పుట్టిన రోజునే బాత్ రూమ్ లో శవమైన నటి.. హత్యా? ఆత్మహత్యా?

పుట్టినరోజు అంటే అందరికీ అదో రకమైన ఆసక్తి, ఆ రోజంతా ఉల్లాసంగా గడపడానికి చూస్తారు. కానీ ఆమెకు మాత్రం పుట్టిన రోజే ఆఖరి రోజయ్యింది. బర్త్‌డే రోజు తన కుటుంబాన్ని కలవాలన్న కోరిక కూడా తీరకుండానే ఆమె కన్నుమూసింది. ఆమె మరెవరో కాదు కేరళ మోడల్‌ షహానా. షహానా పుట్టిన రోజు నాడే మరణించింది. అయితే ఆమెది ఆత్మహత్య అని భర్త చెబుతుండగా ఆమె భర్తే చంపేసి ఉంటాడని సహానా కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. మలయాళ పరిశ్రమకు చెందిన మోడల్, నటి షహానా శుక్రవారం కోజికోడ్‌లో శవమై కనిపించింది.

20 ఏళ్ల షహానా తన ఇంట్లో కిటికీ రెయిలింగ్‌కు వేలాడుతూ కనిపించింది. పర్బిల్ బజార్‌లోని ఆమె ఇంటి వద్దకు పోలీసులు చేరుకున్న సమయంలో ఆమె కిటికీకి వేలాడుతూ కనిపించింది. ఇక వారు ఉండే ప్రాంతం కోజికోడ్ నుండి దాదాపు 14 కి.మీ దూరంలో ఉంటుంది. షహానా భర్త సజాద్ ను విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు. ఏడాదిన్నర క్రితం వీరికి వివాహమవగా ఇద్దరూ అద్దె ఇంట్లో ఉంటున్నారు. షహానా ఏడాదిన్నర క్రితం కోజికోడ్‌లో సజాద్ ను వివాహం చేసుకుంది. సజాద్ ఖతార్ ఎయిర్‌లైన్స్‌లో పనిచేస్తున్నాడు.

 Kerala model Sahana was found dead on her birthday.

వివాహానంతరం షహానా మోడలింగ్ కెరీర్‌ను ప్రారంభించింది. తమిళ సినిమాల్లో నటించడంతో పాటు పలు యాడ్ ఫిల్మ్స్ కూడా ఆమె చేసింది. ఈ క్రమంలో షహానా డబ్బు సంపాదించడం మొ౦దలు పెట్టడంతో సజాద్ ఖతార్ ఎయిర్‌లైన్స్‌లో తిరిగి పని చేయడానికి వెళ్లనని అడ్డం తిరిగాడు.అంతేకాక షహానా సంపాదించే డబ్బును సజాద్ మంచి నీళ్ళలా ఖర్చు చేసేవాడు. ఇక ఈ విషయం గురించి ఏసీపీ సుదర్శన్‌ మాట్లాడుతూ.. 'షహానా తమిళ ప్రాజెక్టులో యాక్ట్ చేసినందుకు పారితోషికం ఇచ్చారు. దీనికోసం భార్య భర్తల మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోందని అన్నారు. అలాగే షహానా బర్త్‌డే రోజు కూడా సజాద్ ఆలస్యంగా రావడంతో తీవ్రస్థాయిలో గొడవపడ్డారని, ఆ తర్వాత బాత్రూమ్‌లో ఆమె శవమై కనిపించింది. ఇది హత్యా? ఆత్మహత్యా? అన్నది విచారిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ విషయం మీద షహానా తల్లి మాట్లాడుతూ ఆమె ఆత్మహత్య చేసుకోలేదు, ఆమెను చంపేశారని ఆరోపించింది.

అత్తారింట్లో తనను టార్చర్‌ పెడుతున్నారని నా కూతురు ఎప్పుడూ నాకు చెప్పుకుని ఏడ్చేదని ఆమె పేర్కొంది. భర్త సజాద్ తాగొచ్చి నానా గొడవ చేసేవాడని, సజాద్ డబ్బు కోసం ఇబ్బంది పెడుతున్నాడని, దారుణంగా ప్రవర్తిస్తున్నాడని షహానా నా దగ్గర చెప్పుకుని బాధ పదేదని పేర్కొంది. అంతేకాక ఆమె దగ్గర ఉన్న 25 సవర్ల బంగారాన్ని కూడా వాడుకున్నారని ఆమె ఆరోపించింది. షహానా బర్త్‌డే రోజు మమ్మల్ని కలవాలనుకున్నా దానికి సజాద్ ఒప్పుకోలేదని, ఇప్పుడు ఈ ఘోరం జరిగిపోయిందని ఆమె పేర్కొంది. సజాద్ తనను చిత్రహింసలకు గురి చేశాడంటూ షహానా కొద్దిరోజుల క్రితం ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించింది. కానీ సజాద్ స్నేహితుడు షహానాను ఒప్పించాడు. దీంతో షహానా పోలీసులకు ఫిర్యాదు చేయలేదు, ఆమె ఇంటికి తిరిగి వచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X