The Kerala Story 2: ది కేరళ స్టోరి 2 రిలీజ్‌ వాయిదా.. కేరళ హైకోర్టు షాక్.. సెన్సార్‌కు అక్షింతలు

అత్యంత వివాదాస్పద అంశాల మధ్య ది కేరళ స్టోరి 2 సినిమా విడుదలకు సిద్దమైంది. కేరళ ప్రభుత్వ అభ్యంతరాలు, కోర్టు కేసులు, వాదనల మధ్య ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయింది. అయితే ఈ సినిమాను ప్రముఖ నిర్మాత విపుల్ అమృత్ షా తన సన్‌షైన్ బ్యానర్‌పై నిర్మించారు. కేరళ, ఇతర ప్రాంతాల్లో జరిగిన వాస్తవ సంఘటనలు, హిందూ అమ్మాయిలను బలవంతంగా మతమార్పడి చేసి సిరియాకు తరలించే కుట్రల నేపథ్యంగా రూపొందిన ఈ చిత్రానికి కామాఖ్య నారాయణ్ సింగ్ దర్శకత్వం వహించారు.

ఈ సినిమాకు ఆషిన్ ఏ షా, రవిచంద్ నల్లప్ప సహ నిర్మాతలుగా వ్యవహరించారు. వాస్తవ సంఘటనల ఆధారంగా అత్యంత వివాదాస్పద చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రంలో ఉల్కా గుప్తా, అదితి భాటియా, ఐశ్వరయ ఓజా కీలక పాత్రలు పోషించారు. విపుల్ అమృత్‌లాల్ షా కథ అందించిన ఈ చిత్రానికి మన్నన్ షా మ్యూజిక్ అందించారు. ఎడిటర్‌గా సంజయ్ శర్మ, అభిజిత్ చౌదరీ సినిమాటోగ్రఫి, సౌండ్ డిజైనర్‌గా మానస్ చౌదరీ, ప్రొడక్షన్ డిజైనర్‌గా జుహీ తల్మాకీ వ్యవహరించారు. ఫిబ్రవరి 27వ తేదీన రిలీజ్ కానున్నది. అయితే ఈ సినిమా విడుదలను నిలిపివేస్తూ కేరళ హైకోర్టు ఆదేశాలు జారీ చేస్తూ స్టే విధించింది. ఈ సినిమా వెనుక వివాదం ఏమిటి? రిలీజ్‌పై స్టే ఎందుకు విధించారనే వివరాల్లోకి వెళితే..

Kerala Story 2 gets Two week interim Stay on Release by Kerala High Court

ది కేరళ స్టోరి 2 సినిమా టీజర్ రిలీజ్ తర్వాత భారీ ఎత్తున్న ప్రతికూల, సానుకూల చర్చకు దారి తీసింది. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించామని చిత్ర యూనిట్ వెల్లడించింది. అయితే ఈ చిత్రంలో ఓ హిందూ అమ్మాయిని ముస్లిం మతంలోకి మార్పిడి చేసి ఆ తర్వాత ఆమెతో బలవంతంగా గొడ్డు మాంసం తినిపించే ప్రయత్నం జరుగుతుంది. ఆమె అందుకు ఒప్పుకోకపోవడంతో బలవంతంగా బీఫ్‌ను నోట్లోకి కుక్కే సీన్ అత్యంత వివాదాస్పదమైంది.

టీజర్ రిలీజ్ తర్వాత కేరళ రాష్ట్ర ప్రభుత్వం, సీఎం ఈ మూవీపై ఘాటుగా స్పందించారు. కేరళలో ఇప్పటి వరకు మత ఘర్షణలు లేవు. ప్రజల మధ్య మతపరమైన విద్వేషాలు లేవు. వాటిని రెచ్చగొట్టే విధంగా సినిమా రావడం దారుణం. ఇలాంటి సినిమాలు భగవత్ ప్రసాదమైన కేరళలో అశాంతి చిచ్చు పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఈ సినిమా విడుదల కాకుండా ఆపివేయాలని నిర్ణయం తీసుకొన్నది. ఈ మేరకు కొన్ని వర్గాలు కేళ హైకోర్టును ఆశ్రయించింది. అయితే పిటిషన్‌దారు అభ్యర్థనను పరిశీలించిన తర్వాత 15 రోజులపాటు ఈ సినిమా విడుదల కాకుండా స్టే విధించింది.

ది కేరళ స్టోరీ 2 సినిమా మత సామరస్యాన్ని దెబ్బ తీస్తుంది. రాష్ట్రంలో అశాంతి చెలరేగే ప్రమాదం ఉంది. ఈ సినిమాకు సర్టిఫికెట్ ఇవ్వడంలో సెన్సార్ బుర్ర పెట్టలేదు అని పిటిషన్‌పై వాదనల సమయంలో కేరళ హైకోర్టు అభిప్రాయపడింది. ఈ సినిమా విడుదలపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో కేరళలో ఈ సినిమా విడుదల రెండు వారాలపాటు నిలిపివేయబడింది. దాంతో ఈ సినిమా నిర్మాత, దర్శకులకు భారీ దెబ్బ పడింది. దేశవ్యాప్తంగా ఈ సినిమా ఫిబ్రవరి 27వ తేదీన రిలీజ్ కానున్నది. అయితే కేరళ హై కోర్టు తీర్పును సవాల్ చేస్తూ నిర్మాత విపుల్ షా సుప్రీం కోర్టును ఆశ్రయించేందుకు సిద్దమయ్యారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X