టాలీవుడ్‌కు సరికొత్త విలన్.. మెగా హీరోను ఢీకొట్టే చెంగారెడ్డిగా జోజు జార్జ్.. ఫస్ట్ లుక్ అదుర్స్!
సినిమా పరిశ్రమ ప్రాంతీయ పరిధులను దాటి పాన్ ఇండియా స్థాయిని అందుకొన్న నేపథ్యంలో భాషా, ప్రాంతాల సరిహద్దులు చెరిగిపోయాయి. ఇక భాషా సినిమా రంగంలోని నటీనటులు, మరో భాషలో నటించడం పరిపాటి అయింది. హిందీ నటులు దక్షిణాదిలోకి, దక్షిణాదిలోని టాలెంటెడ్ యాక్టర్లు బాలీవుడ్‌లోకి వెళ్లడం సాధారణంగా మారింది. ఈ క్రమంలో మలయాళం నుంచి తెలుగు సినిమా పరిశ్రమకు ప్రతిభావంతుడైన మరో నటుడు పరిచయం కాబోతున్నారు. ఆ నటుడు, సినిమా వివరాల్లోకి వెళితే..
మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్త నిర్మాణంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం నిర్మాణ కార్యక్రమాలు ముగింపు దశకు చేరుకున్నాయి. వైష్ణవ్ తేజ్ కెరీర్‌లో నాలుగో సినిమాగా రూపొందుతున్నది. ఈ చిత్రం ద్వారా శ్రీకాంత్.ఎన్.రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని నిర్మాతలు ఎస్. నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ చిత్ర సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం నుంచి విలన్ పాత్రను పరిచయం చేస్తూ తాజాగా చిత్ర యూనిట్ ఓ కొత్త పోస్టర్ ను విడుదల చేశారు.
ప్రముఖ మలయాళ నటుడు జోజు జార్జ్ ఇంకా పేరు పెట్టని చిత్రంలో చెంగారెడ్డి అనే పవర్‌పుల్ రోల్‌లో నటిస్తున్నారు. ఇరాట్ట, జోసెఫ్, నయత్తు, తురముఖం, మధురం లాంటి ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జోజు జార్జ్ సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమవుతున్నారు.

జోజ్ జార్జ్ పోషిస్తున్న చెంగా రెడ్డి పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ బుధవారం సాయంత్రం విడుదల చేశారు. ఒక చేత్తో పదునైన ఆయుధాన్ని పట్టుకొని, మరో చేత్తో లైటర్‌తో నోట్లోని సిగరెట్ ను వెలిగిస్తూ కళ్ళతోనే క్రూరత్వాన్ని పలికించారు. నెరిసిన గెడ్డం, జుట్టుతో ఉన్న జోజు జార్జ్ పాత్ర తాలూకు పోస్టర్ పవర్ ఫుల్‌గా ఆకట్టుకునేలా ఉంది. అలాగే జోజు జార్జ్ నటించిన ఇరాట్ట సినిమా ఇటీవల విడుదలై మంచి ఆదరణ పొందటంతో చిత్ర బృందం ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు పోస్టర్ లో పేర్కొన్నారు.
వైష్ణవ్ తేజ్ సరికొత్త మాస్ అవతారంతో పూర్తిస్థాయి మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఈ చిత్రం రూపుదిద్దుకొంటున్నది. దర్శక,నిర్మాతలు. చిత్రం టైటిల్, అలాగే చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు.
నటీనటులు: పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల, జోజు జార్జ్ తదితరులు
ప్రొడక్షన్ డిజైనర్: ఎ ఎస్ ప్రకాష్
ఎడిటర్: నవీన్ నూలి
సమర్పణ: శ్రీకర స్టూడియోస్
నిర్మాతలు ఎస్. నాగవంశీ, సాయి సౌజన్య
రచన- దర్శకత్వం: శ్రీకాంత్.ఎన్.రెడ్డి
పీఆర్ఓ: లక్ష్మి వేణుగోపాల్


Click it and Unblock the Notifications











