా దుమారం రేపింది.


Click it and Unblock the Notifications











