నాపై మానభంగం.. 3 రోజులు అలా నరకం.. ఆ హింసను భరించలేక.. డైరెక్టర్‌పై యువ నటి ఆరోపణలు

మలయాళ నటుడు, డైరెక్టర్ బాలా ఆయన మాజీ ప్రేయసి, మాజీ భార్య మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు మీడియాలో సంచలనం రేపుతున్నాయి. మాజీ ప్రేయసి, నటి డాక్టర్ ఎలిజబెత్ ఉదయన్ తనను రేప్ చేశాడని, మాజీ భార్య, సింగర్ అమృత సురేష్ ఫోర్జరీ ఆరోపణలు చేయడం సెన్సేషన్‌గా మారింది. గత రెండు రోజులుగా ఈ వివాదం మీడియాలో హైలెట్‌గా మారింది. ఈ క్రమంలో బాలాపై ఎలిజబెత్ తీవ్రమైన ఆరోపణలు చేయడం మరింత సంచలనం రేపింది. ఈ వివాదానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

హాస్పిటల్‌లో పేషెంట్‌గా పరిచయమైన బాలాకు తనకు రిలేషన్ ఏర్పడింది. ఆయన నా మెడలో మూడు మూళ్లు వేశాడు. ఆ సమయంలో చాలా మంది అతిథులు, కొందరు పోలీస్ ఆఫీసర్లు కూడా ఉన్నారు. మా ఇద్దరిని పెళ్లి చేసుకోవాలని బాలా తల్లి కూడా ఫోర్స్ చేసింది. అయితే జాతకంలో దోషం కారణంగా 41 సంవత్సరాలు నిండిన తర్వాతే తాను వివాహం చేసుకొంటానని మాటలతో మోసం చేశాడని ఎలిజబెత్ పేర్కొన్నది.

Malayalam Actor Bala got mental and Physical abuse allegation by Ex Partner Elizabeth Udayan

ఇటీవల బాలా ఇటీవల పెళ్లి చేసుకోని తన భార్య కోకిలతో కలిసి ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు. తమ రిలేషన్‌షిప్, మ్యారేజ్ గురించి వివరాలు వెల్లడించారు. అయితే ఈ సందర్భంగా పేషెంట్‌గా చేరిన బాలాను బుట్టలో వేసుకొని మాజీ ప్రేయసి ఎలిజబెత్ మోసం చేసిందని ఆయన వర్గీయులు కామెంట్ చేయడంతో ఈ వివాదానికి బీజం పడింది. తనపై ఆయన సన్నిహితులు చేసిన ఆరోపణలను తిప్పి కొట్టేందుకు ఆమె ప్రత్యారోపణలు చేయడంతో వివాదం మరింత రాజుకొన్నది.

బాలాపై ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టి.. అయితే మా ఇద్దరి మధ్య అభిప్రాయ బేధాలు రావడంతో గొడవ మొదలైంది. ఆ సమయంలో మా బెడ్ రూమ్ వీడియోను లీక్ చేస్తానని బాలా బెదిరించాడు. నన్ను శారీరకంగా వేధించాడు. నాపై మానభంగం చేశాడు. అతడు నన్నే కాకుండా మైనర్ బాలికలను కూడా చీట్ చేశాడు. నేను సంతానానికి పనికి రానని అన్నాడు. ఇంకా చాలా విషయాలు రాయడానికి నా చేతి వేళ్లు వణుకుతున్నాయి అని ఎలిజబెత్ తన పోస్టులో పేర్కొన్నది.

నా శారీరకంగా, మానసికంగా వేధించాడు. నన్ను గదిలో బంధించి మూడు రోజులు భోజనం పెట్టలేదు. నేను నల్లా నీళ్లు తాగి బతికాను. జైలులో ఖైదీలకు భోజనం, ఇతర సౌకర్యాలు కల్పిస్తారు. కానీ బాలా నాకు నరకం చూపించాడు. నా కుటుంబానికి ఆయన గుండాల వల్ల ప్రాణ హాని ఉంది అని ఎలిజబెత్ ఆరోపణలు చేసింది.

అయితే తాము హాస్పిటల్‌లో పరిచయమయ్యామని వెల్లడిస్తున్న విషయం అవాస్తవం. తాము మొదట ఫేస్ బుక్ ద్వారా పరిచయం అయ్యాం. ఒకరికొకరు చాటింగ్ చేసుకొనే వాళ్లం. నేను ఎండీ పరీక్షలకు హాజరు అవుతున్న సమయంలో కలిశాడు. నన్ను పరీక్షలకు కూడా హాజరు కానివ్వలేదు. ఆ తర్వాతే ఆయన పేషెంట్‌గా హాస్పిటల్‌కు వచ్చాడు అని ఎలిజబెత్ వెల్లడించింది.

More from Filmibeat

Read more about: bala mollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X