డ్రగ్స్ కేసులో కోర్టు సంచలన తీర్పు.. కొకైన్ కేసులో స్టార్ యాక్టర్‌కు భారీ ఊరట!

కేరళలో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో కోచి అడిషినల్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. 2015 సంవత్సరంలో నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్స్ (ఎన్‌డీపీఎస్) యాక్ట్, 1985 కింద నమోదైన కేసులో షైన్ టామ్ చాకో, ఇతరులను నిర్ధోషులుగా ప్రకటిస్తూ తుది తీర్పు వెల్లడించింది. దాంతో చాకోతోపాటు పలువురు నటులకు ఊరట కలిగించింది. కేరళలో నమోదైన ఫస్ట్ కొకైన్ కేసుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

కేరళలోని ఓ ఫ్లాట్‌పై నార్కోటిక్ కంట్రోల్ అధికారులు మెరుపు దాడి చేసిన ఘటనలో షైన్ టామ్ చాకో, పలువురు నటులు, కొందరు మోడల్స్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. జనవరి 30వ తేదీన కోచిలోని కడవంతర అనే ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈకేసులో రేష్మా రంగస్వామి, బ్లెససీ సిల్వస్టెర్, త్రించీ బాబు, స్నేహ బాబు, పృథ్వారాజ్, జస్బీర్ సింగ్ తదితరులను అరెస్ట్ చేశారు. రేష్మా, జస్బీర్ అనే తారలకు 10 గ్రాముల కొకైన్ సరఫరా చేశారనే ఆరోపణలు వచ్చాయి.

Malayalam Actor Shine Tom Chako acquitted in 2015 Cocaine Case

డ్రగ్స్ పార్టీ జరుగుతున్నదనే సమాచారంతో రైడ్ చేసిన సమయంలో వీరంతా కొకైన్‌ను టాయ్‌లెట్‌లో వేసి ఫ్లష్ చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఆ ఫ్లాట్‌లో దాడి చేసిన సమయంలో తీసిన ఫోటోలను, డ్రగ్స్ ఆనవాళ్లకు సంబంధించిన వీడియోలను కోర్టుకు దాఖలు చేశారు. ఈ కేసులో అరెస్టైన వారు రెండు నెలలపాటు జైలులో ఉన్నారు. మార్చిలో వారికి బెయిల్ లభించడంతో జైలు నుంచి విడుదల అయ్యారు.

సుదీర్ఘంగా సాగిన కేసు విచారణలో సరైన సాక్ష్యాలను సేకరించడంలోను, కోర్టుకు సమర్పించడంలో కేరళ పోలీసులు విఫలమయ్యారు. నిందితులు కొకైనా తీసుకొన్నట్టు ఎలాంటి ఆధారాలను సమర్పించకపోవడం, బ్లడ్ శాంపిల్స్‌లో కొకైన్ తీసుకొన్నట్టు ఆధారాలు లభించకపోవడంతో కోర్టు ఈ కేసులో నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది.

Malayalam Actor Shine Tom Chako acquitted in 2015 Cocaine Case

కేరళ సినిమా పరిశ్రమలో సంచలనం రేపిన డ్రగ్స్ కేసును ఎర్నాకులం సెషన్ కోర్టు విచారించింది. ఈ కేసులో టామ్ ఛాకో తరుఫు న్యాయవాది బలమైన వాదనలు వినిపించారు. 2015 నుంచి సాగిన ఈ కేసు విచారణను మంగళవారం (ఫిబ్రవరి 11వ తేదీన ) తుది తీర్పు వెల్లడించింది. ఈ కేసులో హైన్ టామ్ చాకోను విముక్తి చేసింది. దాంతో ఆయనకు భారీ ఊరట లభించింది.

More from Filmibeat

Read more about: malayalam
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X