కేరళ వరదల్లో రియల్ హీరో.. పెళ్లి వాయిదా వేసుకుని, స్వయంగా వరదలోకి దిగిన నటుడు!

Recommended Video

Kerala Floods : Kerala Hero Postpones His Marriage On Behalf Of Floods

కేరళ వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కేరళలో చాలా ప్రాంతాల్లో జనజీవనం స్థంభించిపోయిన సంగతి తెలిసిందే. కేరళ వరద బాధితులకు దేశం నలుమూలల నుంచి విరివిగా విరాళాలు అందుతున్నాయి. సినీరాజకీయ ప్రముఖులంతా కేరళ బాధితుల్ని ఆదుకునేందుకు ముందుకు వస్తున్నారు. కేరళలో కొందరు సెలెబ్రిటీల ఇళ్లపై కూడా వరద ప్రభావం పడింది. యువనటుడు రాజీవ్ పిళ్ళై త్వరలో వివాహం చేసుకోవాల్సి ఉంది. ఈ వరదల వలన రాజీవ్ తన వివాహాన్ని వాయిదా వేసుకున్నాడు.

పెళ్లి వాయిదా

పెళ్లి వాయిదా

మోడల్ గా, నటుడిగా రాజీవ్ పిళ్ళై మంచి గుర్తింపు పొందాడు. పలు చిత్రాల్లో నటిస్తున్నాడు. త్వరలో అజిత అనే అమ్మాయితో రాజీవ్ వివాహం జరగవలసి ఉంది. కానీ వరదల కారణంగా వివాహం వాయిదా వేసుకున్నారు. ఈ కొత్త పెళ్లి కొడుకు పెళ్లి వాయిదా వేసుకుని మరీ అందరికి ఆదర్శవంతంగా నిలుస్తున్నాడు.

స్వయంగా వరదలోకి

రాజీవ్ నివాసం కేరళలోని చిన్న టౌన్ లో ఉంది. రాజీవ్ ఉంటున్న ప్రాంతం మినహా మిగిలిన ప్రాంతమంతా వరదలో మునిగిపోయింది. తన గ్రామ ప్రజలకోసం రాజీవ్ స్వయంగా వరదలోకి దిగి సహాయ సహకారాలు అందిస్తున్నాడు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

సురక్షిత ప్రాంతంలోకి

సురక్షిత ప్రాంతంలోకి

రాజీవ్ స్వయంగా వరద నీటిలోకి దిగి ఆ గ్రామంలో ఉండే ప్రజలని సురక్షిత ప్రాంతాలకు తాలించాడు. రాజీవ్ పిళ్ళై రియల్ హీరో అనిపించుకున్నాడు. మా ఇంటి నుంచి 500 మీటర్ల దూరంలో ఉన్నా ప్రాంతం మొత్తం మునిగిపోయింది. దాదాపు 48 గంటలు అంతా నీటిలోనే ఉన్నాం అని రాజీవ్ తెలిపాడు.

అంత టైంలేదు

అంత టైంలేదు

ఇక ఎక్కువ సమయం నీటిలో ఉంటె ప్రమాదం అని భావించాం. పడవలు వచ్చేంతవరకు వేచి చూడడం మంచిది కాదు. అందుకే తామే స్వయంగా రంగంలోకి దిగి కొందరిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేశాం అని రాజీవ్ తెలిపాడు.

షకీలా బాయ్ ఫ్రెండ్

షకీలా బాయ్ ఫ్రెండ్

రాజీవ్ ప్రస్తుతం షకీలా బయోపిక్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో రిచా చద్దా షకీలా పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. షకీలా ప్రేమికుడి పాత్రలో రాజీవ్ కనిపిస్తాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X