షాకింగ్ : ఇంట్లో ఉరికి వేలాడుతూ కనిపించిన నటుడు.. మొన్ననే షూట్ నుంచి రావడంతో!
సౌత్ ఇండస్ట్రీ నుంచి మరో విషాద వార్త బయటకు వచ్చింది. ప్రముఖ మలయాళ టీవీ నటుడు రమేష్ వలీయసాల ఈరోజు అంటే శనివారం అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయారు. ఈ రోజు ఉదయం అతని మృతదేహం అతని ఇంటి గదిలో వేలాడుతూ కనిపించింది. ప్రాథమిక దర్యాప్తులో, ఇది ఆత్మహత్య కేసు అని చెప్పబడింది. అందుతున్న సమాచారం ప్రకారం అతను చాలా కాలంగా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడని అంటున్నారు. ప్రస్తుతం, పోలీసులు అసహజ మరణం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇక ప్రస్తుతానికి మృతదేహాన్ని ప్రభుత్వ హాస్పిటల్ మార్చురీలో ఉంచారు. రమేష్ రెండు రోజుల క్రితం తన కొత్త ప్రాజెక్ట్ షూటింగ్ నుంచి తిరిగి వచ్చాడని చెబుతున్నారు. అయితే రమేష్ వలీయసాల ఆకస్మిక మరణ వార్త మొదట నిర్మాత మరియు ప్రొడక్షన్ కంట్రోలర్ NM బాదుషా సోషల్ మీడియాలో ఇచ్చారు.
ఇక రమేష్ వలీయసాల పరిశ్రమలో అత్యంత ప్రసిద్ధ మరియు బిజీ నటుల్లో ఒకరు. రమేష్ గత 22 సంవత్సరాలుగా సీరియల్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నారని అంటున్నారు. ఇక సీరియల్స్ కాకుండా, వలీయసాల అనేక చిత్రాల్లో కూడా నటించారు. రమేష్ వలీయశాల తన కృషి మరియు అంకితభావంతో థియేటర్ నుంచి సీరియల్ పరిశ్రమ దాకా ప్రయాణించాడు. అందుకున్న సమాచారం ప్రకారం, రమేష్ వలీయశాల ప్రభుత్వ మోడల్ స్కూల్ నుండి తన పాఠశాల విద్యను అభ్యసించారు. అదే సమయంలో, చదువుతో పాటు, అతను నాటక రంగంలో చురుగ్గా ఉండడంతో నెమ్మదిగా దానినే వృత్తిగా ఎంచుకున్నారు.

ఇక నిర్మాత మరియు ప్రొడక్షన్ కంట్రోలర్ NM బాదుషా సోషల్ మీడియాలో నటుడి మరణం గురించి మొదట ప్రకటించారు. "చాలా సమస్యలు ఉంటాయి. కానీ జీవితం నుండి పారిపోవడం ఏమిటి .. నా ప్రియమైన స్నేహితుడు రమేష్‌కు నివాళి "అని బాదుషా ఫేస్‌బుక్‌లో రాశారు. రమేష్ తన కాలేజీ రోజుల తర్వాత తన స్నేహితులతో కలిసి డ్రామా స్టేజ్‌కి వచ్చాడు మరియు గత 22 సంవత్సరాలుగా అతను చాలా బిజీగా మారారు. ఇక ఒకరకంగా తమిళ పరిశ్రమ కూడా ఆత్మహత్యల కారణంగా చాలా మరణాలను చూస్తోంది. కొంతకాలం క్రితం, నటి చిత్ర కూడా తన జీవితాన్ని తానే అంతం చేసుకుంది, ఆమె పాండియన్ స్టోర్స్ అనే సీరియల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె తన వైవాహిక జీవితంలో సమస్యలు ఎదుర్కొని ఆత్మహత్యకు పాల్పడింది. కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పనిచేసిన తమిళ టెలివిజన్ నటుడు ఇంద్ర కుమార్ కూడా ఫిబ్రవరి 19, 2021 లో పెరంబలూర్‌లోని స్నేహితుడి ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని చనిపోయాడు. ఇప్పుడు కేరళకు చెందిన రమేష్ చనిపోవడం బాధాకారంగా మారింది.


Click it and Unblock the Notifications











