twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రేప్ కేసులో నటుడికి స్వల్ప కాలిక ఊరట.. కానీ షరతులు వర్తిస్తాయన్న కోర్టు

    |

    మహిళా నటిపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మలయాళ నటుడు విజయ్ బాబుకు కేరళ హైకోర్టు బుధవారం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ కేసు విచారణ కోసం జూన్ 27న దర్యాప్తు అధికారి ముందు లొంగిపోవాలని కోరింది. కొచ్చి నగర పోలీసులు అతనిపై కేసు నమోదు చేయడంతో అరెస్ట్ భయంతో విజయ్ బాబు దేశం విడిచి పారిపోయారు. హై కోర్టు అతనికి అరెస్టు విషయంలో అభయం కల్పించడంతో మే చివరి వారంలో అతను తిరిగి కొచ్చికి చేరుకున్నాడు. అయితే లైంగిక వేధింపుల కేసు కాకుండా సోషల్ మీడియాలో సదరు మహిళా నటి ఎవరనే విషయాన్ని వెల్లడించినందుకు బాబు మరో కేసును ఎదుర్కొన్నారు.

    హైకోర్టు రెండవ కేసులో అతని ముందస్తు బెయిల్ పిటిషన్‌ను గతంలో తిరస్కరించింది. విచారణ నిమిత్తం జూన్ 27న ఉదయం 9 గంటలకు దర్యాప్తు అధికారి ఎదుట లొంగిపోవాలని జస్టిస్ బెచు కురియన్ థామస్ ధర్మాసనం ఆదేశించింది. పిటిషనర్‌ను వచ్చే ఏడు రోజుల పాటు విచారించవచ్చని జస్టిస్ థామస్ తెలిపారు. పోలీసులు నటుడిని అరెస్టు చేయాలనుకుంటే, బెయిల్‌పై విడుదల చేయాలని కోర్టు పేర్కొంది, ఇద్దరు సాల్వెంట్ ష్యూరిటీలతో రూ. 5 లక్షల బాండ్‌ని తీసుకోవాలని సూచించింది. విజయ్ బాధితురాలికి కానీ ఆమె కుటుంబానికి కానీ వ్యతిరేకంగా సోషల్ మీడియా లేదా ఇతర మోడ్‌ల ద్వారా ఎలాంటి విధమైన దాడికి పాల్పడకూడదని పేర్కొంది.

     Kerala High Court grants anticipatory bail to actor Vijay Babu in rape case

    అంతేకాదు న్యాయస్థానం అనుమతి లేకుండా పిటిషనర్ కేరళను విడిచిపెట్టరాదని పేర్కొంది. మరోపక్క అత్యాచార బాధితురాలి గుర్తింపును వెల్లడించినందుకు విజయ్ బాబుపై నమోదైన కేసుకు సంబంధించి, పోలీసులు నటుడిపై ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 228A - ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 67 కింద అభియోగాలు మోపారు. ఈ సెక్షన్ల కింద ఉన్న నేరాలు బెయిలబుల్ అయినందున, ముందస్తు బెయిల్ పిటిషన్‌ను విచారించడం సాధ్యం కాదని కోర్టు పేర్కొంది, అందుకే జూన్ 14న దానిని కొట్టివేసింది. మిడిల్ ఈస్ట్ నుండి తిరిగి వచ్చిన తర్వాత, బాబు విచారణ కోసం పోలీసుల ముందు హాజరయ్యారు. తనకు సదరు మహిళా నటితో తనకు అగ్రిమెంట్ ఉందని చెప్పుకొచ్చారు. సినిమాల్లో పాత్రలు రాకపోవడంతో మహిళా నటి తనపై ఈ ఆరోపణలు చేసిందని ఆయన ఆరోపించారు. అంతకుముందు, ముందస్తు బెయిల్‌ను కోరుతూ, బాబు తన వాదనను రుజువు చేయడానికి సోషల్ మీడియా చాట్‌ల వివరాలను కూడా పోలీసులకు అందించారు.

    English summary
    Kerala High Court grants anticipatory bail to producer-actor Vijay Babu in rape case under some conditions.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X