సినిమా ఇండస్ట్రీలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నటుడు మృతి..

రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నటుడు కన్నుమూశాడు. మళయాళ సినీ ఇండస్ట్రీకి చెందిన నటుడు, మిమిక్రీ ఆర్టిస్ట్ కొల్లం సుధీ(39) రోడ్డు ప్రమాదంల ప్రాణాలు కోల్పోయాడు. కేరళలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఆయన చనిపోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారు కూడా మిమిక్రీ ఆర్టిస్టులు అని సమాచారం.

క్షతగాత్రులు బిను ఆదిమాలి, ఉల్లాస్, మహేష్ లను చికిత్స నిమిత్తం స్థానికి ఆస్పత్రికి తరలించారు. వారు అక్కడ చికిత్స పొందుతున్నారు. వీరంతా కలిసి కారులో ప్రయాణిస్తుండగా, ఈ ప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో వీరు ప్రయాణిస్తున్న కారును ఓకంటైనర్ ఢీ కొట్టింది. కాగా, సుధీ తలకు తీవ్ర గాయం అయ్యింది. అప్పటికే స్థానికులు గమనించి ఆస్పత్రికి తరలించినప్పటికీ, ఆయన చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. మిగిలిన ముగ్గురు గాయాలతో బయటపడ్డారు.

Malayalam actor and mimicry artist Kollam Sudhi dies in car accident

కొల్లం సుధీ మృతి మళయాళ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నింపింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సినీ నటులు పేర్కొంటున్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సైతం ఆయన మృతి పట్ల సంతానం తెలియజేశారు.

ఇక కొల్లం సుధీ సినీ కెరీర్ విషయానికి వస్తే, ఆయనకు ఇండస్ట్రీలో చాలా మంచి పేరు ఉంది. 2015లో అజ్మల్ దర్శకత్వం వహించిన కంఠారి చిత్రం తో ఆయన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఆ సినిమాలో ఆయన నటన అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత వరసగా చాలా చిత్రాల్లో అవకాశాలు చేజిక్కించుకున్నారు.

ఆయన చాలా సినిమాలు చేసినప్పటికీ, మిమిక్రీ ఆర్టిస్ట్ గా జనాలకు తొందరగా చేరువయ్యారు. ఆయన మిమిక్రీ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. పలు కామెడీ షోలతో కూడా ఆయన ఆకట్టుకున్నారు. స్టార్ మ్యాజిక్ షోలో పాల్గొని ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆయన మృతి తో ఆయన కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అభిమానులు సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సోషల్ మీడియాలోనూ కామెంట్స్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X