రోడ్డు ప్రమాదంలో యువ నటుడు బేసిల్ జార్జ్ మృతి.. మితి మీరిన వేగంతో కారు..

మలయాళ సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకొన్నది. యువ నటుడు బేసిల్ జార్జ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో మాలీవుడ్ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతిలో కూరుకుపోయారు. లాక్ డౌన్ కారణంగా తన సహచర నటుడి చివరి చూపు చూసుకోలేని పరిస్థితి ఏర్పడటంపై విచారం వ్యక్తం చేస్తున్నారు. బేసిల్ జార్జ్ మృతిపై పలువురు సంతాపం వ్యక్తం చేశారు. ఈ రోడ్డు ప్రమాదం ఎలా జరిగిందంటే.

 అదుపు తప్పిన కారు

అదుపు తప్పిన కారు

నటుడు బేసిల్ జార్డ్‌తోపాటు డ్రైవర్ మరో ముగ్గురు మొత్తం ఐదుగురు కొలెంచెర్రీ నుంచి మువత్తపుజా వైపు వెళ్తున్నారు. వేగం వెళ్తున్న కారుపై డ్రైవర్ అదుపు కోల్పోవడంతో ఎదురుగా ఉన్న షాప్, ఓ ఇంటిని ఢికొట్టింది. ఈ ఘటన మువట్టుపుజా వద్ద ఆదివారం రాత్రి చోటుచేసుకొన్నది. ఈ దుర్ఘటనలో బేసిల్ జార్జ్‌తోపాటు మరో ఇద్దరు మరణించారు అని సన్నిహితులు మీడియాకు వెల్లడించారు. ప్రమాదానికి గురైన వారికి ఫైర్, పోలీస్ సిబ్బంది కాపాడి వెంటనే హాస్పిటల్‌కు తరలించారు.

మార్గమధ్యంలోనే

మార్గమధ్యంలోనే

మువట్టుపుజా వద్ద జరిగిన కారు ప్రమాదం నుంచి వలస కార్మికులు తృటిలో తప్పించుకొన్నారు. కారు ఢికొట్టిన ఓ చిన్న ఇంటిలో వలస కార్మికులు ఆశ్రయం పొందుతున్నారు. ఆ ఇంటినే ఢీకొట్టడంతో కొందరికి స్వల్పంగా గాయమయ్యాయని, వారిని హాస్పిటల్‌కు తరలించి ప్రాథమిక చికిత్స జరిపించారని తెలిసింది. ఈ ఘటనలో బెసిల్, నిధిన్, అశ్విన్ జాయ్ ప్రమాదం జరిగిన వెంటనే మార్గ మధ్యంలో మరణించారు. వారిని హాస్పిటల్‌కు తరలించగా అప్పటికే మరణించారని వైద్యులు ధృవీకరించారు.

కారు పూర్తిగా ధ్వసం

కారు పూర్తిగా ధ్వసం

కారు ప్రమాదంలో ముగ్గురు వలస కార్మికులకు గాయాలయ్యాయి. వారిని కొలెంచెర్రీ మెడికల్ హాస్పిటల్‌లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసమైంది. కారులో ప్రయాణిస్తున్న మరో ఇద్దరి పరిస్థితి సీరియస్‌గా ఉంది అని హస్పిటల్ వర్గాలు తెలిపాయి. కాగా ప్రమాదంలో మరణించిన ముగ్గురికి సోమవారం అంత్యక్రియలు నిర్వహించినట్టు తెలిసింది.

Recommended Video

George Reddy Movie Success Celebration
 యువ నటుడి మృతితో

యువ నటుడి మృతితో

బేసిల్ జార్జ్ ఇప్పడిప్పుడే మలయాళ సినిమా పరిశ్రమలో గుర్తింపు పొందుతున్నారు. ఆయన నటించిన పూవల్లియమ్ కుంజడమ్ చిత్రం మంచి ప్రేక్షకదారణ పొందింది. బేసిల్‌కు తల్లిదండ్రులు, ఓ సోదరుడు ఉన్నారు. బేసిల్ జార్జ్ మృతికి పలువురు మలయాళ చిత్ర పరిశ్రమ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X