మలయాళ నటుడు కెప్టెన్ రాజు కన్నుమూత
ప్రముఖ మలయాళ నటుడు కెప్టెన్ రాజు (69) కన్ను మూశారు. మలయాళ, తమిళ సినిమాల్లో ప్రతి నాయకుడి పాత్రల్లో గుర్తింపు తెచ్చుకున్న రాజు కొచ్చిలోని తన నివాసంలో సోమవారం ఉదయం గుండె పోటుతో మరణించారు. కెరీర్లో రాజా దాదాపు 500 సినిమాల్లో నటించారు. అందులో మలయాళం, తమిళ సినిమాలతో పాటు తెలుగు, కన్నడ, హిందీ, ఇంగ్లిష్ చిత్రాలు కూడా ఉన్నాయి.
జులైలో తన కుమారుడి వివాహ వేడుకలో పాల్గొనందుకు యూఎస్ వెళుతుండగా విమానంలోనే ఆయన గుండెపోటు వచ్చింది. దీంతో వెంటనే విమానాన్ని మస్కట్ మళ్లించి అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం కేరళ తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. సోమవారం మరోసారి గుండెపోటు రావడంతో రాజు కన్నుమూశారు.

రాజు పేరు ముందు 'కెప్టెన్' అనే ట్యాగ్ ఉండటానికి కారణం గతంలో ఆయన ఆర్మీలో పని చేయడమే. 1981లో వచ్చిన 'రక్తం' చిత్రంతో తెరంగేట్రం చేయగా 2017లో వచ్చిన 'మాస్టర్‌పీస్' అనే చిత్రం ఆయన నటించిన చివరి మూవీ. తెలుగులో వెంకటేష్ హీరోగా వచ్చిన శత్రువు సినిమాలో రాజు విలన్‌గా నటించారు.
సినిమాలతో పాటు పలు టీవీ కార్యక్రమాల్లో కూడా కెప్టెన్ రాజు నటించారు. కేవలం నటించడం మాత్రం కాదు రెండు సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. ఐత ఓరు స్నేహగధ, మిస్టర్ పావనై 99.99 సినిమాలను డైరెక్ట్ చేశారు.


Click it and Unblock the Notifications











