లాక్ డౌన్ లో కుస్తీలు... సిక్స్ ప్యాక్స్ తో హీరో రెడీ
క్వారెంటైన్ రోజులు మహా కష్టంగా గుడుస్తున్నాయని వాపోయేవారు అందులో నుంచి బయటపడటం గురించి ఇంకా ఆలోచిస్తూనే ఉన్నారు. కానీ, కొంతమంది మాత్రం ఈ సమయాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటున్నారు. అలాంటి వారిలో మళయాళీ హీరో పృధ్విరాజ్ కూడా చేరిపోయాడు.
ప్రపంచవ్యాప్తంగా లాక్ డౌన్ కారణంగా, షూటింగ్ నిమిత్తం జోర్డన్ వెళ్లి డైరెక్టర్ బ్లెస్సీ, ఇతర యూనిట్ సహా అక్కడ చిక్కుకుపోయిన పృధ్విరాజ్, అతి కష్టం మీద కొన్ని రోజుల క్రితమే భారత్ కు తిరిగి వచ్చారు. ఇక తిరిగి వచ్చిన తరువాత లాక్ డౌన్ ని నిరుపయోగంగా విడిచిపెట్టకుండా, శరీర ధారుఢ్యంపై దృష్టిపెట్టాడు. ఇక ట్రైనర్ ఆధ్వర్యంలో కసరత్తులు ప్రారంభించిన పృధ్విరాజ్ ఎట్టకేలకు పలకలు తేలిన దేహాన్ని సంపాదించేశాడు. అంతేకాదు, తన వర్కౌట్ వెనుకున్న అసలు కారణాన్ని ఇన్స్టా లో షేర్ చేసుకున్నాడు.

జోర్డన్ లో ఆడుజీవితం సినిమా షూటింగ్ ఆఖరి రోజున తన శరీరంలో కొవ్వుశాతం ప్రమాదకర స్థాయికి చేరుకుందని వివరించిన పృధ్విరాజ్, అనంతరం నెల రోజులు సరైన పోషకాలు తీసుకుంటూ, సరైన సమయంలో విశ్రాంతి తీసుకుంటూ జిమ్ లో కసరత్తులు చేయగా ఈ దేహం లభించిందని వెల్లడించాడు. ఇన్స్టాలో ఫొటోలు పోస్ట్ చేయగా, కొద్ది నిమిషాల్లోనే అది వైరల్ అయిపోయింది. మరి ఈ మళయాళీ సూపర్ స్టార్ ను ఎంతమంది ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారో చూడాలి.


Click it and Unblock the Notifications











