For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Kerala Film Awards: నటి రేవతి అరుదైన ఘనత: సినిమాల్లోకి వచ్చిన 38 ఏళ్ల తర్వాత గొప్ప రికార్డు

  |

  సాధారణంగా సినీ రంగంలో ఉత్తమ నటన కనబరిచిన వాళ్లకు అవార్డులు ఇస్తుంటారు. ఇవి వాళ్లలోని కళలను మరింతగా బయటకు తీసుకు వచ్చేందుకు దోహదం చేస్తుంటాయి. ఫలితంగా కళాకారులు, టెక్నీషియన్లు రెట్టించిన ఉత్సాహంతో తమ పనితీరుపై శ్రద్ద పెడుతుంటారు. అలాంటిది చాలా కాలంగా అత్యుత్తమ ప్రదర్శనను ఇస్తున్నా సరైనా గుర్తింపు దక్కకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో వర్ణించడమే కష్టం. సరిగ్గా ఇలాంటి అనుభవాన్నే ఎదుర్కొన్నారు సౌతిండియన్ సీనియర్ యాక్ట్రెస్ రేవతి. ఆమె సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి దాదాపు 38 ఏళ్లు అవుతోన్నా మాతృ భాషలో మాత్రం సరైనా గుర్తింపును సొంతం చేసుకోలేకపోయారు.

  అనుష్క శర్మ ఎద అందాల ఆరబోత: తల్లైనా తగ్గకుండా.. కోహ్లీ భార్యను ఇలా చూశారంటే!

  కేరళ రాష్ట్రానికి చెందిన రేవతి 1983వ సంవత్సరంలో వచ్చిన 'కట్టత్తె కిలికోడు' అనే మలయాళ చిత్రం ద్వారా నటిగా పరిచయం అయ్యారు. అప్పటి నుంచి ఆమె కొన్ని వందల చిత్రాల్లో నటించారు. అందులో మలయాళంతో పాటు తమిళం, కన్నడం, తెలుగు, హిందీ చిత్రాలు కూడా ఉన్నాయి. అన్ని భాషల్లోనూ రేవతి ఎన్నో అత్యుత్తమ పాత్రలను పోషించి ఉత్తమ నటిగా అవార్డులు గెలుచుకున్నారు. పలుమార్లు జాతీయ అవార్డులను సైతం దక్కించుకున్నారు. కానీ, 38 ఏళ్ల సినీ ప్రయాణంలో ఆమె ఒక్కటంటే ఒక్కసారి కూడా కేరళ రాష్ట్ర ప్రభుత్వం నుంచి బెస్ట్ యాక్ట్రెస్‌గా అవార్డును స్వీకరించలేదు.

  సీనియర్ నటి రేవతి ఇటీవలే 'భూతకాలమ్' అనే హర్రర్ థ్రిల్లర్ మూవీలో నటించారు. రాహుల్ సదాశివన్ తెరకెక్కించిన ఈ సినిమాలో ఆమె ప్రధాన పాత్రను పోషించారు. ఏమాత్రం అంచనాలు లేకుండానే విడుదలైన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఇక, ఇందులో నటనకు గానూ రేవతి తాజాగా ప్రకటించిన కేరళ రాష్ట్ర ప్రభుత్వ అవార్డుల్లో ఉత్తమ నటిగా ఎంపిక అయ్యారు. తద్వారా సినీ రంగంలోకి వచ్చిన 38 ఏళ్ల తర్వాత అవార్డును దక్కించుకున్న నటిగా ఆమె రికార్డు క్రియేట్ చేశారు. దీంతో ఈమె దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతున్నారు. ఇక, రేవతికి పలువురు సెలెబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

  హాట్ డోస్ పెంచేసిన అనన్య నాగళ్ల: ఆ పార్టును హైలైట్ చేస్తూ యమ ఘాటుగా!

  Kerala Film Awards: Actress Revathi Wins Her First Award After 38 Years Of her Debut And Says Its Not Late

  సుదీర్ఘ ప్రయాణం తర్వాత మాతృ భాషలో ఉత్తమ నటిగా అవార్డు అందుకోవడంపై నటి రేవతి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడిన ఆమె 'అవార్డు రావడం అనేది ఆలస్యమైందని నాకు అనిపించడం లేదు. అవార్డ్ అనేది ఒక గుర్తింపు మాత్రమే. ఇది నిర్దిష్ట సంవత్సరంలోని జ్యూరీ సభ్యుల అభిప్రాయాలు, వారి ఆలోచనా ధోరణి మీద ఆధారపడి ఉంటుంది. మీకు అవార్డు రాకపోతే.. మీ పనితీరు బాగా లేదని లేదా మీరు చేసిన సినిమా బాగోలేదని అర్థం కాదు. నేను చేసిన సినిమాల విషయంలో నేను ఎప్పుడూ ఖచ్చితంగా ఉంటాను. దేనికదే ఉత్తమంగా చేయాలని భావించాను. ఇప్పుడు అదే నాకు ఈ అవార్డును తెచ్చి పెట్టింది' అని చెప్పుకొచ్చారు.

  నటి రేవతి తెలుగులోనూ ఎన్నో సినిమాలు చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు, ఆమె దర్శకురాలి, ప్లేబ్యాక్ సింగర్‌గా, వాయిస్ అసిస్టెంట్‌గా, సీరియల్ నటిగా ఇలా ఎన్నో విధాలుగా ప్రేక్షకులను అలరిస్తూనే వచ్చారు. ఇప్పటికీ ఆమె వరుసగా మూవీల మీద మూవీలు చేస్తూనే ఉన్నారు. ఇక, జూన్ 3వ తేదీన విడుదల కాబోతున్న అడివి శేష్ 'మేజర్' సినిమాలో సైతం ఆమె అత్యంత ముఖ్యమైన పాత్రను పోషించారు.

  English summary
  Actress Revathi Wins Her First Award After 38 Years Of her Debut. Then She Says "Its Not Late' to Media.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X