twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సీనియర్ నటుడు, గాయకుడు ఇకలేరు.. 107 ఏళ్ల వయసులో కన్నుమూత

    |

    శతాధిక వయసున్న నటుడు, మలయాళ గాయకుడు పప్పుకుట్టీ భాగవతార్ ఇక లేరు. కేరళ సైగల్‌గా పిలుచుకొనే భగవతార్ వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతూ జూన్ 22వ తేదీ రాత్రి కోచిలోని తన నివాసంలో కన్నుమూశారు. ఆయన వయసు 107 సంవత్సరాలు. 1910లో మైఖేల్, అన్నా దంపతులకు రెండో బిడ్డగా ఆయన జన్మించారు. భార్య బేబీ 2017లో మరణించారు. ఇక భగవతార్ వ్యక్తిగత, ప్రొఫెషన్ జీవితాల్లోకి వెళితే..

    భగవతార్ మరణంపై సీఎం పినరయి విజయన్ అధికారికంగా స్పందించారు. భగవతార్ బాల నటుడిగా మలయాళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. థియేటర్, సినిమా రంగాల్లో దాదాపు ఏడు దశాబ్దాలపాటు సేవలందించారు. కేరళ సాంస్కృతిక ప్రపంచం భగవతార్ సేవలను ఎప్పటికీ గుర్తుంచుకొంటుంది అని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తన సంతాప ప్రకటనలో తెలిపారు.

     Malayalam Actor Pappukutty Bhagavathar died at the age of 107

    భగవతార్ కెరీర్ విషయానికి వస్తే.. మలయాళ చిత్ర పరిశ్రమలో ఆయన దాదాపు 25 హిట్ చిత్రాల్లో నటించారు. విరుథాన్ శంకు, కాటుకురగంగు, పడిచా కల్లాన్, విలకురంజ మనుష్యార్ లాంటి చిత్రాల్లో నటించారు. ఆయన రంగస్థలంపై కూడా అత్యంత ప్రేక్షకాదరణ ఉన్న నటుడిగా ఖ్యాతి సంపాదించారు. దాదాపు 10 వేల నాటకాలను కేరళలో ప్రదర్శించారు.

    2009లో గాయకుడిగా మారి సంగీత అభిమానులు ఆకట్టుకొన్నారు. మేరక్కుందొరు కుంజాడు చిత్రంలో ఎంతడుక్కే వన్నడుక్కుమ్ ఆనే పాట హిట్ కావడం, ప్రేక్షకులు, సంగీత అభిమానులను విశేషంగా ఆకట్టుకోవడంతో గాయకుడిగా మంచి గుర్తింప లభించింది.

    English summary
    Malayalam Actor and Singer Pappukutty Bhagavathar died at the age of 107. He died on June 22nd night, suffering with age related issues. Kerala CM Pinarayi Vijayan condolences to Pappukutty Bhagavathar.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X