twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రూ.10 కోట్లకు పైగా మోసం.. ఇబ్బందుల్లో పడిన మోహన్ లాల్.. ఈడీ నోటీసులు!

    |

    మంచి నటుడిగా దేశవ్యాప్తంగా గుర్తింపును అందుకున్న మోహన్ లాల్ కు అభిమానుల్లో ప్రత్యేకమైన గౌరవం ఉంది. అలాగే రాజకీయ ప్రముఖులు కూడా ఆయనతో ఛాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అయితే ఆయన అప్పుడప్పుడు చేసే కొన్ని పొరపాట్లతో ఊహించని వివాదాల్లో నిలుస్తున్నారు. ఇక ఇటీవల ఆయనపై మరొక ఆరోపణ హాట్ టాపిక్ గా మారింది. మోహన్ లాల్ కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED) నుంచి నోటీసులు అందాయి. ఈ వార్త ఒక్కసారిగా దేశవ్యాప్తంగా వైరల్ అయ్యింది. ఒక వ్యక్తి కారణంగా మోహన్ లాల్ ఈ కేసులో చిక్కుకోవాల్సి వచ్చినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

    రంగంలోకి దిగిన ఈడీ..

    రంగంలోకి దిగిన ఈడీ..

    గత రెండు రోజులుగా మోహన్ లాల్ కు సంబంధించిన కొన్ని వార్తలు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. పురాతన వస్తువుల డీలర్లతో మోహన్ లాల్‌కు ఉన్న ఆరోపణ సంబంధ వలన ఆయన ఒక కేసులో ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తోంది. రంగంలోకి దిగిన ఈడీ మోహన్ లాల్‌ ను విచారించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. అందుకోసం ఆయనకు నోటీసులు అందినట్లు సమాచారం.

    రూ.10 కోట్లకు పైగా మోసం

    రూ.10 కోట్లకు పైగా మోసం

    ఇక కేరళకు చెందిన మాన్సన్ మాన్‌కల్ అనే వ్యక్తి గత కొన్నేళ్లుగా పురాతన ఆర్ట్ డీలర్‌ గా అక్రమ దందాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఇదివరకే అతను పలువురి నుంచి దాదాపుగా రూ.10 కోట్లకు పైగా మోసం చేసినట్లు సమాచారం. ముఖ్యంగా టిప్పు సుల్తాన్ సింహాసనం, ఔరంగజేబు ఉంగరం, ఛత్రపతి శివాజీ, భగవద్గీత కాపీ మొదలైన కొన్ని వస్తువులను అక్రమంగా విక్రయించినట్లు తెలుస్తోంది.

    రెడ్ హ్యాండెడ్ గా..

    రెడ్ హ్యాండెడ్ గా..

    పురాతన వస్తువులను విక్రయించడం ద్వారా అతని బ్యాంక్ ఖాతాలో రూ. 2.62 కోట్లు జమ అయ్యాయని, దానిని విత్‌ డ్రా చేసుకోవడానికి రూ. 10 కోట్లు అవసరమని ఫిర్యాదుదారులను నమ్మించి మోసం చేసినట్లు పోలీసులు ఇదివరకే కోర్టులో ఒక నివేదిక సమర్పించారు. అయితే రీసెంట్ గా అదే తరహాలో అతను మరో ప్రాచీన కాలంకు చెందిన వస్తువు విషయంలో డీలింగ్స్ చేస్తుండగా కేరళ పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడినట్లు తెలుస్తోంది.

     మోహన్ లాల్ కు నోటీసులు

    మోహన్ లాల్ కు నోటీసులు

    రూ.10 కోట్ల చీటింగ్ కేసులో మాన్సన్ మాన్‌కల్‌ను అరెస్ట్ చేసిన కేరళ పోలీసులు అతనికి పలువురు రాజకీయ నాయకులు సినీ సెలబ్రెటీలతో కూడా సంబంధాలు ఉన్నట్లు కనుగొన్నారు. అయితే అతడికి మోహన్‌లాల్‌తో కూడా సంబంధాలున్నట్లు గుర్తించారు. మోహన్ లాల్ మాన్సన్ ఇంటికి వెళ్లి అతనితో మనీలాండరింగ్‌ లో పాల్గొన్నట్లు కూడా ఈడీ అధికారులు కొన్ని ఆధారాలు కనుగొన్నట్లు సమాచారం. ఇక ఇదే విషయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మోహన్ లాల్‌కు రీసెంట్ గా నోటీసులు అందించింది.

    విచారణ తప్పదు!

    విచారణ తప్పదు!

    ఈ కేసులో మోహన్ లాల్ ను కొన్ని ప్రశ్నల కోసం వచ్చే వారం ED కార్యాలయానికి రావాల్సిందిగా నోటీసులో పేర్కొన్నారు. మోహన్ లాల్‌పై ఇదివరకే ఆరోపణలు వచ్చినప్పటికీ ఆధారాలు దొరికిన తరువాతనే ఆయనకు నోటీసులు ఇవ్వాలని వేచి చూసినట్లు సమాచారం. మోహన్ లాల్ ED నోటీసుల గురించి తెలుసుకున్న మలయాళ చిత్ర పరిశ్రమ షాక్ అయ్యింది. ఇక ఈ విషయంలో మోహన్ లాల్ కూడా స్పంధించాల్సి ఉంది

    English summary
    Malayalam actor Mohanlal summoned by ED in money laundering case
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X