రేప్ కేసు తేలక ముందే నటుడి అరెస్ట్.. నోరు జారడంతోనే చిక్కుల్లో?

మహిళా నటిపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మలయాళ నటుడు విజయ్ బాబుకు కేరళ హైకోర్టు గత బుధవారం ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసు విచారణ కోసం జూన్ 27న దర్యాప్తు అధికారి ముందు లొంగిపోవాలని కోరింది. కానీ ఈ విషయమై విజయ్ బాబు ఎర్నాకులం పోలీస్ స్టేషన్‌లో హాజరయ్యారని, ఆ తర్వాత పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారని చెబుతున్నారు. అదే సమయంలో లైంగిక వేధింపుల కేసుకు సంబంధించి నటుడిని జూలై 3 వరకు విచారించే ఈ విషయం కోసం ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు చేసేందుకు ఏర్పాటైన బృందం జూలై 3వ తేదీ సోమవారం వరకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే విజయ్‌బాబును విచారించేందుకు అనుమతిని పొందినట్లు సమాచారం.

మలయాళ నటుడు, నిర్మాత అయిన విజయ్ బాబుపై లైంగిక వేధింపులు, అత్యాచారం వంటి తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. ఆ మహిళ ఎర్నాకులం సౌత్ పోలీస్ స్టేషన్‌లో విజయ్ బాబుపై కేసు పెట్టింది. ఆ అనంతరం పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. అదే సమయంలో విజయ్ బాబు కూడా ముందస్తు బెయిల్ కోసం కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ తర్వాత కోర్టు నుంచి అనుమతి కూడా వచ్చింది. అయితే ఇప్పుడు పోలీసులు అతడిని అరెస్ట్ చేయడం ఆసక్తికరంగా మారింది. అత్యాచార బాధితురాలి గుర్తింపును వెల్లడించినందుకు విజయ్ బాబుపై నమోదైన కేసుకు సంబంధించి, పోలీసులు నటుడిపై ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 228A - ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 67 కింద అభియోగాలు మోపారు.

 Malayalam actor Vijay Babu arrested in sexual assault case

ఈ సెక్షన్ల కింద ఉన్న నేరాలు బెయిలబుల్ అయినందున, ముందస్తు బెయిల్ పిటిషన్‌ను విచారించడం సాధ్యం కాదని కోర్టు గతంలో పేర్కొంది. ఇక ఈ విషయమై ఫేస్‌బుక్ లైవ్‌లో స్పందించిన విజయ్ బాబు తాను నిర్దోషి అని ప్రకటించుకున్నాడు. దీంతో పాటు మహిళపై పరువునష్టం కేసు పెట్టాలని కూడా యోచిస్తున్నానని పేర్కొన్నారు. ఈ ఆరోపణల తర్వాత, విజయ్ బాబు అమ్మ ఎగ్జిక్యూటివ్ కమిటీ నుంచి కూడా తప్పుకోవాల్సి వచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు విజయ్‌బాబుపై చర్యలు తీసుకుంటామని కమిటీ అధికార ప్రతినిధి ఎడవెల బాబు విలేకరుల సమావేశంలో తెలిపారు. అత్యాచార బాధితురాలిని అని చెప్పుకుంటున్న నటి పేరు బహిర్గతం చేయడం వల్లే అరెస్ట్ చేసినట్టు చెబుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X