twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిక్కుల్లో పడిన హీరో విజయ్.. లుకౌట్ నోటీసులు జారీ?

    |

    సినీ పరిశ్రమలో లైంగిక వేధింపుల వ్యవహారాలు అడపాదడపా వెలుగులోకి వస్తూనే ఉంటాయి. అయితే తాజాగా మలయాళ సినీ పరిశ్రమలో జరిగిన ఒక వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఒక నిర్మాత, కం హీరో తనను లైంగికంగా వాడుకున్నాడు అంటూ ఒక యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లు చెబుతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే

    దుబాయ్‌లో ఉన్నట్టు

    దుబాయ్‌లో ఉన్నట్టు


    మలయాళ చిత్ర నిర్మాత, హీరో విజయ్ బాబు (45)పై కొచ్చిలో అత్యాచారం కేసు నమోదైన ఒక రోజు తర్వాత కేరళ పోలీసులు గురువారం లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రాథమిక విచారణలో లైంగిక వేధింపులు జరిగినట్లు నిర్ధారించామని, దర్యాప్తు అధికారులు క్రైమ్ సీన్ సాక్ష్యాలను సేకరించారని కొచ్చి పోలీస్ కమిషనర్ నాగరాజు చకిలం తెలిపారు. ఫిర్యాదు చేసిన నటికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఇక విజయ్ బాబు ఒక అసైన్‌మెంట్ కోసం దుబాయ్‌లో ఉన్నట్టు సోషల్ మీడియాలో ఓ మెసేజ్ పెట్టారు.

    లుకౌట్ నోటీసులు జారీ

    లుకౌట్ నోటీసులు జారీ

    ఆ తర్వాత ఆయన ఆ మెసేజ్ ను డిలీట్ చేశారు. ఇక కొచ్చి పోలీస్ కమిషనర్ నాగరాజు చకిలం మాట్లాడుతూ "మేము లుకౌట్ నోటీసులు జారీ చేసాము, ఈ కేసులో ఇంకా విచారణ కొనసాగుతోంది. మేము క్రైమ్ సీన్ సాక్ష్యాల సేకరణను పూర్తి చేసాము మరియు కొంతమంది సాక్షుల వాంగ్మూలాలను సేకరించాము, "అని అన్నారు. విజయ్ బాబు దేశం విడిచి పారిపోయి ఉంటే అతడిని అప్పగించాలని కోరతామని ఆయన అన్నారు.

    పోలీసులకు ఫిర్యాదు

    పోలీసులకు ఫిర్యాదు

    సినిమాల్లో పాత్రలు ఇప్పిస్తానని హామీ ఇచ్చి ఆ తర్వాత విజయ్ బాబు తనపై చాలాసార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ ఒక నటి ఏప్రిల్ 22న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫేస్‌బుక్ పోస్ట్‌లో విజయ్ బాబు ఆరోపణలను ఖండించారు. తర్వాత తొలగించబడిన తన ఫేస్‌బుక్ పోస్ట్‌లో, ఫిర్యాదు చేసిన యువతి తనకు 2018 నుండి తెలుసునని ఆమె తన సినిమాలో నటించడానికి అవకాశం ఇచ్చానని విజయ్ బాబు చెప్పారు. ఆ తరువాత ఏడాది కాలంగా వారు టచ్‌లో లేరని ఆయన తెలిపారు. ఫేస్ బుక్ లైవ్ లో కూడా బాబు మహిళ పేరును పలుమార్లు ప్రస్తావించాడు.

    కొత్త ‘మీటూ'కి నాంది

    కొత్త ‘మీటూ'కి నాంది

    "తాను డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు ఆమె నాకు చాలా సందేశాలు పంపింది. ఆ సందేశాలకు సంబంధించిన దాదాపు 400 స్క్రీన్‌షాట్‌లు నా వద్ద ఉన్నాయి. గత ఏడాదిన్నరగా నేను ఆ మహిళకు ఎలాంటి మెసేజ్‌లు పంపలేదు,'' అని అన్నారు. తన ప్రతిష్టను దిగజార్చిన ఆమె మీద ఫిర్యాదు చేస్తామని బాబు చెప్పారు. "ఫిర్యాదు చేసిన వ్యక్తిపై నేను పరువు నష్టం కేసు వేస్తా. కొత్త 'మీటూ'కి నాంది పలకండి. కొత్త పోరాటాన్ని ప్రారంభిద్దాం,'' అని అన్నారు.

    ఈ సెక్షన్ల కింద కేసులు

    ఈ సెక్షన్ల కింద కేసులు

    ఇక మరోపక్క బాబుపై భారత శిక్షాస్మృతిలోని సెక్షన్లు 376 (లైంగిక వేధింపులు), 323 (బాధ కలిగించడం), 506 (నేరపూరిత బెదిరింపు), మరియు 228A (లైంగిక వేధింపుల బాధితురాలి పేరు, గుర్తింపును వెల్లడించడం) కింద కేసు నమోదు చేశారు.

    Read more about: vijay babu
    English summary
    Lookout notice issued against rape accused Malayalam film actor Vijay Babu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X