లవర్‌ను పెళ్లి చేసుకోబోతున్న యంగ్ హీరోయిన్.. వరుడు ఎవరంటే.. !

మలయాళ చిత్ర పరిశ్రమలో రాణిస్తున్న వర్థమాన తార మియా జార్జ్ త్వరలోనే పెళ్లికూతురు కాబోతున్నది. కెరీర్ పీక్‌లో ఉండగానే వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకోవడం సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. తనకు ఎన్నో ఏళ్లుగా పరిచయం ఉన్న స్నేహితుడిని వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకోవడం, అందుకు ఆమె కుటుంబ సభ్యుల నుంచి సానుకూల స్పందన రావడంతో పెళ్లికి అడుగులు పడుతున్నాయి. తాజాగా జరిగిన నిశ్చితార్థం వివరాలు..

అందం, అభినయంతో

అందం, అభినయంతో

మలయాళ చిత్ర పరిశ్రమలో మియా జార్జ్ తనదైన శైలిలో ఆకట్టుకొంటున్నారు. అందం, అభినయం కలబోసి ఉన్న ఈ నటి తొలుత టెలివిజన్ రంగంలో కెరీర్ ఆరంభించారు. ఆమె హోస్టుగా కొనసాగుతుండగానే వచ్చిన రెడ్ వైన్, మెమొరీస్ లాంటి అవకాశాలను అందిపుచ్చుకొన్నారు. ఆ చిత్రాల్లో ఆమె ఫెర్ఫార్మెన్స్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో నటిగా కొనసాగారు.

తాజాగా మియా డ్రైవింగ్ లైసెన్స్‌లో

తాజాగా మియా డ్రైవింగ్ లైసెన్స్‌లో

ఇటీవల కాలంలో ఆర్య సోదరుడు సత్యతో నటించిన ఆమరకావ్యం చిత్రంలోని తన పాత్రకు మంచి ప్రేక్షకాదరణ లభించింది. ఇక తాజాగా విడుదలైన డ్రైవింగ్ లైసెన్స్ సినిమాలో పృథ్వీరాజ్‌తో కలిసి నటించారు. ఈ చిత్రం మలయాళ చిత్ర పరిశ్రమలో బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసుకొన్నది.

చిరకాల మిత్రుడితో

చిరకాల మిత్రుడితో

అయితే తన చిరకాల మిత్రుడు, వ్యాపారవేత్త అశ్విన్ ఫిలిప్‌తో మియా జార్జ్ కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. పెద్దల అంగీకారంతో వారిద్దరి నిశ్చిత్తార్థం కేరళలో నిరాడంబరంగా జరిగింది. ఈ నిశ్చితార్థానికి కుటుంబానికి సంబంధించిన అతికొద్ది మంది మాత్రమే హాజరయ్యారు. వాస్తవానికి వీరి నిశ్చితార్థాన్ని కొట్టాయంలో గ్రాండ్‌గా నిర్వహించాలని ప్లాన్ చేశారు. అయితే కరోనా కారణంగా తమ ప్రయత్నాలను మానుకొన్నారు.

సెప్టెంబర్‌లో మియా పెళ్లి

సెప్టెంబర్‌లో మియా పెళ్లి

ఇక మియా జార్జ్ , అశ్విన్‌తో పెళ్లికి కూడా ముహుర్తాలు నిశ్చయించినట్టు తెలుస్తున్నది. కరోనా పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత పెళ్లి కార్యక్రమం నిర్వహించాలని ప్లాన్ చేసినట్టు సమాచారం. ఈ వేడుకకు పెద్ద ఎత్తున్న సెలబ్రిటీలను ఆహ్వానించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అంతా సవ్యంగా సాగితే సెప్టెంబర్‌లో మియా జార్జ్ పెళ్లి చేయాలని చూస్తున్నట్టు తెలుస్తున్నది.

Recommended Video

Malayalam Young Director Jibit George Passed Away | Filmibeat Telugu
విక్రమ్‌తో కలిసి కోబ్రా చిత్రంలో

విక్రమ్‌తో కలిసి కోబ్రా చిత్రంలో

ప్రస్తుతం విక్రమ్‌తో కలిసి కోబ్రా అనే చిత్రంలో మియా జార్జ్ నటిస్తున్నది. ఈ చిత్రానికి అజయ్ జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక మలయాళంలో ఆమె నటించిన కమనిల్లా చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో ఆమె పోలీస్ ఆఫీసర్‌ పాత్రలో నటిస్తున్నారు. లాక్‌డౌన్ తర్వాత సినిమా హాళ్లలో ప్రదర్శనకు అనుమతి ఇస్తే రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X