యువ సినీ ఆర్టిస్టుకు లైంగిక వేధింపులు, ప్రముఖ నటి కుమారుడు అసభ్యంగా.. ఫేస్‌బుక్‌ లైవ్‌లోనే

లైంగిక వేధింపుల అంశం మలయాళ సినిమా పరిశ్రమలో మరోసారి ప్రకంపనాలు సృష్టించాయి. మాలీవుడ్‌లో టాప్ మేకప్ ఆర్టిస్టు, ట్రాన్స్‌జెండర్ సీమ వినీత్‌కు ప్రముఖ నటి కుమారుడి నుంచి చేదు అనుభవం ఎదురైంది. తనను వేధిస్తూ ఇబ్బందులకు గురిచేయడంపై ఆమె ఫిర్యాదు చేయడంతో ఈ అంశం మీడియాలో వెలుగు చూసింది. గత కొద్దికాలంగా తనకు అసభ్య సందేశాలు, అశ్లీల ఫోటోలు పంపుతూ తనను వేధించారని వెల్లడించడం సంచలనంగా మారింది. ఈ వివాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

న్యూడ్ ఫోటోలు పంపుతూ

న్యూడ్ ఫోటోలు పంపుతూ

మలయాళ నటి మాల పార్వతీ కుమారుడు అనంతకృష్ణన్ తనను 2017 నుంచి వేధిస్తున్నాడు. అసభ్యకరమైన మెసేజ్‌లు, న్యూడ్ పిక్చర్స్ పంపుతూ నన్ను విసిగించారు. పలుమార్లు నేను అలా చేయవద్దని వారించాను. అయినా మొండిగా తన ప్రవర్తనను మానుకోలేదు. ఇక పరిస్థితి చేజారి పోతున్నదని గ్రహించి తాను ఈ విషయాన్ని బయటపెట్టాల్సి వచ్చింది అంటూ సీమ ఫేస్‌బుక్‌ లైవ్‌లో సంచలన విషయాలు చెప్పింది.

నటి మాల పార్వతీ అండగా

నటి మాల పార్వతీ అండగా

తనతో అనంతకృష్ణన్ ప్రవర్తిస్తున్న తీరును ఆయన తల్లి, నటి మాల పార్వతి దృష్టికి తీసుకెళ్లాను. తనకు వస్తున్న మేసేజ్‌లను ఆమె పంపితే తన చాలా బాధపడ్డారు. ఆ తర్వాత నాకు కాల్ చేసి తన కుమారుడి తరఫున క్షమాపణలు చెప్పారు. తన కుమారుడిని హద్దు మీరకుండా చూసుకొంటానని చెప్పారు. ఈ విషయంలో నేను లీగల్‌గా యాక్షన్ తీసుకోవాలనుకొంటే తనకు అండగా ఉంటానని మాల పార్వతి చెప్పారు అని సీమ లైవ్‌లో వెల్లడించారు.

ఫేస్‌బుక్ లైవ్‌లోనే

ఫేస్‌బుక్ లైవ్‌లోనే

తన కుమారుడు అనంత కృష్ణన్ చేసిన పనికి మహిళగా మాల పార్వతి చాలా బాధపడ్డారు. మహిళగా నాకు జరిగితే పరిస్థితి ఏమిటో నేను ఊహించుకోగలనని చెప్పారు. వేధింపుల వ్యవహారంలో ఆమె ఫేస్‌బుక్ ద్వారా నాకు బహిరంగంగా క్షమాపణలు చెప్పడం సాటి మహిళగా తనను ఎంతో ఆకట్టుకొన్నది. ఈ వ్యవహారంపై తాను పోలీసులకు, సైబర్ క్రైమ్ వారికి ఫిర్యాదు చేస్తానని సీమా చెప్పారు.

నటి మాల పార్వతి స్పందన

నటి మాల పార్వతి స్పందన

సీమ వినిత్‌కు ఎదురైన వేధింపుల విషయం తన దృష్టికి రావడంతో కుమారుడికి ఫోన్ చేసి మాల పార్వతి అసలు విషయం రాబట్టే ప్రయత్నం చేశారు. అయితే తమ ఇద్దరి మధ్య అవగాహనతోనే ఇదంతా జరిగిందని తన కుమారుడు చెప్పారనే విషయాన్ని మాల వెల్లడించారు. కానీ ఈ విషయంలో వాస్తవాలు బయట పెట్టాలని పోలీసులకు స్వయంగా తల్లి మాల పార్వతి ఫిర్యాదు చేయడం గమనార్హం.

Recommended Video

Samantha Akkineni Talks About Naga Chaitanya
 ఎవరైనా సరే.. నిగ్గు తేలాల్సిందే అంటూ

ఎవరైనా సరే.. నిగ్గు తేలాల్సిందే అంటూ

నటి మాల పార్వతి ఈ వివాదంపై స్పందిస్తూ.. తన కుమారుడి విషయంలో తప్పుందా? ఒప్పుందా అనే విషయాన్ని పక్కన పెడితే.. ప్రస్తుతం నేను సీమా వినీత్‌కు అండగా ఉండాలని నిర్ణయించుకొన్నాను. ఇద్దరి ఇష్టప్రకారమే జరిగిందని చెప్పినప్పటికీ, నా కుమారుడికి సపోర్ట్ చేయను. లీగల్‌గా ఈ వ్యవహారంలో వాస్తవాలు బయటపడేంత వరకు నేను నిజాయితీగా వ్యవహరించాలని అనుకొంటున్నాను అని పార్వతి చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X