స్వలింగ సంపర్కుడి పాత్రలో స్టార్ హీరో.. సినిమాను బ్యాన్ చేసిన రెండు దేశాలు!
స్వలింగ సంపర్కం.. ఈ పేరు వింటేనే చాలా మంది వింతగా చూస్తుంటారు. అందులోనూ ఈ పాత్రల్లో సినిమాలు వస్తుంటాయంటే కూడా కాస్త వెరైటీగా భావిస్తారు. అయితే గతంలో ఇలాంటి పాత్రల్లో కొన్ని సినిమాలు వచ్చాయి. ముఖ్యంగా పృథ్విరాజ్ సుకుమారన్ ముంబై పోలీస్ చిత్రంలో ఇలాంటి క్యారెక్టర్ లోనే కనిపించారు. ఈ సినిమా హిట్టు కావడంతో.. మహేష్ బాబు బావ సుధీర్ బాబు ఈ సినిమాను హంట్ గా రీమేక్ చేశారు. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మాత్రం ఫ్లాప్ గా మారింది. ఇదంతా పక్కన పెడితే హోమోసెక్సువల్స్ గా కనిపించేందుకు చాలా మంది హీరోలు ఇష్టపడరు.
చిన్న చిన్న హీరోలు.. తమ చిత్రాలను ఎలాగైనా సరే హిట్టు చేసుకోవాలనుకునే కొంత మంది ధైర్యవంతులు మాత్రమే ఇలాంటి చిత్రాల్లో కనిపిస్తారు. కానీ ఇలాంటి పాత్రల్లో స్టార్ హీరోలను చూడడం కాస్త కష్టమే. అభిమానులు వాటిని జీర్ణించుకోలేరు. అంతేకాకుండా పెద్ద హీరోలు కూడా ఇలాంటి పాత్రల్లో చేసేందుకు ధైర్యం చూపించరు. కానీ మలయాళ సూపర్ మమ్ముట్టి మాత్రం ఇలాంటి పాత్రలో చేసేందుకు ఓకే చెప్పారు. ఓకే చెప్పడం ఏంటి సినిమాకు కూడా తీశారు. దాని పేరే కాథల్ ది కోర్. అయితే ఈ చిత్రంలో హీరో సూర్య భార్య, స్టార్ హీరోయిన్ జ్యోతికి హీరోయిన్ గా నటించారు.

ఎంతో కష్టపడి అందరినీ ఆశ్చర్య పరిచే పాత్రలో మమ్ముట్టి దర్శనం ఇవ్వబోతున్న ఈ సినిమాను రెండు దేశాలు బ్యాన్ చేశాయి. ముఖ్యంగా కువైట్, కత్తర్ లు తమ దేశంలో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు నో చెప్పాయి. అయితే ఆ దేశాలు ఎందుకు అలా చేశాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. కాథల్ ది కోర్ సినిమాలో హీరో మమ్ముట్టి... జోసెఫ్ పాత్రలో నటించారు. అయితే తీకోయ్ అనే ఓ గ్రామంలో కోపరేటివ్ బ్యాంక్ లో పని చేసే ఓ ఉద్యోగిగా కనిపిస్తారు. రిటైర్ అయ్యాక ఎన్నికల్లో నిలబడాలనుకుంటాడు. అంతాప్లాన్ ప్రకారమే వెళ్తాడు.
కానీ ఎన్నికల సమయంలో ఆయన భార్య జ్యోతిక... తన భర్త స్వలింగ సంపర్కుడు అంటూ కోర్టులో విడాకులు తీసుకునేందుకు దరఖాస్తు చేసుకుంటుంది. అలాగే అతడు తన స్నేహితుడితో శారీరక సంబంధం కూడా పెట్టుకున్నాడని.. చాలా రోజులుగా ఇది సాగుతుందని వివరిస్తుంది. కానీ ఇన్నాళ్లూ అది భరించానని ఇక భరించే ఓపిక లేదంటూ కోర్టులో జ్యోతిక చెప్పుకొస్తుంది. ఎన్నికల సమయం వరకూ చప్పుడు చేయకుండా ఉండి.. అప్పుడే ఈ విషయాన్ని తెరపైకి తీసుకురావడం ఈ సినిమాలోని ట్విస్ట్.

ఈ సినిమా మొత్తం హోమోసెక్సువల్స్ ను ఈ సమాజం ఎలా చూస్తుందో వివరించే ప్రయత్నం చేశారు డైరెక్టర్. కాథల్ ది కోర్ చిత్రం స్వలింగ సంపర్కాన్ని ప్రోత్సహించేలా ఉండడంతో కువైట్ తో పాటు కత్తర్ దేశాలు ఈ చిత్రాన్ని బ్యాన్ చేశాయి. మరికొన్ని దేశాలు కూడా ఈ చిత్రాన్ని బ్యాన్ చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











