కీర్తీ సురేష్‌ను సత్కరించిన ముఖ్యమంత్రి.. స్మైల్‌తో చంపేస్తున్న బ్యూటీ (ఫొటోలు)

అందం, అభినయంతో ఆకట్టుకొంటున్న కీర్తీ సురేష్‌కు దక్షిణాదిలో మంచి క్రేజ్ ఏర్పడింది. మహానటి చిత్రంలో అద్భుతమైన అభినయంతో దక్షిణాది ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది. తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషల్లో వరుస ప్రాజెక్టులతో దూసుకెళ్తున్న ఈ మలయాళీ ముద్దుగుమ్మకు తాజాగా సొంత రాష్ట్రంలో అరుదైన గౌరవం లభించింది. ఓనమ్ పండుగ సందర్భంగా కేరళ ప్రభుత్వం కీర్తి సురేష్‌ను సత్కరించుకొన్నది. ఈ కార్యక్రమానికి హాజరైన సీఎం పునరయి విజయన్ చేతుల మీదుగా మెమొంటోను స్వీకరించింది.

Recommended Video

66th National Film Awards : Analysis On Keerthy Suresh Performance In 'Mahanati' || Filmibeat Telugu
ముఖ్యమంత్రి చేతుల మీదుగా

ముఖ్యమంత్రి చేతుల మీదుగా

ముఖ్యమంత్రి విజయన్ చేతుల మీదుగా సత్కారం అందుకోవడంపై కీర్తి సురేష్ తన ఇన్స్‌టాగ్రామ్‌లో స్పందించింది. కేరళ ముఖ్యమంత్రి శ్రీ పునరయి విజయన్ సార్ చేతుల మీదుగా, కేరళ ప్రభుత్వం ద్వారా సత్కారం అందుకోవడం గర్వంగా ఉంది అని కీర్తీ సురేష్ ఓ పోస్టు చేసింది.

తెలుగులో మిస్ ఇండియాలో

తెలుగులో మిస్ ఇండియాలో

ఇక కీర్తి సురేష్ కెరీర్ విషయానిక వస్తే.. మహానటి తర్వాత తెలుగులో మిస్ ఇండియా చిత్రంలో నటిస్తున్నది. ఈ చిత్రాన్ని యువ నిర్మాత మహేష్ కోనేరు నిర్మిస్తున్నారు. అలాగే వెంకీ అట్లూరి తెరకెక్కించే రంగ్ దే చిత్రంలో నితిన్ సరసన నటిస్తున్నది. ఇటీవల సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానటి చిత్రానికి ఆమె జాతీయ అవార్డు అందుకొన్న సంగతి తెలిసిందే.

 తమిళంలో బిగిల్, మలయాళంలో మరక్కర్

తమిళంలో బిగిల్, మలయాళంలో మరక్కర్

తమిళంలో విజయ్ నటించిన బిగిల్ చిత్రంలో కూడా కీర్తీ సురేష్ హీరోయిన్‌గా నటిస్తున్నది. సెన్సేషనల్ డైరెక్టర్ కార్తీ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఓ సినిమాలో కీర్తి సురేష్ కీలకమైన పాత్రలో కనిపించనున్నది. అలాగే మలయాళంలో సూపర్ స్టార్ మోహన్ లాల్ సరసన మరక్కర్: అరబి కదలింటే సింహమ్ అనే క్రేజీ ప్రాజెక్టులో నటిస్తున్నది.

హిందీలో మైదాన్

హిందీలో మైదాన్

దక్షిణాదిలో వరుస చిత్రాల్లో నటిస్తున్న కీర్తీ సురేష్ హిందీ చిత్ర పరిశ్రమలోకి కూడా ప్రవేశిస్తున్నది. బాలీవుడ్ చిత్రం మైదాన్‌లో నటుడు అజయ్ దేవగన్ సరసన హీరోయిన్‌గా కనిపించబోతున్నది. ఈ చిత్రాన్ని బోనికపూర్ నిర్మిస్తున్నారు. బదాయి హో డైరెక్టర్ అమిత్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు.

 సైమాలో ఉత్తమ నటిగా

సైమాలో ఉత్తమ నటిగా

ఖతర్‌లో నిర్వహించిన సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డుల కార్యక్రమంలో కీర్తీ సురేష్ అందంతో ఆకట్టుకొన్నారు. ఈ అవార్డుల కార్యక్రమంలో ఉత్తమ నటిగా అవార్డు అందుకొన్నారు. మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులను కూడా కీర్తీ సురేష్ తీసుకోవడం గమనార్హం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X