కేరళ వరద బీభత్సం: హీరో తల్లిని కాపాడి టబ్‌లో తీసుకొచ్చారు (ఫోటోస్)

By Bojja Kumar

ప్రకృతి కన్నెర్ర చేస్తే సామాన్యుడైనా, సెలబ్రిటీలైనా విలవిల్లాడాల్సిందే. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నదులు పొంగి పొర్లుతూ కేరళ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. వరద బీభత్సం వల్ల ఇప్పటికే వేలాది మంది నిరాశ్రయులవ్వగా.... వందల్లో మృతి చెందారు. సహాయక బృందాలు తమ శక్తిమేర ప్రయత్నం చేస్తూ వీలైనంత మందిని కాపాడుతున్నాయి. తాజాగా మలయాళ హీరో, దర్శకుడు, నిర్మాత పృధ్విరాజ్ సుకుమారన్ తల్లిని కూడా వరద ప్రాంతం నుండి కాపాడారు.

 కొచ్చిలోని ఇంటి నుండి

కొచ్చిలోని ఇంటి నుండి

పృధ్విరాజ్ తల్లి మల్లికా సుకుమారన్ కొచ్చిలోని తమ విలాసవంతమైన భవనంలో నివాసం ఉంటున్నారు. భారీ వరదల కారణంగా వీరి ఇంట్లోకి కూడా నీళ్లు చేరాయి. ఆమెను రెస్క్యూ చేసి కాపాడి సురక్షిత ప్రాంతానికి తరలించారు.

టబ్‌లో తీసుకొస్తూ

టబ్‌లో తీసుకొస్తూ

మల్లికా సుకుమారన్‌ను ఓ టబ్బులో కూర్చోబెట్టి తీసుకొస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. భారీ కాయంతో ఉన్న ఆమెను నలుగురు వ్యక్తులు తీసుకొస్తున్నట్లు ఫోటోల్లో ఉంది.

మునిగిపోయిన ఇల్లు

మునిగిపోయిన ఇల్లు

భారీ వర్షాల కారణంగా కొచ్చిలోని పృధ్విరాజ్ ఇల్లు నీటమునిగింది. ఇంటినికి అన్ని రకాల ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి కానీ వరదల నుండి రక్షణ కవచం లేదంటూ సోషల్ మీడియాలో కొందరు కామెంట్ చేశారు.

ఖరీదైన కార్లు కూడా

ఖరీదైన కార్లు కూడా

ఈ వరదల కారణంగా పృధ్వీ రాజ్ ఇంట్లో ఉన్న ఖరీదైన కార్లు సైతం నీట మునిగిపోక తప్పలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X