Don't Miss!
- News
మహానాడు పెట్టింది అందుకేనా? చంద్రబాబు టీడీపీకి పట్టిన శని: మంత్రి రోజా హాట్ కామెంట్స్
- Automobiles
మహీంద్రా బొలెరో సిటీ పికప్ ట్రక్కు విడుదల: ధర, ఫీచర్లు మరియు ఇతర వివరాలు
- Sports
ఆర్సీబీ అభిమానుల పాలిట విలన్‌గా మారిన దినేష్ కార్తీక్.. ఎంత పెద్ద తప్పు చేశాడంటే?
- Finance
Petrol prices today: ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపు తర్వాత కూడా స్థిరంగా పెట్రోల్ ధరలు
- Lifestyle
Today Rasi Phalalu :ఈ రాశుల వారికి ఈరోజు శుభ ఫలితాలు రానున్నాయి...!
- Technology
ఇండియాలో లాంచ్ అయ్యే ఒప్పో A57 & A57s 4G ఫోన్ల ఫీచర్స్ ఆన్లైన్లో లీక్ అయ్యాయి
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
యంగ్ హీరో పై రేప్ కేసు.. అవకాశాల పేరుతో వాడుకున్నారంటూ ?
మహిళల రక్షణ కోసం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వారి మీద అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. నిత్యం ఏదో ఒక చోట మహిళల మీద లైంగిక దాడులు జరుగుతున్న విషయాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా సినీ పరిశ్రమకు చెందిన ఒక హీరో కం ప్రొడ్యూసర్ అత్యాచారం చేసినట్లుగా కేసు నమోదైంది.. ఎవరు ఆ నటుడు? ఏమిటి వివరాలు అనే వివరాల్లోకి వెళితే

మంచి గుర్తింపు
మలయాళ సినీ పరిశ్రమలో ఒక పక్క నటుడిగా కొనసాగుతూనే మరోపక్క నిర్మాతగా వ్యవహరిస్తున్నారు విజయ్ బాబు. స్వతహాగా వ్యాపారవేత్త అయిన ఆయన సినీ పరిశ్రమ మీద మక్కువతో మలయాళం సినీ పరిశ్రమలో ఎంటర్ అయి ఫ్రైడే ఫిలిం హౌస్ అనే ఒక నిర్మాణ సంస్థను స్థాపించి దాని ద్వారా సినిమాలు నిర్మిస్తున్నారు. మొట్టమొదటిసారిగా ఫిలిప్స్ అండ్ ది మంకీ పెన్ అనే సినిమాలో నటించడంతో పాటు దానిని స్వయంగా నిర్మించి మలయాళ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

రాష్ట్ర చలనచిత్ర పురస్కారం కూడా
ఆ సినిమా తర్వాత ఆయన పెరుచాజి (2014), ఆడు (2015), ముద్దుగౌవ్ (2016), ఆడు 2 (2017), హోమ్ (2021) చిత్రాలను నిర్మించడంతో పాటు తాను నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన మొట్టమొదటిసారిగా నిర్మించిన ఫిలిప్స్ అండి మంకీ పెన్ సినిమా ఆయనకు మంచి పేరు తీసుకు రావడమే కాక అవార్డులు కూడా తెచ్చిపెట్టింది. ఆ సినిమాకు ఉత్తమ పిల్లల చిత్రంగా కేరళ రాష్ట్ర చలనచిత్ర పురస్కారం కూడా ఆయనకు లభించింది.

రేప్ కేసు నమోదు
అంతేకాక
ఆయన
చివరిగా
నిర్మించిన
సూఫియుమ్
సుజాతయుమ్
అనే
సినిమా
అమెజాన్
ప్రైమ్
వేదికగా
విడుదలైంది
ఆయన
అనేక
ప్రయోగాత్మక
సినిమాలను
నిర్మిస్తా
అనే
పేరు
ఉంది.
అలా
మలయాళ
సినీ
పరిశ్రమలో
మంచి
పేరు
తెచ్చుకున్న
విజయ్
బాబు
మీద
ఇప్పుడు
రేప్
కేసు
నమోదు
అయింది.
కోజికోడ్
లో
ఉండే
ఒక
యువతి
ఇచ్చిన
ఫిర్యాదు
మేరకు
ఆయన
మీద
ఎఫ్ఐఆర్
నమోదు
అయింది.
ఎర్నాకులం
సౌత్
పోలీసులు
కేసు
నమోదు
చేసి
దర్యాప్తు
చేస్తున్నారు.

పోలీసులకు ఫిర్యాదు
సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని చెబుతూ ఎర్నాకులం లో ఉన్న తన ఫ్లాట్ లో తన మీద అనేకసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు ఆరోపించింది.. ఈ మేరకు ఈనెల 22వ తేదీన విజయ్ బాబు మీద సదరు యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం పోలీసులు ఇంకా విజయ్ బాబును విచారణ చేయలేదని తెలుస్తోంది.

సంప్రదించేందుకు ప్రయత్నించలేదని
విజయ్
బాబు
మీద
అత్యాచారం
సహా
తీవ్రంగా
గాయపరిచిన
ఆరోపణల
మీద
కేసు
నమోదు
కాగా
ఈ
కేసు
గురించి
విజయ్
బాబు
స్పందిస్తూ
ఆ
మహిళ
తనకు
2018
నుంచి
తెలుసని,
ఆడిషన్
తర్వాత
ఆమెకు
తన
ప్రొడక్షన్‌లో
నటించే
అవకాశం
ఇచ్చానని
బాబు
చెప్పారు.
"తాను
డిప్రెషన్‌తో
బాధపడుతున్నట్లు
ఆమె
నాకు
చాలా
సందేశాలు
పంపింది.
ఆ
సందేశాలకు
సంబంధించిన
దాదాపు
400
స్క్రీన్‌షాట్‌లు
నా
వద్ద
ఉన్నాయి.
గత
ఏడాదిన్నరగా
నేను
ఆ
మహిళకు
ఎలాంటి
మెసేజ్‌లు
పంపలేదు,''
అని
అన్నారు.
తన
ప్రతిష్టను
దిగజార్చిన
ఆమె
మీద
ఫిర్యాదు
చేస్తానని
బాబు
చెప్పారు.
"ఫిర్యాదు
చేసిన
వ్యక్తిపై
నేను
పరువు
నష్టం
కేసు
వేస్తాను.
కొత్త
'మీ
టూ'కి
నాంది
పలకండి.
కొత్త
పోరాటాన్ని
ప్రారంభిద్దాం,''
అని
అన్నారు.