Don't Miss!
- News ఏపీలో 45 డిగ్రీలను దాటిన టెంపరేచర్: గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది ఇక్కడే
- Sports చరిత్ర సృష్టించిన స్టొయినిస్.. సెహ్వాగ్ రికార్డు బ్రేక్!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
షకీలా బయోపిక్.. స్టార్ హీరోల గుట్టు విప్పుతున్నారని ఆ సినిమాను ఆగిపోయేలా చేశారా?
టాలీవుడ్ ఇండస్ట్రీలో బోల్డ్ రోల్స్ అంటే ఈ రోజుల్లో కామన్ అయిపోయింది. పాత్రను బట్టి కొందరు గ్లామర్ డోస్ పెంచుతుంటే.. అవకాశాలు మరిన్ని రావాలని మరికొందరు అలాంటి రోల్స్ చేయడానికి ఇష్టపడుతున్నారు. కానీ ఒకానొక సమయంలో బోల్డ్ క్యారెక్టర్లకు పెట్టింది పేరుగా గుర్తింపు తెచ్చుకున్న వారిలో షకీలా ఒకరు. ఆమె చేసిన బీ గ్రేడ్ సినిమాలు అప్పట్లో ఒక సెన్సేషన్.. అయితే ఇటీవల ఆమె బయోపిక్ మధ్యలో కావాలని ఆగిపోయేలా చేశారని టాక్ వస్తోంది.
Recommended Video
మలయాళం ఇండస్ట్రీలో..
షకీలా అంటే తెలియని కుర్రాళ్ళు ఉండరు. 20 ఏళ్ల క్రితం ఆమె ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అత్యంత బిజీగా ఉన్న యాక్టర్స్ లో ఒకరు. బి గ్రేడ్ సినిమాలతో మలయాళం ఇండస్ట్రీని షేక్ చేసిన షకీలా ఒకప్పటి స్టార్ హీరోలను కూడా బయపెట్టింది. ఒక ఏడాదిలోనే 20కి పైగా సినిమాలు చేసి బిజీ ఆర్టిస్ట్ గా క్రేజ్ అందుకుంది.
షకీలా బయోపిక్
షకీలా జీవిత ఆధారంగా బాలీవుడ్ లో ఒక సినిమా తెరకెక్కనున్నట్లు గత రెండేళ్లుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. రిచా చద్దా షకీలా పాత్రలో కనిపించనున్నట్లు పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. దర్శకుడు ఇంద్రజిత్ లంకేశ్ సినిమాకు సంబంధించిన ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేసుకొని సినిమాను స్టార్ట్ చేశాడు. గత ఏడాది ఎండింగ్ వరకు సినిమాకు సంబంధించిన అప్డేట్స్ చాలానే వచ్చాయి.
కావాలనే అలా చేశారా?
ఇకపోతే షకీలా బయోపిక్ లో సౌత్ ఇండియన్ స్టార్ హీరోల బాగోతాలు, రాసలీలలు చాలానే చూపించనున్నారు అనే టాక్ వచ్చింది. ఒక ఇంటర్వ్యూలో షకీలా కూడా బయోపిక్ లో అసలు విషయాలు బయటపడనున్నాయి అని వివరణ ఇవ్వడం అప్పట్లో అందరిని షాక్ కి గురి చేసింది. అయితే ఇప్పుడు ఆ బయోపిక్ ఆగిపోయేలా కొంత మంది సీనియర్ హీరోలు ప్రయత్నం చేశారు అనే టాక్ వస్తోంది.
భయపెట్టిన షకీలా..
ఒకప్పుడు షకీలా సినిమా వస్తోంది అంటే మలయాళంలో స్టార్ హీరోలు సైతం వారి సినిమాల రిలీజ్ డేట్స్ ని వాయిదా వేసుకునేవారు. ఆ స్థాయిలో షకీలా ఒకప్పుడు వణుకు పుట్టించింది. ఇక ఇప్పుడు బయోపిక్ ద్వారా మరోసారి ఆమె హాట్ టాపిక్ గా నిలవడంతో కొందరిలో అలజడి నెలకొన్నట్లు తెలుస్తోంది. అందుకే తెరవెనుక రాజకీయాలు నడిపి సినిమా షూటింగ్ ఎండ్ అవ్వకముందే ఎవరికి అనుమానం రాకుండా సైలెంట్ గా ఎండ్ కార్డ్ పెట్టినట్లు తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.