For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బిపిన్ రావత్ మరణం.. మతం మార్చుకున్న డైరెక్టర్... అసలు ఏమైందంటే?

  |

  చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారనే వార్తల నేపధ్యంలో ఒక దర్శకుడు మాత్రం మారుతున్నట్లు గా ప్రకటించడం సంచలనం రేపుతోంది దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే

  రావత్ అకాల మృతికి

  రావత్ అకాల మృతికి

  భారతదేశ చరిత్రలో చీకటి రోజుగా 2021 డిసెంబర్ 8 వ తేదీ నిలిచిపోతుంది. భారతదేశపు మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ గురువారం నాడు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఈ విషయాన్ని భారత వైమానిక దళం ధృవీకరించింది. బిపిన్ రావత్ తో భార్య మధులిక సహా మరో 11 మంది కూడా విమానంలో ఉన్నారు. వారిలో ఒక అధికారి మాత్రమే బతికి ఉన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఇప్పటికీ కూడా విషమంగానే ఉంది..రావత్ అకాల మృతికి యావత్ ప్రపంచం సంతాపం తెలియజేసింది.

  అందరూ బాధ పడుతుంటే

  అందరూ బాధ పడుతుంటే

  రష్యా, అమెరికా , ఇజ్రాయెల్ నుంచి పాకిస్తాన్ వరకూ అనేక దేశాలు భారత దేశం ఒక గొప్ప దేశ భక్తుడిని కోల్పోయింది అంటూ సంతాపం తెలియజేస్తూ ఒక ప్రకటన విడుదల చేశాయి. అయితే దేశంలో ఉన్న కొంతమంది మాత్రం ఆయన మృతి విషయంలో చాలా అనుచిత వ్యాఖ్యలు చేశారు. అలా అవమానకరమైన వ్యాఖ్యలు చేసిన గుజరాత్‌ లోని 44 ఏళ్ల వ్యక్తిని అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ సెల్ అరెస్టు చేసింది. రెండు వర్గాల మధ్య ద్వేషాన్ని రెచ్చగొడుతున్నాడని 153-ఏ సెక్షన్ కింద శివభాయ్ రామ్ అదుపులోకి తీసుకున్నారు. మతాన్ని అవమానిస్తున్న కారణంతోనూ 295-ఏ సెక్షన్ కింద కేసు బుక్ చేశారు. ఇక ఒక మతానికి చెందిన వారు కూడా ఆయన మరణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.

  హిందూ మతంలోకి మారుతున్నా

  హిందూ మతంలోకి మారుతున్నా

  కొందరు ఆయన మృతి విషయంలో అగౌరవంగా స్పందించడాన్ని ఖండిస్తూ, కేరళ సినీ దర్శకుడు అలీ అక్బర్ తనకు మతంపై నమ్మకం పోయి, తన భార్యతో కలిసి హిందూ మతంలోకి మారనున్నట్టు ఆయన వెల్లడించారు. డిసెంబరు 8న ఛీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన తర్వాత సమాజంలోని ఒక నిర్దిష్ట వర్గం వారు సామాజిక మాధ్యమాల్లో చేసిన అవమానకరమైన చర్యలను మలయాళ దర్శకుడు అలీ అక్బర్ ఖండించారు. అందుకు నిరసనగా అక్బర్ హిందూ మతంలోకి మారి తన పేరును రామసింహగా మార్చుకున్నాడు.

  ముస్లింని కాదు, నేను భారతీయుడిని

  ముస్లింని కాదు, నేను భారతీయుడిని

  "సిడిఎస్ జనరల్ బిపిన్ రావత్ మరణానికి సంబంధించిన పోస్ట్‌లపై స్మైలీలు చేస్తున్న వారికి వ్యతిరేకంగా ఇది నిరసన అని పేర్కొన్న ఆయన మత పెద్దలు వారిని ఎందుకు సరిదిద్దడం లేదు? అని ఆయన ప్రశ్నించారు. "నేను ఈ రోజు నుండి ముస్లింని కాదు. నేను భారతీయుడిని. నేను ఇకపై దేశ వ్యతిరేకులతో నిలబడలేను" అని శుక్రవారం సోషల్ మీడియాలో వీడియో పోస్ట్‌లో తెలిపారు. తన మతంపై తనకు నమ్మకం పోయిందని ఆయన ప్రకటించాడు. ఇప్పుడు, ఆయన, ఆయన భార్య లూస్యమ్మ హిందువులుగా మారబోతున్నారు.

  Multi Starrer Movie With Mahesh Babu, Ram Charan ? || Filmibeat Telugu
  రామసింహన్‌గా

  రామసింహన్‌గా


  అలీ అక్బర్ ఇప్పుడు రామసింహన్‌గా మారబోతున్నారు. రామసింహన్ తన సంస్కృతికి అండగా నిలబడి దాన్ని నాశనం చేయాలనుకున్న వారిని చంపిన వ్యక్తి అని, అందుకే ఆయనకు ఆ పేరు సముచితమని అన్నారు. జనరల్ రావత్ మరణ వార్తపై అవమానకరమైన రియాక్షన్స్ రావడంతో, అలీ అక్బర్ తన ఫేస్‌బుక్ ఖాతాను డీయాక్టివేట్ చేశారు. ఇదే విషయం గురించి ఆయన కొత్త ఖాతా ద్వారా తన ప్రకటన చేశాడు. అలాగే తన కూతుళ్లను మతం మారమని బలవంతం చేయనని, అది వారి ఇష్టానికే వదిలేస్తానని చెప్పాడు. అలీ అక్బర్ గతంలో బిజెపి రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఉన్నారు. పార్టీ నాయకత్వంతో విభేదాల కారణంగా పదవికి రాజీనామా చేశారు.

  Read more about: ali akbar
  English summary
  Kerala filmmaker Ali Akbar to convert to Hinduism says have lost faith in islam.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X