Wayanad Floods: రియల్ స్టార్స్ అనిపించుకున్న మోహన్ లాల్,రష్మిక . వయనాడ్‌ బాధితులకు అండగా!

కేరళలో ప్రకృతి సృష్టించిన విలయతాండవం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆకస్మికంగా వచ్చిన వరదల కారణంగా కొండచరియలు విరిగిపడి పెను విషాదం చోటుచేసుకుంది . రెప్పపాటులో చోటు చేసుకున్న ఈ ఘోర విపత్తులో దాదాపు 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇంకా బురద, శిథిలాల కింద మరింత మంది చిక్కుకుని ఉండే అవకాశాలు కనిపిస్తుండటంతో సహాయక బృందాలు నిరంతరాయంగా శ్రమిస్తున్నాయి. సుమారు 218 మంది ఆచూకీ లభ్యం కావాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.

ఈ దుర్ఘట నేపథ్యంలో వైద్యులు, నర్సులు, ఇతర ఆరోగ్య సిబ్బంది 24 గంటలూ పనిచేస్తున్నారు. గాయపడిన వారికి చికిత్స అందించడం, మృతదేహాలకు పోస్ట్‌మార్టం చేయడం వాంటి విధులు నిర్వర్తిస్తున్నారు. ఒకానొక దశలో దారుణ స్థితిలో ఉన్న మృతదేహాలకు పోస్ట్‌మార్టం చేయడానికే వైద్యులు వణికిపోతున్నారట. చాలా వరకు డెడ్ బాడీలు ఛిద్రమై ఉన్నాయని.. కొన్నింటి ముఖాలు బాగా చిట్లి, ఎవరో కావాలని కొట్టినట్లుగా ఉన్నాయని ఓ డాక్టర్ తెలిపారు. ఓ శరీరం మొత్తం ఛిద్రమైపోయిందని, రెండో దానిని అస్సలు చూడాలంటేనే భయమేసిందని పోస్ట్‌మార్టం వదిలేసి పారిపోదామనుకున్నానని డాక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు.

kerala floods malluwood star hero Mohanlal visits landslide-hit Wayanad village in Army uniform

వరదల్లో గల్లంతైనవారిని గుర్తించడానికి టెక్నాలజీని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం డ్రోన్లు, రాడార్లు, మొబైల్ ఫోన్ల సిగ్నళ్లను వినియోగిస్తున్నారు. జీపీఎస్ ద్వారా .. శిథిలాల కింద ఉన్న వారిని గుర్తించే వీలుందని, బాధితులు చివరిసారిగా చేసిన ఫోన్ ఏ ప్రాంతం నునంచి వచ్చిందో తెలుసుకుని అక్కడికి చేరుకునేందుకు సహాయక బృందాలు ప్రయత్నిస్తున్నారు. శిథిలాల కింద దాదాపు 10 -12 అడుగుల లోతున్న ఉన్నవారిని సైతం పసిగట్టగల జాగిలాలను రప్పిస్తున్నారు. ఇప్పటికే భారత సైన్యం పంపించిన ఆరు జాగిలాలకు తోడు తమిళనాడు నుంచి మరో నాలుగు తెప్పిస్తున్నారు.

కేరళలో విలయతాండవం నేపథ్యంలో కేంద్రం, పలు రాష్ట్ర ప్రభుత్వాలు, పలువురు ప్రముఖులు ఆపన్న హస్తం అందించేందుకు ముందుకు వచ్చారు. రాష్ట్రంలో నెల రోజుల పాటు సినిమా కార్యక్రమాలు నిర్వహించకూడదని మలయాళ చిత్ర పరిశ్రమ నిర్ణయించింది. ఇప్పటికే పలువురు సెలబ్రెటీలు సీఎం రిలీఫ్ ఫండ్‌కు భారీగా విరాళాలిచ్చారు. సినీ నటి , నేషనల్ క్రష్ రష్మిక మందన్న .. కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.10 లక్షలు విరాళంగా అందించి పెద్ద మనసు చాటుకున్నారు.

kerala floods malluwood star hero Mohanlal visits landslide-hit Wayanad village in Army uniform

అయితే పరోక్షంగా సాయపడటం కంటే ప్రత్యక్షంగా బాధితులకు అండగా నిలవాలని నిర్ణయించుకున్నారు మలయాళ సినీ దిగ్గజం మోహన్ లాల్. టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్న ఆయన వయనాడ్‌లో రెస్క్యూ ఆపరేషన్స్‌లో పాల్గొనేందుకు స్వయంగా టెరిటోరియల్ ఆర్మీ బేస్ క్యాంప్‌కు వచ్చారు. విపత్తు చోటు చేసుకున్న ప్రాంతాన్ని పరిశీలించి సైనికులతో సమావేశమయ్యారు. అంతేకాదు.. సహాయ పునరావాస కార్యక్రమాల కోసం రూ.3 కోట్ల విరాళాన్ని అందజేశారు. మిలటరీ యూనిఫాంలో ఉన్న మోహన్ లాల్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఆయన పెద్ద మనసుపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

More from Filmibeat

Read more about: kerala floods malluwood mohanlal
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X