twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గుడిలో వివాహం చేసుకున్న ప్రముఖ నటుడు.. వధువు ఎవరో తెలుసా!

    |

    సెలెబ్రిటీలు, సినీ తారలు ఎక్కువగా మీడియాకు దూరంగా ఉండేందుకు ఇష్టపడతారు. తమ వ్యక్తిగత విషయాలు బయటకు వెళ్లకుండా జాగ్రత్తపడుతుంటారు. ప్రేమలో మునిగితేలుతూ సడన్ గా వివాహం చేసుకున్న సెలెబ్రిటీలు చాలా మందే ఉన్నారు. మలయాళీ చిత్ర పరిశ్రమలో కూడా ప్రేమ వ్యవహారాలు ఎక్కువగానే జరుగుతుంటాయి. ఇదిలా ఉండగా ప్రముఖ మలయాళీ నటుడు సన్నీ వాయన్ ఓ ఇంటివాడయ్యాడు. తాను వివాహం చేసుకున్నట్లు సడెన్ గా సోషల్ మీడియాలో ప్రకటించి షాక్ ఇచ్చాడు.

    క్రేజీ నటుడిగా

    క్రేజీ నటుడిగా

    సన్నీ వాయన్ నటనకు ప్రాధానత్య ఉన్న పాత్రలతో మెప్పిస్తూ దూసుకుపోతున్నాడు. 2012లో దుల్కర్ సల్మాన్ నటించిన సెకండ్ షో చిత్రంలో విలన్ పాత్రలో సన్నీ వాయన్ మెప్పించాడు. ఆ తర్వాత విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అతడికి మంచి అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే సన్నీ వాయన్ 30 పైగా చిత్రాల్లో నటించి మెప్పించాడు. వాయన్ కు ఇప్పుడిప్పుడే తమిళంలో కూడా అవకాశాలు దక్కుతున్నాయి.

     గుడిలో వివాహం

    గుడిలో వివాహం

    సన్నీ వాయన్ బుధవారం రోజు ఉదయం వివాహం చేసుకున్నాడు. కేరళకు చెందిన రెంజిని అనే మహిళతో సన్నీ వాయన్ వివాహం జరిగింది. గురువాయూర్ లోని శ్రీ కృష్ణ ఆలయంలో ఈ జంట వివాహం జరిగింది. ఈ విషయాన్ని సన్నీ వాయన్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. కొద్ది సేపటిక్రితమే నా వివాహం జరిగింది అంటూ వాయన్ ప్రకటించాడు. ఈ సందర్భంగా వాయన్ పెళ్లి ఫోటోలని కొన్నింటిని సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

    వధువు ఎవరంటే

    వధువు ఎవరంటే

    సన్నీ వాయన్ వివాహం చేసుకున్న రెంజిని కొచ్చి నగరానికి చెందిన మహిళ. ఆమె కొచ్చిలో క్షేత్ర డాన్స్ స్కూల్ ని స్థాపించారు. వీరిద్దరిదీ పెద్దలు కుదిర్చిన వివాహమా లేక ప్రేమ వివాహమా అనేది తెలియాల్సి ఉంది. వాయన్, రెంజిని వివాహానికి కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారట. వాయన్ కేరళ సంప్రదాయం ప్రకారం పంచె కట్టులో కనిపిస్తున్నాడు. రెంజిని తెల్ల చీర ధరించి కనిపిస్తోంది. సోషల్ మీడియాలో సెలెబ్రిటీలు, అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

    శుభాకాంక్షల వెల్లువ

    శుభాకాంక్షల వెల్లువ

    ప్రముఖ మలయాళీ హీరోయిన్ మంజిమ మోహన్, స్టార్ హీరో నవీన్ పౌలి, ఇతర సెలెబ్రిటీలు సన్నీ వాయన్, రెంజిని జంటకు మ్యారేజ్ విషెష్ చెబుతున్నారు. ఇదిలా ఉండగా సన్నీ వాయన్ ప్రస్తుతం క్వీన్ మలయాళీ రీమేక్ జామ్ జామ్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో మంజిమ మోహన్ ప్రధాన పాత్రలో నటిస్తోంది.

    English summary
    Malayalam actor Sunny Wayne ties the knot with Renjini at Guruvayoor temple
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X