కోటి ఇచ్చాడు, ప్రభాస్‌ను చూసి మీరంతా నేర్చుకోండి: కేరళ మంత్రి సంచలనం!

By Bojja Kumar

Recommended Video

Kerala Minister Kadakampally Surendran Speaks About Prabhas

కేరళలో భారీ వర్షాలు, వరదల కారణంగా భారీ నష్టం జరిగిన సంగతి తెలిసిందే. వందల సంఖ్యలో ప్రజలు మరణించగా, వేల సంఖ్యలో ప్రజలు తమ ఇళ్లను కోల్పోయి నిరాశ్రయులయ్యారు. ఈ నేపథ్యంలో మలయాళ సినీ పరిశ్రమకు చెందిన సినీ సెలబ్రిటీలు కేరళ ప్రజలకు సహాయం అందించారు. ఆర్థిక సహాయం చేసి, సహాయ కార్యక్రమాల్లో సైతం కొందరు తమవంతు కర్తవ్యం నిర్వర్తించారు. ఈ నేపథ్యంలో ప్రజల నుండి హర్షం వ్యక్తం అయింది. అదే సమయంలో కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. అందుకు కారణం ఇతర సినీ ఇండస్ట్రీల స్టార్లతో పోలిస్తే మలయాళ సినీ పరిశ్రమకు చెందిన స్టార్స్ ఆర్థిక విరాళాలు తక్కువగా అందించడమే.

తెలుగు, తమిళం నుండి భారీగా

తెలుగు, తమిళం నుండి భారీగా

తెలుగు, తమిళం నుండి స్టార్స్ భారీగా విరాళాలు అందించారు. అందరికంటే ముందుగా తమిళ స్టార్స్ సూర్య, కార్తి సోదరులు కలిసి రూ. 25 లక్షలు విరాళం ఇచ్చారు. ఆ తర్వాత ఇతర స్టార్స్ భారీగా విరాళాలు ప్రకటించారు.

మలయాళం స్టార్లపై కేరళ మంత్రి ఫైర్

మలయాళం స్టార్లపై కేరళ మంత్రి ఫైర్

కేరళ టూరిజం శాఖ మంత్రి కడకంపల్లి సుందరేశన్, యాక్టర్ శీల మాట్లాడుతూ.... మలయాళ నటులు పెద్దగా విరాళాలు ఇవ్వక పోవడంపై మండి పడ్డారు. కోట్ల విలువ చేసే కార్లలో తిరిగే నటులు సొంత రాష్ట్రంలో విపత్తు వచ్చినపుడు సహాయం చేయడానికి ముందుకు రాకపోవడం దారుణమన్నారు.

ప్రభాస్‌ను చూసి నేర్చుకోండి

ప్రభాస్‌ను చూసి నేర్చుకోండి

‘మన రాష్ట్రంలో గొప్ప నటులు ఉన్నారు. వారు ఒక్కో సినిమాకు రూ. 3 నుండి 4 కోట్లు సంపాదిస్తారు.. కానీ వారు పెద్దగా విరాళాలు ఇవ్వక పోవడం బాధించింది. మలయాళంలో పెద్దగా ఫాలోయింగ్ లేని తెలుగు యాక్టర్ ప్రభాస్ రూ. 1 కోటి విరాళం ఇచ్చారు. అతడిని చూసి నేర్చుకోవడి అంటూ' కేరళ మంత్రి వ్యాఖ్యానించారు.

ప్రభాస్ ఎంత ఇచ్చాడు?

ప్రభాస్ ఎంత ఇచ్చాడు?

ప్రభాస్ కేరళ కోసం ఎంత డొనేషన్ ఇచ్చాడు అనే విషయంలో అఫీషియల్ సమాచారం లేదు. సాధారణంగా ప్రభాస్ తాను ఇచ్చే విరాళాల గురించి బయటకు చెప్పుకోరనే టాక్ ఉంది. ఆయన రూ. 1 కోటి ఇచ్చారని, రూ. 25 లక్షలు ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. మంత్రి వ్యాఖ్యలతో అభిమానుల్లో క్లారిటీ వచ్చినట్లయింది.

కోట్లు సంపాదిస్తున్నారు, ఎంత ఇచ్చారు?

కోట్లు సంపాదిస్తున్నారు, ఎంత ఇచ్చారు?

తన తరుపున రూ. 5 లక్షలు విరాళం అందించిన మలయాళం యాక్టర్ శీల మాట్లాడుతూ... ‘మన రాష్ట్రంలో రూ. 1 కోటి రెమ్యూనరేషన్ తీసుకునే స్టార్స్ ఉన్నారు. వారికి రూ. 3 నుండి 4 కోట్ల విలువ చేసే కార్లు ఉన్నాయి. అలాంటి వారు కేరళ ప్రజల కోసం ఎంత సహాయం చేవారు? అని ప్రశ్నించారు.

భారీ విరాళాలు ఇచ్చిన స్లార్స్ వీరే

భారీ విరాళాలు ఇచ్చిన స్లార్స్ వీరే

తమిళ యాక్టర్ రాఘవ లారెన్స్ కేరళ కోసం రూ. 1 కోటి విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు విజయ్‌కాంత్ కూడా రూ. 1 కోటి సహాయం అందించారు. తెలుగు, తమిళ పరిశ్రమలకు చెందిన ఇతర పెద్ద స్టార్స్‌లో విజయ్ 70 లక్షలు, ఇతర స్టార్స్ రూ. 25 లక్షల చొప్పున సహాయం అందించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X