ఏనుగు దంతాల కేసులో మోహన్ లాల్.. కోర్టు దెబ్బకు మరోసారి చిక్కుల్లో స్టార్ హీరో!

మలయాళం ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటుడు మోహన్ లాల్ మరోసారి ఏనుగు దంతాల కేసు విషయంలో చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నాడు. గతంలో మోహన్ లాల్ రెండు జతల ఏనుగు దంతాలను తన ఇంట్లో పెట్టుకోవడంతో వన్యప్రాణుల రక్షణ చట్టం నిబంధనల ప్రకారం నేరం చేసినట్లే అని ఆరోపిస్తూ (ఎఫ్‌ఐఆర్) నమోదు చేశారు. అయితే ఈ కేసు విషయంలో మోహన్ లాల్ ఇదివరకే ఒక వివరణ కూడా ఇచ్చాడు.

చట్టప్రకారం అన్ని రకాల అనుమతులను తీసుకుని ఏనుగు దంతాలను ఇంట్లో పెట్టుకున్నట్లుగా మోహన్ లాల్ వివరణ ఇచ్చారు. అయితే ఈ కేసు విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కూడా మరోసారి పూర్తిస్థాయిలో విచారణ జరపాలని కేరళ హైకోర్టు మెజిస్ట్రేట్ ను కోరింది. విచారణలను ఉపసంహరించుకోవాలి అని మెజిస్ట్రేట్ కోర్టుపై మోహన్‌లాల్ చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.

Latest update on malayalam actor Mohanlal Ivory tusks possession case

పెరుంబవూరు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ మోహన్‌లాల్ చేసిన పిటిషన్‌ను కేరళ హైకోర్టు బుధవారం కొట్టివేసింది. దశాబ్దం నాటి అక్రమ దంతాల స్వాధీనం కేసులో మరోసారి మోహన్ లాల్ చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ మేరకు సింగిల్ జడ్జి జస్టిస్ ఏ బదరుద్దీన్ ఉత్తర్వులు జారీ చేస్తూ పూర్తి స్థాయిలో మరోసారి విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు.

మొదటి నుంచి కూడా మోహన్ లాల్ ఏనుగు దంతాలు చట్టబద్ధంగానే తీసుకున్నట్లు చెబుతున్నారు. 2015లో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కేరళ ప్రభుత్వం తనకు ఓనర్‌షిప్‌ సర్టిఫికేట్‌ను కూడా జారీ చేసిందని మోహన్‌లాల్ వాదించారు. మొదట మోహన్ లాల్ పై పెట్టిన కేసును ఉపసంహరించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ జారీ చేసింది. అయితే గత ఎడాది జూన్ లోనే
కేసును ఉపసంహరించుకోవడానికి రాష్ట్రం చేసిన దరఖాస్తును మేజిస్ట్రేట్ కోర్టు తోసిపుచ్చింది. మరి ఈ కేసులో మరోసారి మోహన్ లాల్ ఏ విధంగా సమాధానం ఇస్తారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X