For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నటుడితో రెండో పెళ్లి పెటాకులు…13 ఏళ్ల బాలుడి తల్లితో అఫైర్.. నటి సంచలనం !

  |

  ఒకప్పుడు సోషల్ మీడియా అంతగా విస్తృతంగా కాని రోజుల్లో ఈ వార్తలు వెలుగులోకి రావడానికి చాలా రోజులు పట్టేది. కానీ ప్రపంచమంతా అరచేతిలోకి వచ్చేసిన ఈ రోజుల్లో ఏం జరిగినా క్షణాల్లో తెలిసిపోతోంది. తాజాగా రెండో పెళ్లి చేసుకున్న నటి తన భర్త తన మోసం చేస్తున్నాడు అంటూ సంచలన ఆరోపణలు చేసింది. ఆమె మరెవరో కాదు మలయాళ టెలివిజన్ నటి అంబిలి దేవి. తన భర్త తనను మోసం చేసి 13 యేళ్ళ కొడుకు ఉన్న ఒక మహిళతో అక్రమ సంబంధం నెరుపుతున్నాడు అంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.

  బొడ్డు చూపిస్తూ సెగలు రేపిన పాయల్ రాజ్‌పుత్.. మరో రేంజ్‌లో సెక్స్ అప్పీల్

   ఆమెకు రెండో పెళ్లి, ఆయనకి నాలుగు

  ఆమెకు రెండో పెళ్లి, ఆయనకి నాలుగు

  మలయాళ బుల్లితెర జంట అంబిలి దేవి, ఆదిత్యన్ ల వివాహం 2019 సంవత్సరంలో జరిగింది. అప్పట్లోనే ఈ వివాహం పెను సంచలనానికి కారణమైంది. ఎందుకంటే అప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న ఆదిత్యన్ తో భర్తకు విడాకులు ఇచ్చి మరీ అంబిలి దేవి పెళ్లి చేసుకోవడం సంచలనం రేపింది. అయితే ఈ మధ్యలో వారు విడాకులు తీసుకోబోతున్నారు అంటూ సంచలన ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఆమె స్పందిస్తూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. తాను ఇప్పటికీ ఆదిత్యన్ భారీగానే ఉన్నానని ఆమె చెప్పుకొచ్చింది. ఎన్నో ఒత్తిడులు, ఒడుదొడుకులు దాటి అతనిని రెండో వివాహం చేసుకున్నానని మా ప్రేమకు గుర్తుగా నేను గర్భం దాల్చే వరకు ఎంతో సంతోషంగా గడిపామని అని చెప్పుకొచ్చింది.

   లాక్ డౌన్ లోనే అంతా

  లాక్ డౌన్ లోనే అంతా

  ఎప్పుడైతే నేను గర్భందాల్చి షూట్ కి కూడా బ్రేక్ చెప్పి బెడ్ రెస్ట్ తీసుకోవడం మొదలు పెట్టానో, అప్పుడే లాక్ డౌన్ మొదలైందని ఆమె చెప్పుకొచ్చింది. అదే సమయంలో ఆదిత్య 13 యేళ్ళ కొడుకు ఉన్న ఒక మహిళతో ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకున్నాడనే విషయం తనకు తెలిసిందని చెప్పుకొచ్చింది. అయితే తాను భర్తను ఎంతో నమ్మాను కాబట్టి అతను ఆ పని చేశాడని తాను ముందు నమ్మలేదని ఆమె చెప్పుకొచ్చింది. కొందరు కావాల్సిన వాళ్ళు కూడా ఫోన్ చేసి ఆమె మళ్లీ గర్భవతిగా ఉంది అని చెప్పినా నేను నమ్మలేదని తర్వాత తర్వాత మళ్లీ అమ్మవి కాబోతున్నావట కదా అని కొందరు ఏడిపించడానికి ఫోన్లు చేసేవారు అని చెప్పుకొచ్చింది.

  విడాకులు వద్దంటున్నా వినట్లేదు

  విడాకులు వద్దంటున్నా వినట్లేదు

  ఇవన్నీ వింటున్నప్పుడు తాను అయోమయానికి లోనయ్యే దానిని అని ఆమె పేర్కొన్నారు. ఇదంతా తెలిసి ఆదిత్యన్ ను నిలదీస్తే అవును నిజమే విడాకులు ఇచ్చి చేయాలని కోరుతున్నాడని చెప్పుకొచ్చింది. కానీ తనకు విడాకులు తీసుకోవడం ఇష్టం లేదని ఆమె పేర్కొంది. అయితే ఆదిత్యన్ మాత్రం ఆ మహిళ సర్వస్వం అన్నట్టు మాట్లాడుతున్నాడని నాకు విడాకులు వద్దు మనం ఇప్పటికైనా మించిపోయింది లేదు కలిసుందామని కోరుతున్నానని ఆమె చెప్పుకొచ్చింది. కానీ ఆదిత్యన్ అవేమీ పట్టించుకోకుండా ఆ మహిళ కోసం మాట్లాడుతున్నాడని, తనని ఎంతో ప్రేమగా చూసుకునే ఆదిత్య ఆమె కోసం ఎందుకు ఇలా మారిపోయాడో అర్థం కావడం లేదని చెప్పుకొచ్చింది. అసలు కలిసుందామని అంటే అతను తనను లెక్క చేయడం లేదని ఆమె వాపోయింది.

   ఎనిమిదేళ్ళ కొడుకు

  ఎనిమిదేళ్ళ కొడుకు

  మలయాళ నటి అంబిలి దేవి 2019లో ఆదిత్యన్ జయన్‌ ను రెండో వివాహ్డం చేసుకున్నారు. ఆమెకు ఇంతకు ముందు వివాహం అయింది. 2009 నుండి 2018 వరకు ఫిల్మ్-సీరియల్ కెమెరామెన్ లోవల్‌ తో ఆమె కలిసి ఉన్నారు. వారికి అమర్‌నాథ్ అనే కుమారుడు ఉన్నారు, అమర్‌నాథ్ 2013 లో జన్మించారు. అయితే లోవల్‌ తో విడిపోయిన అంబిలి తన ప్రస్తుత భర్త ఆదిత్యన్ ఒక వివాహిత మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని తనను మోసం చేశాడని ఆరిపించడం చర్చనీయాంశంగా మారింది.

  English summary
  Malayalam television stars Ambili Devi and Adithyan Jayan tied the knot in 2019. She was earlier married to film-serial cameraman Loval from 2009 to 2018. Ambili's marriage has become a talking point for everyone after she accused her current husband Adithyan of cheating on her with a married woman whom he has now impregnated.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X